Priyadarshi: సుకుమార్ బ్యానర్‌లో హీరోగా ప్రియదర్శి- 9 ఏళ్ల క్రితం అదే బ్యానర్ మూవీలో సైడ్ క్యారెక్టర్- ఇదీ సక్సెస్ అంటే!
Priyadarshi: టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి కెరీర్‌లో ఒక అరుదైన మైల్‌స్టోన్ చోటుచేసుకుంది. 2017లో ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్‌లో చిన్న పాత్ర చేసిన అతను.. ఇప్పుడు అదే బ్యానర్‌లో మెయిన్ లీడ్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు. దీంతో ఇదీ సక్సెస్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Priyadarshi: సినీ పరిశ్రమలో ఎవరి సమయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. టాలెంట్, కష్టాన్ని నమ్ముకుంటే ఒక రోజు కాకపోతే ఒక రోజైనా అద్భుతమైన మైల్‌స్టోన్స్ వెతుక్కుంటూ వస్తాయని టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి (Priyadarshi) ప్రూవ్ చేశాడు. ఒకప్పుడు అదే బ్యానర్ లో సైడ్ క్యారెక్టర్ ప్లే చేసిన అతను.. ఇప్పుడు హీరోగా మూవీ చేస్తున్నాడు.

దర్శకుడు సినిమాలో
గతంలోకి వెళ్తే.. 2017వ సంవత్సరంలో టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) సొంత నిర్మాణ సంస్థ 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్‌పై ‘దర్శకుడు’ అనే సినిమా వచ్చింది. ఆ చిత్రంలో ప్రియదర్శి కేవలం ఒక చిన్న పాత్రలో, ప్రేక్షకులను నవ్వించే హోటల్ సర్వర్ గా మాత్రమే కనిపించాడు.
ఇప్పుడు హీరోగా
కాలం వేగంగా కదిలింది. దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రియదర్శి తనను తాను మార్కెట్ పరంగా, నటన పరంగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్‌లో ఆయన ఏకంగా సోలో హీరోగా సినిమా చేస్తుండటం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్ చేసిన హౌస్‌లోనే ఇప్పుడు మెయిన్ లీడ్‌గా మారడం ప్రియదర్శి ఎదుగుదలకు నిదర్శనం.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో
ప్రియదర్శి కొత్త సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఇందులో ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ హీరోయిన్ గా ఎంపికైంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
‘పెళ్ళిచూపులు’ చిత్రంతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి.. ‘బలగం’, ‘మల్లేశం’ వంటి చిత్రాలతో బెస్ట్ పర్ఫార్మర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు.
అందుకే సుకుమార్ ఎంట్రీ
ప్రస్తుతం డిజిటల్, థియేట్రికల్ మార్కెట్లో ‘రూటెడ్ నేటివిటీ’ ఉన్న సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ‘బలగం’ సినిమా తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రియదర్శికి ఆ రీజియన్‌లో ఉన్న కనెక్టివిటీ, యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువ.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సాధారణంగా క్లాస్ లేదా కమర్షియల్ సబ్జెక్ట్‌లపై మొగ్గు చూపుతుంది. కానీ మొదటిసారి ఈ బ్యానర్ ఒక పక్కా లోకల్ తెలంగాణ ఫ్యామిలీ డ్రామాను టచ్ చేయడానికి మెయిన్ రీజన్ ప్రియదర్శి మార్కెట్ స్టామినానే అని చెప్పొచ్చు.
కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్లకు వచ్చి చూసేలా, క్లీన్ హ్యూమర్‌తో ఈ స్క్రిప్ట్ డిజైన్ చేశారని టాక్. సుకుమార్ స్వయంగా స్క్రీన్‌ప్లే ఇన్‌పుట్స్ ఇస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రి-రిలీజ్ బిజినెస్ పరంగా ఇండస్ట్రీలో ఇప్పుడే క్రేజీ బజ్ క్రియేట్ చేస్తోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


