obsession movie netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్లు అలర్ట్-ఓటీటీలోకి వచ్చేస్తున్న అబ్సెషన్-ప్రపంచాన్ని వణికించిన హారర్ మూవీ
obsession movie netflix: థియేటర్లలో అనూహ్య విజయం సాధించిన ఇండిపెండెంట్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్'. ఇప్పటికే ఓటీటీలోకి వచ్చిన ఈ బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి ఈ మూవీని ఎప్పటి నుంచి చూడొచ్చో ఇక్కడ లుక్కేయండి.
obsession movie netflix: వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచిన సరికొత్త హారర్ డ్రామా ‘అబ్సెషన్’ (Obsession) ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, బలమైన మౌత్ టాక్ కారణంగా ఈ ఇండిపెండెంట్ చిత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

అబ్సెషన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ప్రపంచాన్ని వణికించిన అబ్సెషన్ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ హాలీవుడ్ మీడియా ప్లాట్‌ఫామ్ 'వాట్స్ ఆన్ నెట్‌ఫ్లిక్స్' అందించిన తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం నవంబర్ 17, 2026 నుండి యునైటెడ్ స్టేట్స్ (US) లోని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఇండియాలో ఎప్పుడు?
అబ్సెషన్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. అంటే ఆయా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ మూవీ చూడాలంటే రెంట్ పే చేయాల్సిందే. అయితే నెట్‌ఫ్లిక్స్ లో ఇండియాలో అబ్సెషన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు. యూఎస్ లో రాగానే ఇండియాలో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు.
ఒక చిన్న కోరిక.. ఊహించని నరకం!
యూట్యూబర్ నుంచి ఫిల్మ్ మేకర్‌గా మారిన ప్రతిభావంతుడైన దర్శకుడు కర్రీ బార్కర్ (Curry Barker) అబ్సెషన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. సైకలాజికల్ టెన్షన్, ఒళ్ళు గగుర్పొడిచే ట్విస్టులతో సాగే ఒక పక్కా సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది.
ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. సమాజానికి దూరంగా, ఒంటరిగా గడపడానికి ఇష్టపడే బేర్ (మైఖేల్ జాన్స్టన్) అనే కాలేజ్ స్టూడెంట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒకరోజు అతనికి మనుషుల కోరికలను తీర్చే ఒక వింతైన, రహస్య శక్తులు కలిగిన బొమ్మ దొరుకుతుంది.
నిక్కీ ప్రేమలో
తను ప్రాణంగా ప్రేమిస్తున్న క్లోజ్ ఫ్రెండ్ నిక్కీ (ఇండే నవారెట్) తన ప్రేమలో పడాలనే స్వార్థంతో బేర్ బ్లాక్ మ్యాజిక్ ను ఆశ్రయిస్తాడు. ఆ బొమ్మ సాయంతో తను అనుకున్నది సాధించాలనుకుంటాడు. కానీ, అతడు తీసుకున్న ఆ ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని ఊహించని భయంకరమైన నరకంలోకి నెట్టేస్తుంది.
ఒక చిన్న కోరిక కాస్తా భయంకరమైన పీడకలగా ఎలా మారింది? ఆ శక్తుల నుంచి వారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు? అనేదే అబ్సెషన్ చిత్ర ముఖ్యాంశం. ఒక పాపులర్ యానిమేటెడ్ టెలివిజన్ సిరీస్‌లోని హారర్ ఎపిసోడ్ లైన్ ఆధారంగా ప్రేరణ పొంది, దర్శకుడు ఈ పూర్తి నిడివి కథను అద్భుతంగా తెరకెక్కించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


