Music: సంగీత నిర్మాణ ఖర్చు తగ్గించేందుకే ఈ ప్లాన్, ఇది కొత్త ప్రభంజనం.. కార్మేని సెల్వం మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్
Music Director Ramanujan About Carmeni Selvam: ప్రముఖ నటుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీ రోల్ పోషించిన సినిమా కార్మేని సెల్వం. ఈ సినిమాకు ఓ సంస్థ సంగీతం అందించిన నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. ఆ వివరాలు చూద్దాం.
ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని మెయిన్ లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ తెలుగు, తమిళ సినిమా కార్మేని సెల్వం. స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు రామ్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్ అంటూ మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ సంస్థ ద్వారా రామానుజన్ ఎంకే సంగీతాన్ని అందించారు. ఈ నేపథ్యంలో సినీ, సంగీత విశేషాలను మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ పంచుకున్నారు.

వ్యక్తికి కాకుండా సంస్థకు దక్కాలని
"ఒక చిత్రానికి సంగీతాన్ని అందించిన ఘనత ఏ ఒక్క వ్యక్తికి కాకుండా, ఒక సంస్థకు దక్కాలని కోరుకున్నాం. అందుకే 2017లో బెంగళూరులో ‘Musicloud Studio & Technology’ని ప్రారంభించాను. మొదట్లో కార్పొరేట్ ప్రాజెక్టులను స్వీకరిస్తూ, నెమ్మదిగా నా పనితీరును మెరుగుపరుచుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత మీడియా సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ప్రారంభించాను" అని రామానుజన్ తెలిపారు.
దర్శకుడి పేరు కాకుండా
"మేము సౌండ్ డిజైన్, వాయిస్ ఓవర్లు, డబ్బింగ్ వంటి అన్ని సేవలను అందించాము. ప్రస్తుతం ‘కార్మేని సెల్వం’ ప్రాజెక్టును విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమాకు సంగీతం దర్శకుడి పేరు కాకుండా.. (మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్) మ్యూజిక్ క్లౌడ్ స్టూడియో అండ్ టెక్నాలజీ పేరును ప్రకటించాం" అని రామానుజన్ పేర్కొన్నారు.
రెవెన్యూ మోడల్ రూపొందించాం
"ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి కథాంశాలను ప్రోత్సహించాలంటే, నిర్మాణ వ్యయాన్ని తప్పనిసరిగా తగ్గించాల్సి ఉంది. ఆ దిశగా అడుగులు వేయడానికి ఉన్న మార్గాలలో ఒకటి సంగీత నిర్మాణానికి అయ్యే ఖర్చును తగ్గించాలనుకుని ఈ చిత్రం విషయంలో ఇలా ప్లాన్ చేశాం. ఇటువంటి సేవను వినియోగించుకోవడం ద్వారా, చిత్ర నిర్మాతలకు మ్యూజిక్ క్లౌడ్ స్టూడియోకు మధ్య ఒక రెవెన్యూ మోడల్ రూపొందించబడింది" అని ఆయన పేర్కొన్నారు.
రాయల్టీలో వాటా లభిస్తుంది
"ఈ ఆదాయ నమూనా కింద, సౌండ్ ఇంజనీర్లు, వాయిద్యకారులు, ప్రోగ్రామర్లు సహా ఈ ప్రక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ రాయల్టీలో వాటా లభిస్తుంది. మేము సంగీత నిర్మాణానికి ఒక కార్పొరేట్ నిర్మాణాన్ని తీసుకు వస్తున్నాము. సినీ సంగీత రంగంలో ఇదొక కొత్త ప్రభంజనం అనుకోవచ్చు" అని సంగీత దర్శకుడు రామానుజన్ వెల్లడించారు.
టర్నింగ్ పాయింట్ అయింది
"నేను గతంలో దర్శకుడు రామ్‌తో కలిసి అమృత శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించిన 'కురైయొండ్రుమ్ ఇల్లై' చిత్రానికి పనిచేశా. ఇప్పుడు ‘కార్మేని సెల్వం’ లాంటి గొప్ప ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రానికి సంగీతం అందించే అవకాశం వచ్చింది. డైరెక్టర్ రామ్ చక్రి గారితో పరిచయం నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయింది" అని రామానుజన్ చెప్పుకొచ్చారు.
4 నుంచి 5 మంది కలిసి చేస్తున్నాం
"“కార్మేని సెల్వం” సినిమా కోసం 4 పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఓఎస్‌టీ ట్రాక్స్ కంపోజ్ చేశాను. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. మా మ్యూజిక్ క్లౌడ్ టీమ్‌లో 4-5 మంది కలిసి పనిచేస్తున్నాం. సంగీతం ఎప్పుడూ ఒక వ్యక్తి పని కాదు అది టీమ్ వర్క్" అని మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ అన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


