Bigg Boss: హిందీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. మరి తెలుగు బిగ్ బాస్ డేట్ ఎప్పుడు? కంటెస్టెంట్లు వీళ్లేనా?

Bigg Boss: టీవీ ఆడియన్స్ ను ఉర్రూతలూగించేందుకు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మళ్లీ రాబోతుంది. హిందీ బిగ్ బాస్ 20 సీజన్ లాంఛ్ డేట్ ఇదేనంటూ ఓ బజ్ వైరల్ గా మారింది. మరి తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కంటెస్టెంట్లుగా ఎవరు రావొచ్చు? అనేది ఇక్కడ చూద్దాం. 

Published on: Jun 12, 2026, 14:41:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss: ఇండియాలో హిందీలో స్టార్ట్ అయి, క్రమంగా రీజినల్ లాంగ్వేజ్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ కొత్త సీజన్ రాబోతుంది. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ హిందీ సీజన్ సెప్టెంబర్ 21న స్టార్ట్ అవుతుందనే బజ్ వినిపిస్తోంది. మరి తెలుగు సీజన్ ఎప్పుడు లాంఛ్ అవుతుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

హిందీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. మరి తెలుగు బిగ్ బాస్ డేట్ ఎప్పుడు?
హిందీ బిగ్ బాస్ వచ్చేస్తోంది.. మరి తెలుగు బిగ్ బాస్ డేట్ ఎప్పుడు?

బిగ్ బాస్ సందడి

ఓ పెద్ద హౌస్ లో సెలబ్రిటీలను 15 వారాల పాటు ఉంచి, వివిధ టాస్క్ లు ఆడించి.. చివరగా విన్నర్ ను డిసైడ్ చేయడమే బిగ్ బాస్ షో. ఇందులో ఆడియన్స్ తమ ఓటింగ్ ద్వారా తమకు నచ్చిన కంటెస్టెంట్ కు సపోర్ట్ చేస్తారు. ఈ బిగ్ బాస్ సందడి మరోసారి దేశాన్ని పట్టి ఊపేయనుంది.

హిందీలో ఎప్పుడంటే?

హిందీ బిగ్ బాస్ షోకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న 20వ సీజన్ ను కూడా అతనే నడిపించనున్నాడు. ఈ సీజన్ సెప్టెంబర్ 21న స్టార్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పడు కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారని తెలిసింది.

తెలుగు బిగ్ బాస్

తెలుగు బిగ్ బాస్ కొత్త సీజన్ కూడా రంగం సిద్ధమవుతోంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్ తో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతోంది. రీసెంట్ గా దీనికి సంబంధించి ఫస్ట్ ప్రోమోను రిలీజ్ చేశారు. మరోసారి ఈ షోకు నాగార్జున హోస్ట్ గా ఉండబోతున్నాడు.

ఎప్పుడో మరి

‘‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సారి తెలుగు బిగ్ బాస్ 10 స్టార్ట్ కాబోతుంది. ఈ సీజన్ లాంఛ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు. అంతకంటే ముందు కామన్ పీపుల్ నుంచి రిక్వెస్ట్ లు తీసుకుంటారు. అనంతరం అగ్ని పరీక్ష 2 నిర్వహించనున్నారు. ఈ కామనర్ల మధ్య పోటీని నిర్వహించి, ఇందులో కొంతమందిని బిగ్ బాస్ కు సెలక్ట్ చేయనున్నారు.

సెప్టెంబర్ లోనే

ఆగస్టు నెల మధ్యలో అగ్ని పరీక్ష సీజన్ 2 కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ అవుతుందని టాక్. ఈ సారి దశావతారం కాన్సెప్ట్ తో మరో లెవల్ లో షోను ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

కంటెస్టెంట్లు వీళ్లేనా?

బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చిందో లేదో, ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ లిస్ట్ లో పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్ ప్రెస్ హరి, రాకింగ్ రాకేష్, హీరో చంద్రహాస్, జ్యోతి (ఆట సందీప్ భార్య), ఉప్పల్ బాలు, దీపిక, వర్ష, నూకరాజు, శివ్ కుమార్, నందు, ప్రభాకర్, రాయల్ మెక్ రామన్ తదితరులు ఉన్నారు.

మరి ఈ సారి బిగ్ బాస్ లోకి ఎంతమంది సెలబ్రిటీలు వెళ్తారో? ఎవరు వెళ్తారో? కామనర్లలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో? వేచి చూడాల్సిందే.

People Also Ask (FAQ)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 హోస్ట్ ఎవరు?

ఈ సారి కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

బిగ్ బాస్ 10 నేపథ్యం ఏంటీ?

ఇది తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కాబట్టి దశావతారం కాన్సెప్ట్ తో షోను నిర్వహించనున్నారు.

హిందీ బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది?

హిందీ బిగ్ బాస్ సెప్టెంబర్ 21న స్టార్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More