Satya Dev: సత్యదేవ్ చెప్పిన సీక్రెట్.. మహేష్ బాబు, సుకుమార్‌లకు పిచ్చెక్కించిన ఆ పాయింట్ ఏంటి?

Satya Dev: సత్యదేవ్ లీడ్ రోల్లో వెంకటేశ్ మహా డైరెక్ట్ చేసిన మూవీ రావు బహదూర్ రిలీజ్ కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో సత్యదేవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ సినిమా గురించి అతడు ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

Published on: Jul 1, 2026, 18:26:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Satya Dev: కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి కల్ట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా (Venkatesh Maha). ఆయన తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur).

Satya Dev: సత్యదేవ్ చెప్పిన సీక్రెట్.. మహేష్ బాబు, సుకుమార్‌లకు పిచ్చెక్కించిన ఆ పాయింట్ ఏంటి?
Satya Dev: సత్యదేవ్ చెప్పిన సీక్రెట్.. మహేష్ బాబు, సుకుమార్‌లకు పిచ్చెక్కించిన ఆ పాయింట్ ఏంటి?

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన ఈ ఇంటెన్స్ ఫిల్మ్ జులై 3న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో సత్యదేవ్ మీడియాతో ముచ్చటించి ఎన్నో క్రేజీ సీక్రెట్స్ రివీల్ చేశాడు.

కంటెంట్‌పై ఉన్న నమ్మకమే

రావు బహదూర్ టీమ్ సినిమా పట్ల ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి అసలు కారణం కంటెంట్ మీదున్న నమ్మకమేనట. "తెలుగు సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడని కథ" అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సైతం కంటెంట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

డార్క్ కామెడీకి మ్యాజికల్ రియలిజం టచ్

ఈ మూవీ జానర్ గురించి సత్యదేవ్ (Satyadev) మాట్లాడుతూ, ఇదొక పూర్తి సైకలాజికల్ డ్రామా అని స్పష్టం చేశాడు. డార్క్ కామెడీతో పాటు మ్యాజికల్ రియలిజం ఎలిమెంట్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. కొన్ని సీన్స్ ఆడియన్స్‌కు హారర్ వైబ్స్ కూడా ఇస్తాయని, చెట్టు వేర్లు హీరోను వెంబడించే విజువల్స్ థియేటర్లలో అద్భుతంగా ఉంటాయని చెప్పాడు. ఒక విషయాన్ని విజువల్‌గా చూపించడమే ఈ మ్యాజికల్ రియలిజం అసలు కాన్సెప్ట్.

సత్యదేవ్ కెరీర్‌లో ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలో చేసిన 'రామప్ప' క్యారెక్టర్ మరో ఎత్తు. జ్యోతి లక్ష్మి సినిమాకు ముందు, ఆ తర్వాత అని సత్యదేవ్ కెరీర్‌ను ఎలా డివైడ్ చేశారో, ఇప్పుడు రావు బహదూర్ సినిమా కూడా అలాంటి టర్నింగ్ పాయింట్ అవ్వబోతోంది. ఈ క్యారెక్టర్ కోసం జాన్ లెన్నాన్ ఇన్‌స్పిరేషన్‌తో ప్రతిరోజూ 5 గంటల పాటు ప్రోస్థెటిక్ మేకప్ వేసుకుని మరీ అతను కష్టపడ్డాడట.

రామప్ప పాత్ర ఆవహించింది

రామప్ప క్యారెక్టర్ పూర్తిగా మ్యాడ్ క్యారెక్టర్ అని, దీనికి ఎలాంటి రిఫరెన్సులు తీసుకోలేదని సత్యదేవ్ తెలిపాడు. షూటింగ్ టైమ్‌లో రామప్ప పాత్ర తనను ఆవహించిందని, ఆ రేంజ్‌లో క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేశానని ఉత్సాహంగా చెప్పాడు. రాబోయే రోజుల్లో మిగతా ఆర్టిస్టులకు ఈ రామప్ప క్యారెక్టర్ ఒక బెస్ట్ రిఫరెన్స్‌గా మిగిలిపోతుందనే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

ఈ కథ 1960 నుంచి 1999 వరకు సాగే పీరియాడిక్ డ్రామాగా ఉండబోతోంది. దేశమంతా తిరిగే ఒక ట్రావెలర్, 'భువనాలయం' అనే చోట ఎదుర్కొనే థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. ఈ స్టోరీకి యూనివర్సల్ అప్పీల్ ఉందని, రామప్ప క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో ఆడియన్స్ సులభంగా కనెక్ట్ అవుతారని సత్యదేవ్ ధీమా వ్యక్తం చేశాడు.

రీసెంట్‌గా ఈ సినిమా స్పెషల్ షో చూసిన పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కూడా ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి సినిమా రాలేదని కితాబునిచ్చారు. జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు ఏ+ఎస్ మూవీస్, శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడ్యూస్ చేశాయి. స్మరణ్ సాయి ఇంటెన్స్ మ్యూజిక్, కార్తీక్ పర్మార్ విజువల్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్ కానున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More