ఆమ్రపాలిలా యంగ్ ఐఏఎస్ కావాలనుకునే అమ్మాయి-కొడుకును చంపే అమ్మ-అదిరిపోయిన ధురంధర్ హీరోయిన్ తెలుగు మూవీ యుఫోరియా ట్రైలర్
ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది ధురంధర్ మూవీ. కలెక్షన్ల మోత మోగించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన సారా అర్జున్ తెలుగులో యూఫోరియా తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతుంది. ఇవాళ రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ జనరేషన్ కథతో యుఫోరియా అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో ధురంధర్ తో సంచలనం క్రియేట్ చేసిన సారా అర్జున్ హీరోయిన్. యుఫోరియా మూవీ ట్రైలర్ ను ఇవాళ (జనవరి 17) రిలీజ్ చేశారు. రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది.

యుఫోరియా ట్రైలర్
గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ మూవీ యుఫోరియా. ఇందులో సారా అర్జున్, భూమిక, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ శనివారం రిలీజైంది. ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ లా యంగ్ ఐఏఎస్ కావాలని ఓ అమ్మాయి, ఆమె కుటుంబం కల కంటుంది.
ఐఏఎస్ కావాలని
సారా అర్జున్ ఈ యుఫోరియా మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది. యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ప్రిపేర్ అవుతుంది. ఆ సమయంలోనే ఒక పార్టీకి ఇన్విటేషన్ వస్తుంది. దీంతో ఆమె జీవితమే తలకిందలవుతుంది. అక్కడి నుంచి ట్రైలర్ లో సీన్లు అన్నీ పరుగెత్తుతాయి.
వాస్తవ సంఘటనలతో
ఈ మధ్య కాలంలో బైక్ రేసింగ్ లు, డ్రగ్స్, రేప్.. ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ యుఫోరియా మూవీలో చూపించినట్లు కనిపిస్తోంది. కుర్రాళ్లు రాష్ గా డ్రైవింగ్ చేయడం, ఫుట్ పాత్ పై పడుకున్నవాళ్ల కాళ్ల మీద నుంచే బైక్ లో పోనివ్వడం, డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలపై హత్యాచారాల ఘటనలతో ట్రైలర్ సాగుతుంది.
అమ్మ కేసు
యుఫోరియా మూవీలో సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. తన మీద తానే కేసు వేసుకుని, కోర్టులోకి వెళ్లే అమ్మగా కనిపించింది. తన కొడుకును అనవసరంగా కన్నానని బాధపడుతుంటుంది. సొంత కొడుకునే తుపాకీతో కాల్చి చంపుతుంది. ఇక కమిషనర్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించారు.
రిలీజ్ డేట్
గుణశేఖర్ డైైరెక్షన్ చేసిన యుఫోరియా మూవీ రిలీజ్ డేట్ ను కూడా ట్రైలర్ తో పాటు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను ఫిబ్రవరి 6, 2026న రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గుణశేఖర్. నీలిమ గుణ, యుక్త గుణ నిర్మాతలు. కాళ భైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ధురంధర్ సంచలనం
బాలీవుడ్ లో డిసెంబర్ 5, 2025న రిలీజైన ధురంధర్ సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. రణ్ వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో సారా అర్జున్ యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు యుఫోరియాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుంది ఈ భామ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


