తొలిరోజు 8 కోట్లతో ఓపెనింగ్ చేసిన కాంత- దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ, సముద్రఖని మూవీ ఇండియా కలెక్షన్స్ ఎంతంటే?
Kaantha Day 1 Collections: దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే నటించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ 'కాంత'. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన కాంత నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మరి కాంత సినిమాకు తొలి రోజు వచ్చిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
సినిమాపై వచ్చిన లేటెస్ట్ మూవీ కాంత. దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే కాంత. ఈ మూవీకి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. మంచి బజ్ క్రియేట్ చేసుకున్న కాంత సినిమా థియేటర్లలోకి నవంబర్ 14న అడుగుపెట్టింది.

కాంత బాక్సాఫీస్ కలెక్షన్స్
బాలల దినోత్సవం సందర్భంగా నిన్న థియేటర్లలో విడుదలైన కాంత సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నటీనటుల పర్ఫామెన్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంత బాక్సాఫీస్ కలెక్షన్స్‌పై ఇంట్రెస్ట్ నెలకొంది. కాంత సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వచ్చాయి.
కాంత ఫస్ట్ డే కలెక్షన్స్
ఇక తొలి రోజున ఇండియాలో కాంత మూవీకి రూ. 4 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.25 నుంచి 2.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. ఇవి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా జరిగిన ఆన్‌లైన్ లెక్కలే.
కాంత ఓవర్సీస్ కలెక్షన్స్
ఇంకా ఆఫ్‌లైన్ టికెట్స్ చూస్తే కలెక్షన్స్ ఇంకాస్తా పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో కూడా కాంత మంచి కలెక్షన్స్ రాబట్టిందని టాక్. కేరళ, తమిళంలో కాంతకు కలెక్షన్స్ పర్వాలేదన్నట్లుగా ఉన్నాయట. కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో, ఓవర్సీస్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్స్‌ను కాంత రాబట్టే ఛాన్స్ ఉందని సమాచారం.
కాంత వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక వరల్డ్ వైడ్‌గా తొలి రోజున కాంత సినిమాకు రూ. 7 నుంచి 8 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆఫ్‌లైన్ లెక్కలు పూర్తయ్యాక ఈ కలెక్షన్స్ కాస్తా అటు ఇటు మారనున్నాయట.
కాంత థియేటర్ ఆక్యుపెన్సీ
కాగా, కాంత సినిమాకు తమిళంలో (2D) షోలలో ఉదయం ప్రదర్శనలకు 14.60%, మధ్యాహ్నం ప్రదర్శనలకు 19.06%గా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అలాగే, చెన్నై 24.50%, పాండిచ్చేరి (23.50%), కోయంబత్తూరు (15.00%), కొచ్చి, తిరుచ్చి 20%గా థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా
అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కాంతకు ఓవరాల్‌గా 19.46 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఉదయం షోలకు 16.35 శాతం, మధ్యాహ్నాం 19.92 శాతం, సాయంత్రానికి 17.80 శాతం, నైట్ షోలకు 23.76 శాతంగా కాంత థియేటర్ ఆక్యుపెన్సీ రికార్డ్ అయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


