Mirzapur Teaser: సినిమాగా వస్తున్న సూపర్ హిట్ ఓటీటీ క్రైమ్ సిరీస్- మీర్జాపూర్ తెలుగు టీజర్ రిలీజ్- షాకిచ్చే ట్విస్టులు!

Mirzapur The Movie Teaser Release: ఇండియన్ ఓటీటీ రంగాన్ని ఊపేసిన మోస్ట్ పాపులర్ క్రైమ్ సిరీస్ 'మిర్జాపూర్' ఇప్పుడు థియేటర్లలో మూవీగా పండగ చేయడానికి సిద్ధమైంది. తాజాగా విడుదలైన మీర్జాపూర్ ది మూవీ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా, పాత పాత్రల మార్పుపై ప్రేక్షకులు భిన్నంగా స్పందిస్తున్నారు.

Published on: Jun 26, 2026, 09:40:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mirzapur The Movie Teaser Release Telugu: భారతీయ ఓటీటీ చరిత్రలోనే అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో 'మిర్జాపూర్' కచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. ఉత్తర భారత గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ రస్టిక్ క్రైమ్ డ్రామా ఓటీటీ సిరీస్‌కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ఫ్యాన్ బేస్ ఉంది.

సినిమాగా వస్తున్న సూపర్ హిట్ ఓటీటీ క్రైమ్ సిరీస్- మీర్జాపూర్ తెలుగు టీజర్ రిలీజ్- షాకిచ్చే ట్విస్టులు!
సినిమాగా వస్తున్న సూపర్ హిట్ ఓటీటీ క్రైమ్ సిరీస్- మీర్జాపూర్ తెలుగు టీజర్ రిలీజ్- షాకిచ్చే ట్విస్టులు!

వెండితెరపై మూవీగా ఓటీటీ సిరీస్

ఇన్నాళ్లూ మొబైల్ స్క్రీన్లకే పరిమితమైన ఈ 'భౌకాల్' (రౌడీయిజం) ఇప్పుడు వెండితెరపై గర్జించడానికి సిద్ధమైంది. ఈ సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 'మిర్జాపూర్: ది మూవీ' (Mirzapur: The Movie) అధికారిక టీజర్‌ను గురువారం (జూన్ 25) విడుదల చేశారు.

హిందీతోపాటు మీర్జాపూర్ ది మూవీ తెలుగు టీజర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మీర్జాపూర్ ది మూవీ టీజర్ బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. మున్నా త్రిపాఠి, గుడ్డూ పండిట్ మధ్య సాగే పాత పగలను థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మీర్జాపూర్ సిరీస్‌కు ప్రీక్వెల్

అయితే, ఈ చిత్రం వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కాదు.. ఒక ప్రీక్వెల్ (కథకు ముందు జరిగిన కథ). అంటే, ‘మిర్జాపూర్’ మొదటి సీజన్ కంటే ముందు ఏం జరిగిందనే విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు. దీనివల్ల వెబ్ సిరీస్ రెండో సీజన్ ముగింపులో చనిపోయిన మున్నా త్రిపాఠి (దివ్యేందు శర్మ) ఈ సినిమాలో మళ్లీ ప్రాణాలతో తిరిగొచ్చాడు. టీజర్‌లో మున్నా భయ్యా విజిల్‌ వేస్తూ ఎంట్రీ ఇచ్చే సీన్ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది.

బాబ్లూ భయ్యా ఎక్కడ? ఫ్యాన్స్ నిరాశ

అయితే, మీర్జాపూర్ మూవీ టీజర్ మాస్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకున్నప్పటికీ, అందులో వచ్చిన ట్విస్టులతో కొందరు అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. మొదటి సీజన్‌లో బాబ్లూ పండిట్ పాత్రతో మెప్పించిన అద్భుతమైన నటుడు విక్రాంత్ మాస్సే ఈ సినిమాలో కనిపించలేదు.

విక్రాంత్ స్థానంలో ‘పంచాయత్’ ఓటీటీ సిరీస్ ఫేమ్ జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మార్పుపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. "విక్రాంత్ మాస్సే లేకుండా మిర్జాపూర్ అసంపూర్ణంగా అనిపిస్తోంది. జితేంద్ర కుమార్ కొత్త బాబ్లూ భయ్యానా?" అని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్)లో ప్రశ్నించారు.

సీనియర్ నటుడు రవికిషన్ కూడా

అయితే జితేంద్ర కుమార్ వంటి ప్రతిభావంతుడైన నటుడు ఈ క్రైమ్ వరల్డ్‌లోకి రావడం సినిమాకు అదనపు బలాన్ని ఇస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నటుడు రవికిషన్ కూడా ఈ టీజర్‌లో మెరవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

సెన్సార్ బోర్డు కత్తెర్లకు తట్టుకుంటుందా?

‘మిర్జాపూర్’ అనగానే పచ్చి బూతులు, రక్తపాతం, తీవ్రమైన హింస, శృంగార సన్నివేశాలు గుర్తుకొస్తాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఎలాంటి సెన్సార్ ఆంక్షలు ఉండవు కాబట్టి ఇవన్నీ నడిచిపోయాయి. కానీ, ఒక సినిమా థియేటర్లలోకి రావాలంటే సెన్సార్ బోర్డు (CBFC) అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సెన్సార్ గండం ఎలా తప్పుతుందనే ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

"టీజర్ విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంది. సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా సీన్లపై కత్తెర్లు వేయకుండా ఉంటే ఇది పక్కా హిట్ అవుతుంది" అని ఒక సినిమా లవర్ కామెంట్ చేశారు. వెండితెర నిబంధనలకు అనుగుణంగా కథలో ఎలాంటి మార్పులు చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అసలు కథేంటంటే?

ఈ సినిమా కథ మొత్తం 2018 కాలంలో నడుస్తుంది. మిర్జాపూర్ మొదటి సీజన్ ప్రారంభానికి ముందు, అలాగే ఆ సీజన్ జరుగుతున్న సమయంలో వెనుక ఏం జరిగిందనే పాయింట్‌తో కథను రాశారు. తన సింహాసనాన్ని అధిష్ఠించడానికి కొడుకు మున్నా త్రిపాఠి సరైన వారసుడు కాదేమోనని కాలీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి) ఆందోళన చెందుతుంటాడు.

ఇదే సమయంలో పండిట్ బ్రదర్స్ - అలీ ఫజల్ (గుడ్డూ), జితేంద్ర కుమార్ (బాబ్లూ) మున్నా సామ్రాజ్యాన్ని కూల్చేసి, మిర్జాపూర్‌కు తామే రాజులు కావాలని వ్యూహాలు రచిస్తుంటారు. అమెజాన్ ఎమ్‌జీఎమ్ స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

తెలుగులోనూ మీర్జాపూర్ మూవీ రిలీజ్

గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పునీత్ కృష్ణ కథ అందించారు. రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ ఒకేసారి సెప్టెంబర్ 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More