Bigg Boss 10: బిగ్ బాస్ కు ఆడిషన్ వీడియో పంపడం మిస్సయ్యారా? ఇదిగో మరో గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేయండి చాలు!

Bigg Boss 10:  మీకు బిగ్ బాస్ లోకి వెళ్లాలనుందా? కానీ ఆడిషన్ వీడియో పంపించడం మిస్సయ్యారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. బిగ్ బాస్ లోకి వెళ్లాలనుకునే ఆడియన్స్ కు మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఇంకెందుకు లేటు? ఏం చేయాలో ఇక్కడ చూసేయండి. 

Published on: Jun 22, 2026, 13:06:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: బిగ్ బాస్ అంటే పిచ్చి ఇష్టమా? ఒక్కసారైనా షోలో పార్టిసిపేట్ చేయాలనుందా? అందుకు తగ్గ టాలెంట్ మీలో ఉందా? ఆడిషన్ వీడియో పంపడం మిస్సయ్యారా? అయినా ఫీల్ అవాల్సిన అవసరం లేదు. మీలాంటి తెలుగు ఆడియన్స్ కోసం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మేకర్స్ మరో గోల్డెన్ ఆఫర్ తీసుకొచ్చారు.

బిగ్ బాస్ కు ఆడిషన్ వీడియో పంపడం మిస్సయ్యారా? ఇదిగో మరో గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేయండి చాలు! (instagram)
బిగ్ బాస్ కు ఆడిషన్ వీడియో పంపడం మిస్సయ్యారా? ఇదిగో మరో గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేయండి చాలు! (instagram)

బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి అగ్ని పరీక్ష పేరుతో కామనర్ల నుంచి కొంతమందిని షోకు సెలక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో మరోసారి అగ్ని పరీక్ష కోసం ఆడిషన్లు స్వీకరించారు. ఈ ఆడిషన్లు పంపాల్సిన టైమ్ ముగిసింది. వివిధ కారణాల వల్ల కొంతమంది ఆడిషన్లు పంపలేక ఫీల్ అవుతున్న వాళ్లూ ఉన్నారు.

మరో గోల్డెన్ ఛాన్స్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం ఆడిషన్లు పంపే మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు. యాంకర్ శ్రీముఖితో కూడిన ఓ వీడియోను స్టార్ మా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆడిషన్స్ పంపేందుకు మరో ఛాన్స్ వచ్చిందని శ్రీముఖి పేర్కొంది.

ఏం చేయాలంటే?

బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఆడిషన్లు పంపాలనుకునే వాళ్లు ముందుగా గూగుల్ ఓపెన్ చేసి whitegold.money/aptelugu అని సెర్చ్ చేయాలి. అప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. దానిపై బిగ్ బాస్ అగ్ని పరీక్ష లోగోతో పాటు శ్రీముఖి ఫొటో కూడా ఉంటుంది.

అప్లై చేసే విధానం

బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం అప్లై చేయడానికి మూడు స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ టాలెంట్ గురించి చెప్పేలా తెలుగులో ఓ ఆడిషన్ వీడియోను రికార్డు చేయాలి. ఆ వీడియోను మీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేయాలి. @whitegold.telugu పేజీని ట్యాగ్ చేయడంతో పాటు ఫాలో కొట్టాలి.

చివరగా whitegold.money/aptelugu ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇందులో పేరు, డేటాఫ్ బర్త్, ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, జెండర్, అడ్రస్, ఏజ్, ఆడిషన్ వీడియో సోషల్ మీడియా లిక్ వివరాలు ఫిల్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. ఆ వీడియోను పరిశీలించిన తర్వాత మేకర్స్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇంకెందుకు లేటు మీ లక్ ను పరీక్షించుకోండి మరి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More