Web Series Review: నవ్వుల ‘చికిత్స’ గ్యారెంటీ.. ప్రైమ్ వీడియో సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఎలా ఉందంటే?
Web Series Review: అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి మంగళవారం (జూన్ 23) వచ్చిన గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2 వెబ్ సిరీస్ నవ్వులు పూయిస్తోంది. తొలి సీజన్ కంటే మెరుగైన కామెడీతో టీవీఎఫ్ మరోసారి మ్యాజిక్ చేసింది. ఈ సిరీస్ అసలు కథేంటో ఈ రివ్యూలో చూడండి.
Web Series Review: సాధారణ మధ్యతరగతి మనుషుల కథలను, సమాజంలో ఉన్న లూప్‌హోల్స్ ను ఎంతో సున్నితంగా, కామెడీ జోడించి మనసుకు హత్తుకునేలా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో ది వైరల్ ఫీవర్ (TVF) సంస్థకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. వారి క్రేజీ లైనప్ నుంచి వచ్చిన లేటెస్ట్ రూరల్ డ్రామా సిరీస్ 'గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2' (Gram Chikitsalay Season 2).

ఫస్ట్ సీజన్ లో పాపులర్ వెబ్ సిరీస్ 'పంచాయత్' ఛాయలు ఎక్కువగా కనిపించాయనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ సరికొత్త సీజన్ లో మాత్రం ఆ నీడ నుంచి పూర్తిగా బయటపడి, గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలోని లోపాలను చాలా అద్భుతంగా చూపించారు. ఈ సిరీస్ చూసిన తర్వాత నవ్వుల చికిత్స గ్యారెంటీగా జరుగుతుందనడంలో సందేహం లేదు.
గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2 స్టోరీ ఏంటంటే?
ఈ గ్రామ్ చికిత్సాలయ్ వెబ్ సిరీస్ తొలి సీజన్ ముగిసిన దగ్గరి నుంచే రెండో సీజన్ మొదలుపెట్టింది. భట్కండీ అనే గ్రామంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) కి డాక్టర్‌గా వచ్చిన ప్రభాత్ సిన్హా (అమోల్ పరాశర్)కు ఈ కొత్త సీజన్ లో మరికొన్ని పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. గ్రామస్తుల నమ్మకాన్ని గెలవడం కంటే.. ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని లోపాలను ఎదుర్కోవడం చాలా కష్టమని అతనికి అర్థమవుతుంది. కనీస మందులు కూడా లేని ఆ క్లినిక్ పరిస్థితిని మార్చడానికి, దానికి ప్రభుత్వ సాయం నిరంతరం అందేలా "ఆదర్శ్ పీహెచ్‌సీ" సర్టిఫికేషన్ సాధించాలని ప్రభాత్ టార్గెట్ పెట్టుకుంటాడు.
అయితే అదే ఊరిలో ఇంటర్నెట్ సలహాలు, నాటు వైద్యం, మూఢనమ్మకాలతో ప్రజలను ఆకట్టుకునే ఆర్ఎంపీ డాక్టర్ చేతక్ కుమార్ (వినయ్ పాఠక్) వల్ల ప్రభాత్ మిషన్ కు అడ్డంకులు ఎదురవుతాయి. మరోవైపు క్లినిక్ లో లేడీ డాక్టర్ గా ఉన్న గార్గి సింగ్ (ఆకాంక్ష రంజన్ కపూర్) గ్రామంలో ప్రసవాలు ఆసుపత్రిలోనే జరిగేలా గట్టిగా పోరాడుతుంది. వీరికి తోడు క్లినిక్ వార్డ్ బాయ్ గోవింద్ (ఆకాష్ మఖిజా) చుట్టూ తిరిగే ఒక బలవంతపు పెళ్లి ఊరిలో ఎలాంటి గందరగోళం, కామెడీ క్రియేట్ చేసిందనేదే ఈ 5 ఎపిసోడ్ల సిరీస్ మెయిన్ స్టోరీ.
ఎవరెలా చేశారంటే?
డాక్టర్ ప్రభాత్ పాత్రలో అమోల్ పరాశర్ ఎంతో సిన్సియర్ గా నటించారు. సమాజానికి మంచి చేయాలని చూసే ఒక యువ డాక్టర్ పడే ఆవేదనను ఆయన కళ్లల్లో చూపించారు. నాటు వైద్యుడిగా వినయ్ పాఠక్ తన వింటేజ్ టైమింగ్ తో వినోదాన్ని పంచారు. ఈ క్యారెక్టర్ లో నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ వినయ్ తన యాక్టింగ్ తో దాన్ని అందరికీ నచ్చేలా మార్చేశారు. ఈసారి డాక్టర్ గార్గి పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కింది. అమోల్, ఆకాంక్షల మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్ గా వర్కవుట్ అయింది.
అయితే వీరందరికంటే కంపాండర్ ఫుటానీ పాత్రలో ఆనందేశ్వర్ ద్వివేది వన్ మ్యాన్ షో చేశారు. లోకల్ యాసలో ఆయన చెప్పిన డైలాగులు బాగా నవ్విస్తాయి. 'పంచాయత్' ఫేమ్ బినోద్ (అశోక్ పాఠక్), భూషణ్ (దుర్గేష్ కుమార్)ల క్యామియోలు, భోజపురి స్టార్ దినేష్ లాల్ యాదవ్ ఎంట్రీ సిరీస్ కు మంచి బూస్టప్ ఇచ్చాయి.
సీజన్ 2లో ప్లస్ పాయింట్స్ ఇవీ
* గ్రామీణ వైద్యం, బ్యూరోక్రసీ, అవినీతి లాంటి సీరియస్ పాయింట్స్ ను ఎక్కడా సాగదీత లేకుండా కేవలం సెటైర్, హ్యూమర్ తో చూపించడం రైటర్స్ వైభవ్ సుమన్, శ్రేయ శ్రీవాస్తవ మార్క్ రైటింగ్ కు నిదర్శనం.
* 'పంచాయత్' ఫార్ములాను కాపీ కొట్టకుండా ఒక చిన్న మెడికల్ సెంటర్ లో ఉండే కష్టాలను రియలిస్టిక్ గా చూపించారు.
మైనస్ పాయింట్స్ ఇవీ
* ఈ సీజన్ లో మెయిన్ మైనస్ పాయింట్ కథనం సాగే వేగమే. కొన్ని సీన్లు అనవసరంగా సాగదీసినట్టు అనిపిస్తాయి. కథ ముందుకు వెళ్లకుండా ఒకే చోట ఆగిన ఫీలింగ్ కలుగుతుంది.
* హీరో అమోల్ పరాశర్ బాడీ లాంగ్వేజ్ కొన్నిచోట్ల పంచాయత్ లోని జితేంద్ర కుమార్ (అభిషేక్ త్రిపాఠి)ను గుర్తుకు తెస్తుంది.
మొత్తంగా చూస్తే.. 'గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2' అనేది మన దేశంలో గ్రామాల్లో ఉన్న ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీసిన ఒక మంచి క్లీన్ కామెడీ షో అని చెప్పొచ్చు. వీకెండ్ లో మొత్తం కుటుంబంతో కలిసి హ్యాపీగా చూడగలిగే వెబ్ సిరీస్ ఇది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


