Chinmayi: అబ్బాయిలపై దాడుల గురించి మాట్లాడేది నేనే! నన్ను మగ ద్వేషి అంటారా? నెటిజన్ల బూతులపై సింగర్ చిన్మయి ట్వీట్!
Singer Chinmayi Sripada Counter To Misandrist Trolling: తనపై 'మగ ద్వేషి' (మిసాండ్రిస్ట్) అంటూ వస్తున్న ట్రోలింగ్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో అబ్బాయిలపై జరిగే లైంగిక దాడుల గురించి గొంతు విప్పుతున్న కొద్దిమందిలో తాను ఒకరినని ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.
Singer Chinmayi Sripada Counter To Misandrist Trolling: సమాజంలో మహిళలపై, చిన్న పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల గురించి నిరంతరం గొంతు విప్పే సెలబ్రిటీలలో గాయనీ, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ముందుంటారు. బాధితులకు అండగా నిలబడుతూ, నిందితులను నిలదీస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు ఎప్పుడూ సంచలనంగా మారుతుంటాయి.

నెటిజన్‌కు చిన్మయి కౌంటర్
అయితే, సమాజంలోని లూప్‌హోల్స్‌ను ప్రశ్నించే చిన్మయిపై నెటిజన్లలో ఒక వర్గం తరచూ నెగిటివిటీని వెళ్లగక్కుతూనే ఉంటుంది. తాజాగా తనను 'మగ ద్వేషి' (Misandrist) అని విమర్శించిన ఒక నెటిజన్‌కు సింగర్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో చురకలు అంటించారు.
అబ్బాయిలపై దాడుల గురించి మాట్లాడేది నేనే!
ఒక ఎక్స్ వినియోగదారుడు చిన్మయిని ఉద్దేశిస్తూ.. "మగాళ్లను ద్వేషించే చిన్మయి.. ఈ మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు, మీ జీవితాలు మీరు బ్రతకండి అని చెబుతుంది. అదే ఒక మామూలు పరిణతి చెందిన మగాడు రిలేషన్‌షిప్ అడ్వైజ్ ఇస్తూ.. పెళ్లి చేసుకున్నాక మహిళల ప్రాథమిక హక్కులను లాగేసుకోండి అంటాడు. ఇందులో నిజమైన ద్వేషం ఏదో అర్థం చేసుకోవడానికి పెద్దగా బుర్ర కూడా అక్కర్లేదు" అంటూ తెలుగులో రాసిన పోస్ట్‌ను చిన్మయి రీపోస్ట్ చేశారు.
దీనిపై ఆమె స్పందిస్తూ.. "నన్ను మగ ద్వేషి అంటున్నారు కానీ, నా నాలెడ్జ్ ప్రకారం.. మన దేశంలో చిన్న పిల్లలు, అబ్బాయిలపై (Boys) జరిగే లైంగిక వేధింపుల గురించి, 18 ఏళ్లు దాటిన పురుషులు లైంగిక దాడికి గురైతే సురక్షితంగా ఫిర్యాదు చేయడానికి సరైన చట్టాలు లేకపోవడం గురించి గొంతు విప్పుతున్న అతి కొద్దిమందిలో నేను ఒకరిని. అందుకే అంటుంటారు.. మగవాళ్లు తాము ద్వేషించే ఏ మహిళ గురించైనా పుకార్లు సృష్టిస్తారని, మిగతా మగాళ్లు తమకున్న ఒకే ఒక్క పనిచేయని బ్రెయిన్ సెల్‌తో దాన్ని చిలుక పలుకుల్లా వాడుతుంటారని" అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఎక్స్ యువత టైటిల్స్ భలే ఉన్నాయి
నెటిజన్ల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ చిన్మయి మరికొన్ని వ్యాఖ్యలు జోడించారు. "లXX దగ్గర నుంచి మిసాండ్రిస్ట్ (మగ ద్వేషి) వరకు ఈ ఎక్స్ (ట్విటర్) యువత నాకు ఇచ్చిన బిరుదులు ఇక్కడి జనాలు ఎలా ఆలోచిస్తారనే దానికి ఒక క్లాసిక్ ఉదాహరణ. వీరు ఒకవైపు మహిళలను కక్షగట్టి మరీ ద్వేషిస్తూనే, మరోవైపు తోటి మగాళ్లను కూడా సింప్, కొXX, నీ పిల్లలు చచ్చిపోవాలి అంటూ నీచమైన పదజాలంతో తిడుతుంటారు. భలే ఉంది మీ సమాజం" అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మహిళలను అణచివేసే మగస్వామ్య సమాజంలో వారి గొంతును నొక్కేయడానికి, వారి కోపాన్ని తప్పుగా చిత్రీకరించడానికే 'మగ ద్వేషి' అనే ముద్రను ఒక ఆయుధంగా వాడుతుంటారని చిన్మయి శ్రీపాద అభిప్రాయపడ్డారు.
మీటూ ఉద్యమంతో మారిన ప్రయాణం
తెలుగు, తమిళ చిత్రసీమల్లో అగ్ర గాయనిగా వెలుగొందుతున్న చిన్మయి జీవితం 2018 నాటి 'మీటూ' (#MeToo) ఉద్యమంతో పెద్ద మలుపు తిరిగింది. ప్రముఖ కోలీవుడ్ లిరిసిస్ట్ వైరముత్తు 2005లో స్విట్జర్లాండ్‌లో ఒక కచేరీ సందర్భంగా తనను లైంగికంగా వేధించారంటూ ఆమె ధైర్యంగా బయటకు చెప్పి సంచలనం సృష్టించారు.
ఆ సమయంలో డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై ఆరోపణలు చేసిన ఇతర మహిళలకు మద్దతుగా నిలిచినందుకు చిన్మయిని సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్ట్స్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ యూనియన్ (SICTADAU) నుంచి తొలగించారు. అయినప్పటికీ చిన్మయి తన పోరాటాన్ని ఆపలేదు.
వ్యక్తిగత జీవితంలో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను 2014లో వివాహం చేసుకున్న చిన్మయికి డ్రిప్త, శర్వస్ అనే కవల పిల్లలు (పాప, బాబు) ఉన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


