Sukumar Rao Bahadur Review: ఇండియన్ మూవీస్ లో ఇలాంటి సినిమా రాలేదు- సత్యను చూసి జెలసీ- సుకుమార్ రావు బహదూర్ రివ్యూ వైరల్
Sukumar Rao Bahadur Review: వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ అప్ కమింగ్ మూవీ ‘రావు బహదూర్’పై టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించేశాడు. ఇండియాలోనే ఇలాంటి సినిమా రాలేదని తన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. స్పెషల్ ప్రివ్యూ చూసిన సుకుమార్ ఇచ్చిన పూర్తి రివ్యూను ఇక్కడ చూసేయండి.
Sukumar Rao Bahadur Review: సరికొత్త కథాంశాలతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయేలా విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా ఒక అద్భుతమైన పీరియడ్ హారర్ డ్రామాను సిద్ధం చేశాడు. అదే ‘రావు బహదూర్’. తాజాగా ఈ మూవీని చూసిన సుకుమార్ ఇచ్చిన రివ్యూ వైరల్ గా మారింది.

రావు బహదూర్ స్పెషల్ ప్రివ్యూ
సత్యదేవ్ హీరోగా నటించిన రావు బహదూర్ మూవీ స్పెషల్ ప్రివ్యూను తాజాగా సుకుమార్ చూశాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, తాజాగా టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ ఈ సినిమాను వీక్షించి, తన అద్భుతమైన రివ్యూను పంచుకున్నాడు.
మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్!
సినిమా చూసిన అనంతరం సుకుమార్ ‘రావు బహదూర్’ చిత్రాన్ని ఒక విలక్షణమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా అభివర్ణించాడు.
"రావు బహదూర్ ఒక నమ్మశక్యం కాని సినిమా. తెలుగులోనే కాదు ఇండియన్ మూవీస్ లోనే ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇలాంటి జోనర్లో రాలేదు. థియేటర్లలో ప్రేక్షకులకు ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతోంది" అని సుకుమార్ తన రివ్యూ పంచుకున్నాడు.
అసూయ కలుగుతుందంటూ
ఈ సినిమాలో సత్యదేవ్ నటన, ఆయన క్యారెక్టరైజేషన్ గురించి సుకుమార్ ప్రత్యేకంగా మాట్లాడాడు. "ఒక ఆర్టిస్ట్‌కు ఇలాంటి పాత్రలు రావడం చాలా అరుదు. వేరే ఏ ఆర్టిస్ట్ కూడా ఇలా చేయలేడు. ఈ సినిమాలో సత్యదేవ్ చేసిన పాత్రను చూస్తే ఏ నటుడికైనా అసూయ కలుగుతుంది. ‘రావు బహదూర్’ చిత్ర బృందం మొత్తం సత్యదేవ్‌కు ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి ఈ సినిమా" అని సుకుమార్ ప్రశంసించాడు.
8 ఏళ్ల తర్వాత
ఒక భిన్నమైన కథను స్క్రీన్‌పైకి తీసుకువచ్చినందుకు దర్శకుడు వెంకటేష్ మహాపై కూడా సుకుమార్ ప్రశంసలు కురిపించాడు. "కథ రాయడం ఒకెత్తయితే, దాని ఆత్మ కోల్పోకుండా ఇంతటి నమ్మశక్యం కాని శైలిలో ప్రెజెంట్ చేయడం చాలా పెద్ద అచీవ్‌మెంట్. అప్పుడు కేరాఫ్ కంచరపాలెంతో షాక్ ఇచ్చావు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి అదరగొట్టావు’’ అని డైరెక్టర్ గురించి సుకుమార్ చెప్పాడు.
నిర్మాతల ప్యాషన్
సినిమా సాంకేతిక విభాగాల గురించి సుకుమార్ మాట్లాడుతూ.. చిత్రంలో సృష్టించిన ప్రపంచం, కాస్ట్యూమ్స్, ప్రతి ఒక్క టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వర్క్ వేరే లెవెల్‌లో ఉందన్నాడు. అలాగే ఈ చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రొడ్యూసర్ అనురాగ్ రెడ్డి సహకారాన్ని కొనియాడాడు. సినిమా చూశాక అనురాగ్ కష్టం, ఆయన ప్యాషన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేక్షకుడికి కనిపిస్తుందని స్పష్టం చేశాడు.
రిలీజ్ డేట్
రావు బహదూర్ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 3న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


