Rao Bahadur Review: రావు బహదూర్ రివ్యూ..సత్యదేవ్ వన్‌మ్యాన్ షో..మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్..హైప్ పెంచిన మూవీ ఎలా ఉందంటే?

Rao Bahadur Review: తెలుగు చిత్రసీమలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఎలాంటి కమర్షియల్ టెంప్లేట్‌లకు లొంగకుండా సరికొత్త ప్రయోగాలతో వస్తుంటాయి. అలాంటి ఒక ట్రెండ్ సెట్టింగ్ , సెటైరికల్ డ్రామానే ‘రావు బహదూర్’. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి ఫీల్ ఇస్తోంది? ఎందుకు చూడాలి? పూర్తి రివ్యూ ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 3, 2026, 12:18:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rao Bahadur Review:

రావు బహదూర్ రివ్యూ (x/RaoBahadurMovie)
రావు బహదూర్ రివ్యూ (x/RaoBahadurMovie)

సినిమా పేరు: రావ్ బహదూర్

నటీనటుడు : సత్యదేవ్, దీపా థామస్, వికాస్ ముప్పాల, బాల పరాసర్ తదితరులు

రచన - దర్శకత్వం: వెంకటేష్ మహా

సంగీతం: స్మరణ్ సాయి

సినిమా జోనర్: సాటైరికల్ ఫిలాసఫికల్ డ్రామా / మ్యాజికల్ రియలిజం

రిలీజ్ డేట్: జూలై 3, 2026

రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమా పేరు ‘రావు బహదూర్’. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ చేయడం ఒక కారణమైతే.. ఈ చిత్రం గురించి డైరెక్టర్, హీరోలు తెగ గొప్పగా మాట్లాడటం మరో కారణం. ఇలాంటి మూవీ ఇంతవరకూ రాలేదని సుకుమార్ కూడా అన్నాడు. మరి ఇవాళ రిలీజైన రావు బహదూర్ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.

కథ ఏమిటంటే?

రాజ వంశపు వారసుడైన రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) ప్రాణాపాయ స్థితిలో మంచాన పడతాడు. అతనిని పరీక్షించడానికి వైద్యుల బృందం వస్తుంది. మెడికల్ పరంగా అతణ్ని ఒక అద్భుతంగా చూస్తారు. తీవ్రమైన మానసిక రుగ్మతలతో రావు బహదూర్ బాధపడుతుంటాడు.

అసలు రావు బహదూర్ ఎవరు? అతని గతం ఏంటీ? తన లవ్ స్టోరీ ఏంటీ? మధ్యలో కుల వ్యవస్థ, రంగు, రక్త సంబంధాలు, మూఢ నమ్మకాల గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది? అనేది ఈ రావు బహదూర్ సినిమా కథ.

ముప్పై నిమిషాలు బోర్

ఈ రావు బహదూర్ సినిమా రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ లేదా ఫ్యాన్ ఎలిమెంట్స్ పై డిపెండ్ అయి ఉండదు. సినిమా మొదటి 30 నిమిషాలు చాలా నిదానంగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. రామప్ప రావు బహదూర్ నివసించే ‘భువనాలయం’ ప్రపంచంలోకి, అక్కడి విచిత్రమైన యాసలోకి, కథలో ఉపయోగించిన మ్యాజికల్ రియలిజంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లేందుకు డైరెక్టర్ వెంకటేష్ మహా టైమ్ తీసుకున్నాడు.

సెకండాఫ్ వేరే లెవల్

రావు బహదూర్ సినిమాను నిలబెట్టింది మాత్రం సెకండాఫ్ అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ వేరే లెవల్. ఇంటర్వెల్ తర్వాత సినిమా రిథమ్ అందుకుంది. అక్కడి నుంచి స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రాయల్ బ్యాక్ డ్రాప్ లో అసలు రావు బహదూర్ ఏం చేస్తున్నాడనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అదిరేలా ఉంది. ఓ తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమా తీశాడా? అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది.

అదే మెయిన్ పాయింట్

రావు బహదూర్ సినిమా పైకి ఒక రాజకుటుంబ కథలా అనిపించినప్పటికీ, దీని అంతరార్థం సమాజంలో తరతరాలుగా వస్తున్న వివక్షల గురించే. హ్యూమర్, సెటైర్, సింబలిజం, తాత్విక సంభాషణలను ఉపయోగించి.. సమాజంలో రంగు, రక్తం, వంశం, కులం, వారసత్వ హోదాపై ఉన్న పిచ్చిని ఈ సినిమా బలంగా ప్రశ్నిస్తుంది. 1968 నుండి 1991 మధ్య కాలంలో సాగే ఈ సినిమా కథన.. సామాజిక పరిస్థితులు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది.

ఎవరు ఎలా చేశారంటే?

హిట్, ఫ్లాప్ సంగతిని పక్కనపెట్టి డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తున్న సత్యదేవ్ మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు. ఇది సత్యదేవ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్రీమియర్ చూసిన తర్వాత సుకుమార్.. ఇందులో సత్యదేవ్ యాక్టింగ్ చూసి ఇతర నటులు కుళ్లుకుంటారని అన్నాడు. ఆ మాట అక్షరాల సత్యమనే చెప్పొచ్చు.

రామప్ప రావు బహదూర్ లాంటి టఫ్ అండ్ మల్టీ లేయర్ క్యారెక్టర్ ను ఈ జనరేషన్ నటుల్లో సత్యదేవ్ మినహా మరొకరు ఇలా చేయలేరేమో అనేంతగా అతను జీవించేశాడు. అతని పాత్రలో కనిపించే అహంకారం, మానసిక సంఘర్షణ, హాస్యం తదితర ఎమోషన్లను అతను గొప్పగా పండించాడు.

ఇక ‘అచ్చమ్మ’ పాత్రలో నటించిన బాల పరాసర్ సినిమాకే బిగ్ హైలైట్‌గా నిలిచింది. ఆమె ఉన్న సీన్లు నాన్-స్టాప్ హ్యూమర్‌ను అందిస్తాయి. రేణుక పాత్రలో దీపా థామస్ పర్‌ఫెక్ట్‌గా సరిపోగా, కథలో అత్యంత కీలకమైన 'ఆచారి' పాత్రలో వికాస్ ముప్పాల అద్భుతమైన నటనను ప్రదర్శించాడు.

టెక్నికల్ పరంగా

ముందుగా డైరెక్టర్ వెంకటేష్ మహా గురించి చెప్పుకోవాలి. 8 ఏళ్ల క్రితం కేరాఫ్ కంచరపాలెం మూవీ తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడు. అసలు ఆ కథ, సినిమాను నడిపిన తీరుకు సెల్యూట్ కొట్టాల్సిందే. అలాగే రైటర్ గానూ అతను మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో డైలాగ్స్ మనసును తాకుతాయి.

ఇక స్మరణ్ సాయి మ్యూజిక్ కథ మూడ్‌ను పాడుచేయకుండా చక్కగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ ఆ కాలం నాటి పీరియడ్ వాతావరణాన్ని, మిస్టరీ మూడ్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా చాలా రిచ్‌గా ఉన్నాయి. మంచి సినిమా కోసం మహేష్ బాబు రంగంలోకి దిగడం కలిసొచ్చింది.

ఇవి లేకుంటేనా?

ఎంత గొప్ప మూవీ అయినా ఏదో ఒక మైనస్ ఉంటుంది. ఈ రావు బహదూర్ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌కు నచ్చే మూవీ కాదని చెప్పొచ్చు. రెగ్యులర్ మాస్ మసాలా, కమర్షియల్ హైస్ ఆశించి వెళ్లే వాళ్లకు ఇది సెట్ కాకపోవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ కూడా కాస్త దెబ్బ తీసేదే.

ఫైనల్ గా

కమర్షియల్ సినిమా అనే మూసలో నుంచి బయటకు వచ్చేలా వెంకటేష్ మహా చేసిన సరికొత్త ప్రయోగం ఈ రావు బహదూర్ సినిమా. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ తో కచ్చితంగా వావ్ అనిపిస్తుంది. కాస్త ఓపిక ఉంటే ఈ మూవీని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.

రేటింగ్: 3/5

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More