OTT Telugu: ఓ చిన్న తెలుగు సినిమా.. హాలీవుడ్ మూవీస్‌ని కూడా వెనక్కి నెట్టి.. థియేటర్లలో ఫ్లాప్.. ప్రైమ్ వీడియోలో హిట్

OTT Telugu: థియేటర్లలో ఫ్లాప్ అయిన ఓ చిన్న తెలుగు సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో మాత్రం పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ ని కూడా వెనక్కి నెట్టేసింది. గుణశేఖర్ డైరెక్షన్ లో భూమిక, సారా అర్జున్ లాంటి వాళ్లు నటించిన ఆ మూవీ పేరు యుఫోరియా.

Published on: Jun 25, 2026, 05:58:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Telugu: స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన లేటెస్ట్ సోషల్ అవేర్‌నెస్ డ్రామా 'యుఫోరియా' (Euphoria) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. థియేట్రికల్ రన్‌లో ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ వేదికగా ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ ప్రైమ్ వీడియో రెంటల్ చార్ట్స్‌లో ఈ తెలుగు సినిమా ఏకంగా నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

OTT Telugu: ఓ చిన్న తెలుగు సినిమా.. హాలీవుడ్ మూవీస్‌ని కూడా వెనక్కి నెట్టి.. థియేటర్లలో ఫ్లాప్.. ప్రైమ్ వీడియోలో హిట్
OTT Telugu: ఓ చిన్న తెలుగు సినిమా.. హాలీవుడ్ మూవీస్‌ని కూడా వెనక్కి నెట్టి.. థియేటర్లలో ఫ్లాప్.. ప్రైమ్ వీడియోలో హిట్

మైఖేల్‌, ప్రాజెక్ట్ హెయిల్ మేరీలను వెనక్కి నెట్టి..

ఈ క్రేజీ అచీవ్‌మెంట్‌పై 'యుఫోరియా' మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ చిన్న తెలుగు సినిమా గ్లోబల్ లెవెల్‌లో భారీ క్రేజ్ ఉన్న హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ 'మైఖేల్' (Michael), 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (Project Hail Mary) లాంటి చిత్రాలను సైతం వెనక్కి నెట్టడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం ఈ మూడు సినిమాలు ప్రైమ్ వీడియో స్టోర్‌లో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉండగా.. ఇండియన్ ఆడియన్స్ మన తెలుగు కంటెంట్‌కే ఫస్ట్ ఓటు వేశారు. ఈ సినిమా ప్రస్తుతం ఇండియాలో రూ.149 రెంట్ కు అందుబాటులో ఉంది.

థియేటర్లలో దెబ్బతిన్నా.. ఓటీటీలో ఆదరణ

'చూడాలనివుంది', 'ఒక్కడు', 'రుద్రమదేవి' లాంటి విజువల్ వండర్స్‌ను అందించిన సీనియర్ ఫిల్మ్ మేకర్ గుణశేఖర్.. ఈసారి రూట్ మార్చి నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న ఒక సీరియస్ సమస్య బ్యాక్‌డ్రాప్‌లో ఈ సోషల్ మెసేజ్ సినిమాను రూపొందించారు. థియేటర్లలో రిలీజైనప్పుడు క్రిటిక్స్ నుంచి ఈ సినిమా కంటెంట్‌కు మంచి ప్రశంసలు వచ్చినప్పటికీ.. కమర్షియల్ కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది.

కానీ ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే ఆడియన్స్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. థియేటర్లకు వెళ్లని ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అంతా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ పై ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒక కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాకు థియేట్రికల్ రన్ వైఫల్యం అనేది ఎండ్ కార్డ్ కాదని, మంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ దొరికితే గ్లోబల్ వైడ్ గా రీచ్ సాధించవచ్చని 'యుఫోరియా' నిరూపించింది.

సారా అర్జున్ వన్ మ్యాన్ షో.. మెప్పించిన నటీనటులు

రీసెంట్‌గా రిలీజైన 'ధురందర్' (Dhurandhar) సినిమాలో తన యాక్టింగ్ టాలెంట్‌తో అందరినీ మెప్పించిన యంగ్ బ్యూటీ సారా అర్జున్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ పోషించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోయిన్‌గా మారుతున్న సారా.. ఈ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఆమెతో పాటు సీనియర్ నటి భూమిక చావ్లా, విగ్నేష్ గావిరెడ్డి పవర్‌ఫుల్ రోల్స్‌లో కనిపించారు. ఇక కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన మార్క్ నటనతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. వీరితో పాటు లెజెండరీ యాక్టర్ నాజర్, రోహిత్, లిఖిత యలమంచిలి, అడ్డాల పృథ్వీరాజ్, కల్పలత ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

గుణ టీమ్‌వర్క్స్ పనితనం.. కాల భైరవ మ్యాజిక్

ఈ యుఫోరియా సినిమాను గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, యుక్త గుణ ఎక్కడా రాజీ పడకుండా చాలా భారీగా ప్రొడ్యూస్ చేశారు. ఆర్ఆర్ఆర్ ఫేమ్ సింగర్ కమ్ కంపోజర్ కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సోషల్ డ్రామాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

ప్రతి ఇంటెన్స్ సీక్వెన్స్‌లోనూ అతని మ్యూజిక్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ చాలా షార్ప్‌గా ఉండి నేటి జనరేషన్ ఓటీటీ ఆడియన్స్ టేస్ట్‌కు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. సమాజంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సమస్యని ఇందులో చూపించడం వల్లనే ఈ సినిమాకు ఇంతటి లాంగ్ రన్ దక్కుతోందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More