మరో సంక్రాంతి సినిమా-కడుపుబ్బా నవ్వించేలా నారీ నారీ నడుమ మురారి ట్రైలర్-రిలీజ్ టైమ్ లో ట్విస్ట్-ఇళయరాజాకు కౌంటర్!

సంక్రాంతి 2026 బరిలో నిలిచిన మరో మూవీ నారీ నారీ నడుము మురారి. ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మీమ్స్, పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. అంతే కాకుండా సినిమా రిలీజ్ టైమ్ లోనూ మేకర్స్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. 

Published on: Jan 11, 2026, 18:17:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరో సంక్రాంతి సినిమా రిలీజ్ కు సై అంటోంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ట్రైలర్ ను ఇవాళ (జనవరి 11) మేకర్స్ రిలీజ్ చేశారు. పంచ్ డైలాగ్ లు, మీమ్స్ తో ఈ ట్రైలర్ కడుపుబ్బా నవ్వించేలా ఉంది. అంతే కాకుండా ఇళయరాజాపై ఓ కౌంటర్ కూడా ఉంది. మరోవైపు మూవీ రిలీజ్ టైమ్ లో ఓ ట్విస్ట్ కూడా ఉంది.

నారీ నారీ నడుమ మురారి పోస్టర్ (x/AKentsOfficial)
నారీ నారీ నడుమ మురారి పోస్టర్ (x/AKentsOfficial)

నారీ నారీ నడుమ మురారి ట్రైలర్

సంక్రాంతి 2026 రేసులోకి రాబోతున్న మరో సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. పండగ రోజున ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. ఈ మూవీ ట్రైలర్ ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే మగాడిగా శర్వానంద్ నటించాడు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫుల్ కామెడీతో సాగిపోతుంది.

కామెడీ ఎంటర్ టైనర్

ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా నారీ నారీ నడుమ మురారి ట్రైలర్ ను రెడీ చేశారు. సత్య ఒక మహిళను హాస్పిటల్ కు ఆటోలో తీసుకొచ్చి, నేను ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర డబ్బులు తీసుకోనని అంటాడు. నేను గర్భిణిని కాదని ఆమె చెప్తే, ఏంటీ అది పొట్టా? అనే డైలాగ్ నుంచి లాస్ట్ వరకూ ట్రైలర్ లో కామెడీ పండింది. ఇద్దరమ్మాయిలు గౌతమ్ (శర్వానంద్)ను లవ్ చేస్తారు. ఇంజినీరింగ్ చదివి ఆర్కిటెక్ట్ గా పని చేస్తున్న అంకుల్ అని చెప్తాడు గౌతమ్. మరి ఇంజినీరింగ్ ఎందుకు చేశావంటే? ఆ ప్రశ్నకు బీటెక్ చదివిన ఏ కుర్రాడు ఆన్సర్ చెప్పడని పంచ్ వేస్తాడు.

ఎక్స్ లవర్ తిరిగొస్తే

సాఫీగా సాగిపోతున్న హీరో లవ్ స్టోరీలోకి ఎక్స్ లవర్ తిరిగొస్తే ఎలా ఉంటుదనేది కామెడీ జనరేట్ చేసింది. గౌతమ్ ఎక్స్ లవర్ క్యారెక్టర్ లో సంయుక్త నటించింది. ప్రజెంట్ లవర్ గా సాక్షి వైద్య చేసింది. మధ్యలో సునీల్ మార్క్ కామెడీ హైలైట్ గా నిలిచింది.

రాజా గారి పాట వద్దని

ట్రైలర్ లో ఇళయరాజాకు కౌంటర్ వేసేలా ఉన్న సీన్ కూడా ఉంది. ఓ మంచి రీల్ చేద్దాం, రాజాగారి పాట పెట్టమని హీరో అడుగుతాడు. రాజా గారి పాట వద్దులే మామా, కేసులు వేస్తున్నాడంటా అని కమెడియన్ సత్య చెప్తాడు. తన పాటలను ఇతర సినిమాల్లో వాడినందుకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కౌంటర్ వేసినట్లు అర్థమవుతోంది.

రిలీజ్ టైమ్

నారీ నారీ నడుమ మురారి మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. అయితే సాధారణంగా ఏ మూవీ అయినా మార్నింగ్ షోతో సినిమా రిలీజ్ అవుతుంది. కానీ నారి నారి నడుమ మురారి మూవీ జనవరి 14న సాయంత్రం 5.49 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ విషయాన్ని ట్రైలర్ లో స్పష్టం చేశారు మేకర్స్. అదే రోజు అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More