Carmeni Selvam Teaser: సగటు మనిషి జీవితాన్ని ప్రతిబింబించేలా కార్మేని సెల్వం- ఆలోచింపజేసేలా టీజర్- గోప్యంగా ఆ పాత్ర!
Carmeni Selvam Teaser Released: నటుడు, దర్శకుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించిన తెలుగు, తమిళ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం కార్మేని సెల్వం. ద్విభాషా తెరకెక్కిన కార్మేని సెల్వం తెలుగు టీజర్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. సగటు మనిషి జీవితాన్ని తలపించేలా టీజర్ ఆకట్టుకునేలా ఉంది.
పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా నిర్మించిన సినిమా కార్మేని సెల్వం. ఈ సినిమాకు రామ్ చక్రి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకే కాలంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’లో విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించారు.

డైరెక్టర్ గౌతమ్ మీనన్ కీలక పాత్ర
అలాగే, కార్మేని సెల్వం సినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఇద్దరితోపాటు కార్మేని సెల్వం సినిమాలో లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్
అయితే, కార్మేని సెల్వం చిత్రాన్ని ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా కార్మేని సెల్వం సినిమా థియేటర్స్‌లోకి రానుంది.
కార్మేని సెల్వం టీజర్ రిలీజ్
ఆధునిక కాలానికి అనుసంధానమైన ఈ కథ ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మంచి ఆసక్తిని పెంచగా.. గురువారం (మార్చి 12) నాడు కార్మేని సెల్వం తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం కాలంలో సమాజం పోకడ ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనంలా ఈ కార్మేని సెల్వం టీజర్ ఉంది.
డబ్బు సంపాదించేందుకు చాలా మార్గాలు
"డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన కార్మేని సెల్వం టీజర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది.
అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే మిడిల్ క్లాస్ వ్యక్తి ప్రయత్నాలు వంటి విషయాలను వివిధ కోణాల్లో చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు
ముఖ్యంగా ఈఎమ్ఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి.
గోప్యంగా ఆ పాత్ర
లక్ష్మీ ప్రియా చంద్రమౌళి ఆయన భార్యగా, చిన్న కుమారుడితో కుటుంబ జీవితం చూపిస్తుండగా, మరోవైపు విదేశాల్లో ఒంటరిగా కనిపించే కొన్ని షాట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. గౌతమ్ మీనన్ పాత్రను గోప్యంగా ఉంచడం కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయాలి
టీజర్ చివర్లో.. “రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి.. డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించేలా నిలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో చాలా మంది ఇలాంటి పద్ధతినే అనుసరిస్తున్నారు.
పెరిగిన అంచనాలు
సగటు మనిషి జీవితాన్ని ప్రతిబింబించేలా కార్మేని సెల్వం సినిమాను తెరకెక్కించినట్లు ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇలా టీజర్‌తో కార్మేని సెల్వం సినిమాపై అంచనాలు పెరిగాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


