Deepa Thomas: రావు బహదూర్ చూసి నాన్న ఆ మాట అన్నారు..స్టేజీపైనే ఏడ్చేసిన హీరోయిన్ దీపా థామస్..ఏమైందంటే? వీడియో వైరల్

Deepa Thomas: డిఫరెంట్ సినిమాగా వచ్చి థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది రావు బహదూర్ మూవీ. ఈ చిత్రం సక్సెస్ మీట్ లో హీరోయిన్ దీపా థామస్ ఎమోషనల్ కావడం వైరల్ గా మారింది. ఏడుస్తూనే మాట్లాడిన ఆమె వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఏమైందో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 4, 2026, 17:24:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Deepa Thomas: రావు బహదూర్ సినిమాతో మరో మలయాళ అందం తెలుగు ఆడియన్స్ ను అలరిస్తోంది. ఈ చిత్రంలో రేణుక పాత్రతో తన యాక్టింగ్ తో దీపా థామస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం సక్సెస్ మీట్ లో స్టేజీ పైనే దీపా ఏడ్చేసింది. ఆమె వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

రావు బహదూర్ చూసి నాన్న ఆ మాట అన్నారు..స్టేజీపైనే ఏడ్చేసిన రావు హీరోయిన్ దీపా థామస్
రావు బహదూర్ చూసి నాన్న ఆ మాట అన్నారు..స్టేజీపైనే ఏడ్చేసిన రావు హీరోయిన్ దీపా థామస్

దీపా థామస్ కామెంట్లు

సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్ మూవీ జూలై 3న థియేటర్లలో రిలీజైంది. డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన ప్రయోగానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇవాళ (జూలై 4) ఈ చిత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దీపా థామస్ మాట్లాడుతూ.. ‘‘హ్యాపీ బర్త్ డే టు సత్య దేవ్. 9 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. కానీ ఈ సినిమా అవకాశం రావడంతో కల నిజమైంది’’ అని తెలిపింది.

ఇది నిజమేనా?

‘‘కేరాఫ్ కంచరపాలెం లాంటి క్లాసిక్ సినిమా తీసిన మహా కాల్ చేసి నా నెక్ట్స్ మూవీలో హీరోయిన్ రోల్ కు ఆడిషన్ పంపండని అడిగారు. అప్పుడు అసలు ఇది నిజమేనా అనుకున్నా. రావు బహదూర్ లో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలోనే చాలా సంతోషకరమైన రోజు.

వండర్ ఫుల్ యాక్టర్ సత్యదేవ్ తో పని చేయడం గర్వంగా ఉంది. నా జీవితంలో ఎక్కడికి వెళ్లినా బ్రిలియంట్ యాక్టర్ తో పని చేశానని చెప్పుకుంటా’’ అని దీపా సంతోషం వ్యక్తం చేసింది.

ఏడ్చేసిన హీరోయిన్

‘‘రెండేళ్లు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నిన్న రియల్ ఆడియన్స్ తో థియేటర్లో మూవీ చూశా. వాళ్లు సినిమా చూస్తూ నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. మూవీ ఎమోషన్స్ తో పాటు క్యారీ అవుతున్నారు’’ అని దీపా థామస్ చెప్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అయింది.

నాన్న అన్న మాట

‘‘నా తల్లిదండ్రులకు తెలుగు రాదు. నిన్న సబ్ టైటిల్స్ తో మూవీ చూశారు. వాళ్లు కూడా నవ్వారు, ఏడ్చారు. నాన్నెప్పుడూ ఇంకా బెటర్ గా చేయమని చెప్తుండేవారు. కానీ ఈ మూవీ చూసి బెస్ట్ ఫిల్మ్ చేశావని అన్నారు. అంతకు మించిన ప్రశంస ఉండదు’’ అని చెప్తూనే దీపా ఏడ్చేసింది.

ఆడియన్స్ దగ్గరకు ఈ సినిమాను తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన మహేష్ బాబు, నమ్రతకు దీపా ధన్యవాదాలు తెలిపింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన రావు బహదూర్ మూవీకి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More