టెన్షన్.. టెన్షన్.. చెన్నైలో సెలబ్రిటీలకు బాంబు బెదిరింపులు.. త్రిష, విజయ్ తర్వాత ఇప్పుడు ఇళయరాజాకు ఫేక్ ఈమెయిల్

ఇటీవల చెన్నైలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని కొందరు బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. 

Published on: Oct 15, 2025 1:15 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొంతకాలంగా తమిళనాడులోని చెన్నైలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులతో అక్కడ పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. ఇవి భద్రతాపరమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కూడా ఇలాంటి బాంబు బెదిరింపును ఎదుర్కొన్నారు. ది హిందూ నివేదిక ప్రకారం, మంగళవారం రోజున టి. నగర్‌లోని ఆయన స్టూడియోకి బాంబు బెదిరింపు వచ్చింది.

ఇళయరాజా
ఇళయరాజా

అసలేం జరిగిందంటే..

ఇళయరాజా స్టూడియోకి బాంబు బెదిరింపు వచ్చింది. ది హిందూ రిపోర్ట్ ప్రకారం మంగళవారం (అక్టోబర్ 14) ఇళయరాజా స్టూడియోలో బాంబు పెట్టామని ఆయనకు, డీజీపీ కార్యాలయానికి ఒక ఈమెయిల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS)తో సహా పోలీసులు సంగీత దర్శకుడు ఇళయరాజా స్టూడియోకి చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆ బెదిరింపు నకిలీదని పోలీసులు నిర్ధారించారు.

ఆ మెయిల్ లాగే

చివరకు బాంబు బెదిరింపు ఉత్తిదే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హాట్‌మెయిల్ అడ్రస్ నుంచి పంపిన ఈ ఈమెయిల్, గత కొన్ని వారాలుగా చెన్నైలోని ఇతర వీఐపీలకు పంపిన ఈమెయిళ్ల మాదిరిగానే ఉందని విచారణలో తేలింది. ఈ విషయంపై సైబర్ క్రైమ్, సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నకిలీ బాంబు బెదిరింపులను పోలీస్ డిపార్ట్ మెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది.

త్రిష, విజయ్‌లకు కూడా

అక్టోబర్ 2న తేనాంపేటలోని నటి త్రిష, మాండవేలిలోని శేఖర్‌తో సహా పలువురు వీఐపీల కార్యాలయాలు, నివాసాల్లో బాంబులు పెట్టామని డీజీపీకి ఈమెయిల్స్ వచ్చాయి. BDDS బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని తనిఖీలు చేయగా, అనుమానాస్పదంగా ఏమీ కనపడలేదు. మరోవైపు పీటీఐ నివేదిక ప్రకారం, అక్టోబర్ 9న నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ నివాసంలో బాంబు పెట్టానని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ వచ్చింది.

అరెస్ట్

విజయ్ ఇంట్లో బాంబు పెట్టాలని ఫేక్ కాల్ చేసిన షాబిక్ అనే 37 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు-రాజకీయవేత్త అయిన విజయ్ ఇంట్లో ఉదయం 3:00 గంటల నుంచి 7:25 గంటల వరకు సోదాలు నిర్వహించిన తర్వాత, ఆ ఫోన్ కాల్ కూడా నకిలీదని BDDS తేల్చింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి, నామ్ తమిళర్ కట్చి కోఆర్డినేటర్ సీమాన్, ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె పళనిస్వామి వంటి రాజకీయ నాయకులతో పాటు, గిండీలోని రాజ్‌భవన్, టి. నగర్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా ఈ బాంబు బెదిరింపులకు లక్ష్యంగా మారాయి.

News/Entertainment/టెన్షన్.. టెన్షన్.. చెన్నైలో సెలబ్రిటీలకు బాంబు బెదిరింపులు.. త్రిష, విజయ్ తర్వాత ఇప్పుడు ఇళయరాజాకు ఫేక్ ఈమెయిల్
News/Entertainment/టెన్షన్.. టెన్షన్.. చెన్నైలో సెలబ్రిటీలకు బాంబు బెదిరింపులు.. త్రిష, విజయ్ తర్వాత ఇప్పుడు ఇళయరాజాకు ఫేక్ ఈమెయిల్