టికెట్ ధరలో నిర్మాతకు దక్కేది 28 శాతమే.. వచ్చిన లాభాల్లోనూ మళ్లీ భారీగా ఇన్‌కమ్ ట్యాక్స్: బన్నీ వాస్
టికెట్ల ధరలు భారీగా పెంచేస్తున్నారని గగ్గోలు చేస్తారని, కానీ అందులో నిర్మాతకు దక్కేది 28 శాతమే అని నిర్మాత బన్నీ వాస్ అన్నాడు. తన నెక్ట్స్ మూవీ ఈషా గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమంలో అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సినిమా టికెట్ల ధరలో నిర్మాతకు వచ్చే వాటా ఎంత? సినిమాల్లో వచ్చే లాభాలపై తాము చెల్లించే ట్యాక్స్ ఎంత అన్నదానిపై నిర్మాత బన్నీ వాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. హారర్ మూవీ ఈషా టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై స్పందించాడు.

నిర్మాతకు వచ్చేది 28 శాతమే..
సాధారణంగా పెద్ద సినిమా ఏది రిలీజ్ అయినా టికెట్ల ధరలను పెంచడం ఆయవాయితీగా వస్తోంది. ప్రీమియర్ షోలు అంటూ రెట్టింపు ధరలకు టికెట్లను అమ్ముతున్నారు. వీటి ద్వారా సినిమా నిర్మాతలు భారీగా సంపాదించేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే వీటిపై బన్నీ వాస్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. సినిమా టికెట్ల ధరలో అన్నీ పోనూ నిర్మాతకు వచ్చేది 28 శాతమే అని స్పష్టం చేశాడు. ఈషా మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మనమంతా ఒక ఫ్యామిలీ కాబట్టి.. ఈ విషయాన్ని మీరు జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నట్లు చెప్పాడు.
“అందరం సినిమా రిలేటెడ్ వాళ్లు ఉన్నారు కాబట్టి చెబుతున్నాను. ఈ ఒక్క విషయాన్ని మీ బాధ్యతగా కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. మొన్న చాలా క్లియర్ గా లెక్కలు వేశాం. ప్రొడ్యూసర్ కు మిగిలేది కేవలం 28 శాతం మాత్రమే. అంటే ఒక టికెట్ ధర రూ.100 ఉంటే.. అందులో రూ.28 మాత్రమే ప్రొడ్యూసర్ కు వస్తుంది. మిగిలినవన్నీ థియేటర్లకు, డిస్ట్రిబ్యూషన్ కు వెళ్లిపోతుంది. అందులోనూ సినిమాపై మిగిలితే అందులో 35 నుంచి 40 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతున్నాం. ఆ టికెట్ రూ.600 కావచ్చు, రూ.800 కావచ్చు.. ప్రొడ్యూసర్ కు వచ్చేది 28 శాతమే. ఆ టికెట్ల డబ్బులు మొత్తం మాకే వస్తున్నాయని జనాలు అనుకుంటున్నారు. అందులో ఎవరికి ఎంత వెళ్తుందన్నది మీరు వారికి చెప్పాలని కోరుకుంటున్నాను” అని బన్నీ వాస్ అన్నాడు.
ఈషా మూవీ గురించి..
త్రిగుణ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా. శ్రీనివాస్ మన్నె డైరెక్ట్ చేసిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంచ్ చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోతోనే మేకర్స్ భయపెట్టారు. ఈ మూవీ గురించి కూడా బన్నీ వాస్ మాట్లాడుతూ.. హారర్ ఎలా ఉంటుంది, ఎలా తీస్తారన్నది తమకు తెలుసు కాబట్టి సినిమా చూసేటప్పుడు పెద్దగా భయపడమని, అలాంటిది ఈ సినిమా చూస్తూ నాలుగుసార్లు తాను ఉలిక్కి పడ్డానని అన్నాడు. ఇక్కడ భయపెడతారు అని ముందే తెలిసినా కూడా మిమ్మల్ని భయపెట్టే సినిమా ఇది అని చెప్పాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


