నన్ను మోసం చేస్తూనే ఉన్నారు.. నా అనుమతి లేకుండానే పాటలు వాడుకుంటున్నారు..: డ్యూడ్ మూవీపై కోర్టుకెక్కిన ఇళయరాజా
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లేటెస్ట్ మూవీ డ్యూడ్‌నూ వదల్లేదు. ఈ సినిమాలో తన అనుమతి లేకుండా తన పాటలు పాడారని అతడు ఆరోపించాడు. అంతేకాదు మ్యూజిక్ కంపెనీలు తనను మోసం చేస్తూనే ఉన్నాయని అతని తరఫు న్యాయవాది ఆరోపించాడు.
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన డ్యూడ్ సినిమాకు లీగల్ సమస్యలు మొదలయ్యాయి. తన పాటలను అనుమతి లేకుండా సినిమాల్లో వాడుతున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. లైవ్ లా (Live Law) అందించిన సమాచారం ప్రకారం.. మ్యూజిక్ కంపెనీలు తన అనుమతి లేకుండా తన పాటలను వాడుకోవడం, వాటిని మార్చడం ద్వారా తనను మోసం చేస్తున్నాయని అతడు మద్రాస్ హైకోర్టులో వాదించాడు.

మళ్లీ కోర్టుకెక్కిన ఇళయరాజా
ఇళయరాజా డ్యూడ్ మూవీపై వేసిన కేసును బుధవారం (అక్టోబర్ 22) జస్టిస్ ఎన్. సెంథిల్‌కుమార్ విచారించారు. సోనీ మ్యూజిక్‌కు వ్యతిరేకంగా ఇళయరాజా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అంతకుముందు ఇళయరాజా పాటలను స్ట్రీమింగ్ చేయడం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను రోజువారీగా అందించాలని కోర్టు మ్యూజిక్ కంపెనీని ఆదేశించింది. డ్యూడ్ సినిమాలో 1991లో వచ్చిన పుధు నెల్లు పుధు నాథు అనే సినిమాలోని కరుత మచన్ పాటలోని ఒక భాగాన్ని ఉపయోగించారు.
ఇళయరాజా తరఫున సీనియర్ అడ్వకేట్ ఎస్. ప్రభాకరన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేదని, ప్రస్తుత పిటిషన్‌ను విచారించడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆయన తెలిపారు. అయితే న్యాయపరమైన క్రమశిక్షణను పరిగణనలోకి తీసుకుని, సుప్రీంకోర్టు ఈ విషయాన్ని పరిశీలించే వరకు వేచి చూడాలని న్యాయమూర్తి భావించారు.
ఇవీ కేసు వివరాలు
ఇళయరాజా తరఫున న్యాయవాది ప్రభాకరన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మ్యూజిక్ కంపెనీ ఇంతవరకు ఎలాంటి రాతపూర్వక స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయలేదని, అలాగే అడిగిన ఆదాయ వివరాలను కూడా సమర్పించలేదని చెప్పారు. కంపెనీ గోప్యతను కాపాడటానికి సీల్డ్ కవర్‌లో వివరాలను సమర్పిస్తుందని నారాయణన్ తెలియజేశారు.
ఈ సమయంలో ప్రభాకరన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీంకోర్టు కూడా సీల్డ్ కవర్‌లో పత్రాలు సమర్పించే పద్ధతిని విమర్శించిందని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ దశలో సీల్డ్ కవర్‌ను అంగీకరించకూడదని నిర్ణయించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని తెలిపారు.
పెద్ద లేబుల్స్ కి వ్యతిరేకంగా ప్రతి సినిమాకు ఇళయరాజా పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని ప్రభాకరన్ వాదించారు. "నేను ప్రసిద్ధ సంగీత దర్శకుడిని కావచ్చు. కానీ ఈ మ్యూజిక్ కంపెనీలు నన్ను మోసం చేస్తున్నాయి. నా అనుమతి లేకుండా నా పాటలను వాడుకుంటూనే ఉన్నాయి. వాటిని వక్రీకరిస్తున్నారు. వాటికి బీట్స్ జోడిస్తున్నారు" అని ఇళయరాజా తరఫున ప్రభాకరన్ తన వాదనలో పేర్కొన్నారు.
తన పాటలను ఇతర సినిమాల్లో అనధికారికంగా వాడుతున్నట్లయితే, ఇళయరాజా ప్రత్యేక దరఖాస్తును దాఖలు చేయగలరని కోర్టు ప్రభాకరన్‌కు తెలియజేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


