Obsession: ఇండియాలో హారర్ థ్రిల్లర్ మూవీ అబ్సెషన్ సక్సెస్ చూసి డైరెక్టర్ షాక్.. అస్సలు ఊహించలేదంటూ..

Obsession: హాలీవుడ్ సెన్సేసనల్ హారర్ థ్రిల్లర్ మూవీ అబ్సెషన్ ఇండియాలో సాధించిన సక్సెస్ చూసి డైరెక్టర్ కర్రీ బార్కర్ షాక్ తిన్నారు. ఇది అస్సలు ఊహించలేదని అనడం విశేషం. మన దేశంలో ఇప్పటికే సుమారు రూ.80 కోట్ల వరకూ వసూలు చేసిందీ మూవీ.

Published on: Jun 27, 2026, 10:45:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Obsession: హాలీవుడ్ యంగ్ యూట్యూబర్ కమ్ డైరెక్టర్ కర్రీ బార్కర్ (Curry Barker) మేకింగ్‌లో వచ్చిన సరికొత్త సైకలాజికల్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' (Obsession) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. కేవలం 7.5 కోట్ల రూపాయల ($750,000) అత్యంత తక్కువ బడ్జెట్‌తో కేవలం 20 రోజుల్లో లాస్ ఏంజిల్స్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమా.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఒక గ్లోబల్ సెన్సేషన్ గా మారిపోయింది.

Obsession: ఇండియాలో హారర్ థ్రిల్లర్ మూవీ అబ్సెషన్ సక్సెస్ చూసి డైరెక్టర్ షాక్.. అస్సలు ఊహించలేదంటూ..
Obsession: ఇండియాలో హారర్ థ్రిల్లర్ మూవీ అబ్సెషన్ సక్సెస్ చూసి డైరెక్టర్ షాక్.. అస్సలు ఊహించలేదంటూ..

హాలీవుడ్‌లోనే కాకుండా మన ఇండియాలో కూడా ఈ సినిమా ఊహించని రేంజ్‌లో రికార్డు వసూళ్లు సాధించింది. ఇండియాలో ఇప్పటివరకు ఏకంగా రూ. 79 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి, ఈ ఏడాది ఇండియన్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ హాలీవుడ్ హిట్‌గా నిలిచింది. ఈ సెన్సేషనల్ సక్సెస్ పై డైరెక్టర్ కర్రీ బార్కర్ వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తన ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పంచుకున్నారు.

అస్సలు ఊహించలేదు

ఇండియన్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి తన మైండ్ బ్లాక్ అయిందని కర్రీ బార్కర్ ఎమోషనల్ అయ్యారు. అసలు ఈ ప్రాజెక్ట్‌ను తాము చాలా సింపుల్‌గా ఫ్రెండ్స్‌తో కలిసి డిజైన్ చేశామని, ఇంతటి కల్ట్ స్టేటస్ దక్కుతుందని అస్సలు అనుకోలేదని చెప్పారు.

"నేను అబ్సెషన్ సినిమా ఇండియాలో ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని అస్సలు ఊహించలేదు. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఏ మార్కెట్‌లోనూ ఇంతటి భారీ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ప్రతి ఒక్కరూ తమ సినిమా సక్సెస్ అవ్వాలని, జనాలు దానికి కనెక్ట్ అవ్వాలని కలలు కంటారు. కానీ ఈ సినిమా సృష్టిస్తున్న వసూళ్ల సునామీని నేను నమ్మలేకపోతున్నాను. మేము దాదాపు ఏమీ లేని బడ్జెట్‌తో ఈ సినిమా తీశాం. ఈరోజు దానికి దక్కుతున్న గుర్తింపు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది" అని కర్రీ బార్కర్ వెల్లడించారు.

ఇండియాలో కేవలం కలెక్షన్లు మాత్రమే కాకుండా.. ఈ సినిమాలోని సీన్లను రీక్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న కామెడీ వీడియోలు, మీమ్స్, ఫ్యాన్ ఆర్ట్ వర్క్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.

వన్ విష్ విల్లో బొమ్మ తెచ్చిన తిప్పలు.. టాక్సిక్ రిలేషన్షిప్ స్టోరీ

ఈ అబ్సెషన్ సినిమా కథాంశం చాలా ప్రత్యేకంగా, ఈతరం యూత్‌ను ఆలోచింపజేసేలా ఉంటుంది. మ్యూజిక్ షాప్‌లో పనిచేసే బేర్ (మైఖేల్ జాన్‌స్టన్) అనే ఒక ఒంటరి యువకుడు.. తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఐండ్ నవారెట్)ని పిచ్చిగా ప్రేమిస్తాడు. కానీ ఆమెకు తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేయలేక ఒక మ్యాజికల్ క్రిస్టల్ షాప్ నుంచి 'వన్ విష్ విల్లో' (One Wish Willow) అనే ఒక విచిత్రమైన సూపర్ నేచురల్ టాయ్‌ను కొనుగోలు చేస్తాడు. నిక్కీ తనను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాలంటూ అతను ఒక కోరిక కోరతాడు.

ఆ కోరిక నెరవేరుతుంది కానీ చాలా భయంకరమైన రీతిలో మారుతుంది. నిక్కీ ప్రేమ కాస్తా విపరీతమైన అబ్సెషన్ (పిచ్చి) గా మారి, ఆమె తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోయి హింసాత్మకంగా మారుతుంది. టాక్సిక్ రిలేషన్షిప్స్ లోని సైకాలజీని డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్‌గా స్క్రీన్ పై చూపించారు.

సౌండ్ డిజైన్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ మూడ్‌ను థియేటర్లలో పీక్స్‌కు తీసుకెళ్లాయి. ఇండియాలో మార్వెల్ సినిమా 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్' లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా దాటేసే రేంజ్‌లో ఈ సినిమా దూసుకుపోతోంది. జూన్ 30 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ లాంటి గ్లోబల్ ప్రీమియం వీడియో-ఆన్-డిమాండ్ (PVOD) ప్లాట్‌ఫామ్స్ పై డిజిటల్ రెంటింగ్ పద్ధతిలో రిలీజ్ కాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More