OTT: హాట్ టాపిక్‌గా ఓటీటీ సిరీస్..రేప్ పోర్నోగ్రఫీ చూసేవాళ్లకు అలా చేస్తే కల నిజమైనట్లు..చిన్మయి శ్రీపాద సంచలన పోస్ట్
OTT: ఓటీటీలో ఇప్పుడో సిరీస్ హాట్ టాపిక్ గా మారింది. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం చుట్టూ సాగే ఈ సిరీస్ గురించి డిస్కషన్స్ వైలర్ గా మారాయి. తాాజాగా ఈ విషయంలోనే చిన్మయి శ్రీపాద సంచలన పోస్ట్ పెట్టింది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ‘చిరాయా’ హాట్ టాపిక్ గా మారింది. మారిటల్ రేప్ అనే సున్నితమైన అంశం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఇందులో పెళ్లయిన తర్వాత ఆ మగాడు.. తన భార్య అనుమతి లేకుండానే రాక్షసుడిలా మీద పడి శృంగారం చేస్తుంటాడు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద సంచలన పోస్ట్ పెట్టింది.

నేత్ర శర్మ పోస్ట్
తాజాగా ఈ సిరీస్ లోని ఓ సీన్ కు సంబంధించి మంచంపై నిస్సహాయంగా పడి ఉన్న అమ్మాయి ఫొటోను మోడల్ నేత్ర శర్మ ఎక్స్ లో పోస్టు చేసింది. దీనికి ఆమె రాసిన క్యాప్షన్ వైరల్ గా మారింది.
‘‘చిరాయాలోని ఈ సీన్ తో తప్పు లేదని చెప్పే మగవాళ్లకు అమ్మాయి శరీరం గురించి కనీస అవగాహన లేదు. అంగీకారం, ప్రేరణ లేకుండా, లుబ్రికేషన్ వాడకుండా చేసే బలవంతపు సెక్స్ కారణంగా యోని చిరుగుతుంది. ప్రైవేట్ పార్ట్స్ లో తీవ్రమైన వాపు, భరించలేని నొప్పి, కణజాలం దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. పెళ్లంటే ఒకరి శరీరాన్ని గాయపరచడానికి ఇచ్చే లైసెన్స్ కాదు. నో అంటే నో’’ అని నేత్ర రాసుకొచ్చింది.
చిన్మయి రియాక్షన్
నేత్ర శర్మ పెట్టిన పోస్టుకు సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్టయింది. అలా చేసే మగవాళ్లపై విరుచుకుపడింది. ‘‘రేప్ పోర్నోగ్రఫీ చూసేవాళ్లకు ఇలా చేస్తే కల నిజమైనట్లు. అందుకే మారిటల్ రేప్ అనేది సమస్యగా కనిపించడం లేదు. పెళ్లయిన మహిళ సెక్స్ కు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండాల్సిన పరిస్థితి’’ అని చిన్మయి పేర్కొంది.
ముహూర్తం పెట్టి మరి
‘‘అరెంజ్డ్ మ్యారేజీలో అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు తెలుసుకోవడానికి, శృంగారంలో పాల్గొనడానికి టైమ్ ఉండదు. ఇక పండితుడితో ముహూర్తం పెట్టి మరీ శోభనం నిర్వహిండం ఏంటో? ఇది ఎక్కువ చర్చించాల్సిన విషయం. కానీ ఒకవేళ ఆమె నో చెప్తే అంతే సంగతి. అయితే ఎవరూ ఈ విషయాల గురించి మాట్లాడేందుకు రెడీగా ఉండరు’’ అని చిన్మయి పోస్టు చేసింది.
చిరాయా గురించి
చిరాయా వెబ్ సిరీస్ మార్చి 20, 2026న ఓటీటీలో రిలీజైంది. జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో దివ్యా దత్తా, సంజయ్ మిశ్రా, ప్రసన్న బిష్ఠ్, సిద్ధార్థ్ షా, ఫైజల్ రషీద్ తదితరులు నటించారు. ఇది ఆరు ఎపిసోడ్ల సిరీస్. దీనికి శశాంత్ షా డైరెక్టర్. పెళ్లయిన తర్వాత భార్య అంగీకారం లేకపోయినా భర్త బలవంతంగా సెక్స్ చేస్తాడు.
ఆ బాధను బయటకు చెప్పుకోలేక, చెప్పినా కూడా అందులో తప్పేం ఉందనే మాటలను భరించలేక ఆ అమ్మాయి నలిగిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది చిరాయా వెబ్ సిరీస్ లో చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


