Bigg Boss 10: ఈ సీనియర్ హీరోయిన్ ప్లాన్ మామూలుగా లేదుగా.. బిగ్ బాస్ 10తో టాలీవుడ్ లో రీ ఎంట్రీకి భారీ స్కెచ్.. బజ్ వైరల్
Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై మోస్ట్ అవేటెడ్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ కంటెస్టెంట్ల ఎంపికతో హీటెక్కిస్తోంది. ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఈ సీజన్ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ షోతో టాలీవుడ్ రీ ఎంట్రీ కోసం ఈ భామ ప్లాన్ చేసిందని టాక్.
Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత భారీ రేటింగ్స్ సాధించే రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సరికొత్త మైలురాయి సీజన్‌తో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ కంటెస్టెంట్ల లైనప్ రేసులో ప్రతిరోజూ ఒక క్రేజీ సెలబ్రిటీ పేరు తెరపైకి వస్తోంది.

బిగ్ బాస్ లో ఆ హీరోయిన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఒకప్పటి టాలీవుడ్ లవ్లీ హీరోయిన్ రేఖ వేదవ్యాస్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా తెలుగు తెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ, బిగ్‌బాస్ వేదిక ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రేఖ సినీ కెరీర్
కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే హీరోయిన్ రేఖ వేదవ్యాస్ అఖండ ప్రజాదరణ సొంతం చేసుకుంది. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన యూత్ ఫుల్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఆనందం’ (2001) సినిమాతో ఆమె టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ఆనందం విజయంతో రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రేఖ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ‘దొంగోడు’ సినిమాలో నటించింది.
కన్నడలోనూ
తెలుగుతో పాటు కన్నడ చిత్రసీమలోనూ రేఖ టాప్ హీరోయిన్‌గా రాణించింది. ముఖ్యంగా కిచ్చా సుదీప్ సరసన నటించిన ‘హుచ్చా’, అలాగే ‘మొనాలిసా’ చిత్రాలు కన్నడలో ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత తమిళం, మలయాళ చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ సుదీర్ఘకాలం తన కెరీర్‌ను కొనసాగించింది.
రేఖకు వర్కవుట్ అవుతుందా?
సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ లేదా కంబ్యాక్ ఇవ్వాలనుకునే సీనియర్ స్టార్స్‌కు బిగ్‌బాస్ ఒక పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. గత సీజన్లలో పాల్గొన్న ఎంతోమంది నటీనటులు ఈ షో ద్వారా మళ్లీ క్రేజ్ తెచ్చుకుని వరుస సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు దక్కించుకున్నారు.
కన్నడ ఆడియన్స్‌కు ‘హుచ్చా రేఖ’గా హీరోయిన్ రేఖ ఎంతో సుపరిచితురాలు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆమెను రంగంలోకి దించడం ద్వారా అటు తెలుగుతో పాటు ఇటు కన్నడ రీజన్ వ్యూయర్‌షిప్‌ను కూడా క్యాష్ చేసుకోవచ్చని స్టార్ మా నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు టాక్.
బిగ్‌బాస్ ఎంట్రీపై
గత కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రేఖ, ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని బిగ్‌బాస్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
"బిగ్‌బాస్ షోకి వెళ్లాలంటే చాలా గుండెధైర్యం ఉండాలి. అన్ని కెమెరాల మధ్య, అంతమందితో 24 గంటలు కలిసి ఉంటూ టాస్కులు ఆడే కంటెస్టెంట్లకు నేను నిజంగా సెల్యూట్ చేస్తాను. ఒక గెస్ట్‌గా వెళ్లమంటే వెళ్తాను కానీ, కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లి అన్ని రోజులు ఉండేంత ధైర్యం నాకు లేదు" అని రేఖ ఓపెన్‌గా చెప్పింది.
సీక్రెట్ కోసమేనా?
అయితే రేఖ పైకి ఈ విధంగా వ్యాఖ్యానించినప్పటికీ, బిగ్‌బాస్ మేకర్స్ ఆమెకు ఒక క్రేజీ అంకెతో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని ఇండస్ట్రీ టాక్. ఈ మైండ్ బ్లోయింగ్ డీల్‌తో ఆమె కంటెస్టెంట్‌గా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని, ఇంటర్వ్యూలు ఇచ్చే సమయానికి అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం సీక్రెట్ మెయింటైన్ చేయడానికే ఆమె అలా మాట్లాడిందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి ఈ అందాల తార నిజంగానే హౌస్‌లోకి అడుగుపెడుతుందో లేదో తెలియాలంటే స్టార్ మా అధికారిక ప్రోమో వచ్చే వరకు వెచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


