Salman Khan: 60 ఏళ్లు వచ్చినా పోరాటం మర్చిపోలేదు.. జైల్లో వేస్తారా? ఫొటోగ్రాఫర్లపై సల్మాన్ ఖాన్ సీరియస్.. ఏమైందంటే?
Salman Khan: ముంబైలోని హిందుజా హాస్పిటల్ వద్ద పాపరాజీల (ఫొటోగ్రాఫర్ల) ప్రవర్తనపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నా బాధను క్యాష్ చేసుకుంటారా అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెట్టాడు. సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కోపమొచ్చింది. ఫొటోగ్రాఫర్ల తీరుపై అతను సీరియస్ అయ్యాడు. ముంబైలోని హిందుజా ఆసుపత్రి బయట పాపరాజీల (ఫొటోగ్రాఫర్ల) అతి ప్రవర్తనతో సల్మాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, సోషల్ మీడియా వేదికగా ఆయన ఫొటోగ్రాఫర్ల తీరును తీవ్రంగా తప్పుపట్టాడు.

సల్మాన్ ఫొటోల కోసం
ఆసుపత్రి నుంచి సల్మాన్ ఖాన్ బయటకు వస్తున్న సమయంలో "భాయ్.. భాయ్" అంటూ ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన క్లిప్స్ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు పలు ఫ్యాన్ పేజీల్లో వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన సల్మాన్ ఖాన్.. తీవ్ర భావోద్వేగంతో కూడిన పోస్టుల ద్వారా తన ఆవేదనను పంచుకున్నాడు. అంతే కాకుండా వార్నింగ్ కూడా ఇచ్చాడు.
లిమిట్స్ లో ఉండాలి
మీడియా ఫొటోగ్రాఫర్లతో తనకు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సల్మాన్ గుర్తుచేసుకున్నాడు. తాము ఎప్పుడూ ఒకరినొకరు గౌరవించుకుంటూనే ఉన్నామని చెప్పాడు. తన కెరీర్ పొడవునా ఫొటోగ్రాఫర్లతో స్నేహపూర్వకంగానే మెలిగానని, వారి జీవనోపాధికి ఎప్పుడూ అడ్డుపడలేదని స్పష్టం చేశాడు. అయితే, ప్రతి విషయానికి ఒక లిమిట్ ఉండాలని, ముఖ్యంగా భావోద్వేగాలు నిండి ఉండే ఆసుపత్రుల వంటి ప్రదేశాల్లోనైనా కాస్త విచక్షణ చూపాలని పేర్కొన్నాడు.
నా నష్టాల నుంచి
తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సల్మాన్ పోస్టులు పంచుకున్నాడు. ‘‘నా నష్టాల నుంచి మీరు డబ్బు సంపాదించాలనుకుంటే.. దయచేసి నోరు మూసుకోండి. ఆనందించకండి. భాయ్ భాయ్ అంటూ నా రాబోయే సినిమా 'మాతృభూమి' పేరు ఎత్తుతున్నారు. మీకు నా ప్రాణం ముఖ్యమా లేక ఫొటో ముఖ్యమా? ఇలాంటి ఫొటోలు వందైనా తగలబెట్టేస్తాను. ఒక సోదరుడి బాధను చూసిన తర్వాత నాతో ఇలా ప్రవర్తించడానికి ప్రయత్నించండి’’ అని సల్మాన్ పోస్టు చేశాడు.
అరవై ఏళ్లు వచ్చాయి కానీ
ఫొటోగ్రాఫర్లకు సల్మాన్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ‘‘నాకు అరవై ఏళ్లు వచ్చాయి, అంతమాత్రాన నేను పోరాడటం మర్చిపోలేదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది. నన్ను జైల్లో వేస్తారా.. హా హా’’ అని సల్మాన్ రాసుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. భాయ్ చెప్పిన దాంట్లో వంద శాతం నిజముందని, సెలబ్రిటీల వ్యక్తిగత సరిహద్దులను గౌరవించాల్సిందేనని మద్దతుగా నిలుస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, జిమ్‌లు, క్లినిక్‌లు, చివరికి కుటుంబ వేడుకల్లో కూడా కెమెరాలతో వెంటపడటం ఎంతవరకు సమంజసమనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
అసలేం జరిగింది?
ముంబైలోని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సల్మాన్ ఖాన్‌ను గుర్తించిన కొందరు ఫొటోగ్రాఫర్లు, అక్కడి నుంచి హిందుజా ఆసుపత్రి వరకు ఆయన వాహనాన్ని వెంబడించారు. ఆసుపత్రి దాటి బయటకు వస్తున్న సమయంలో అక్కడ మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సల్మాన్ వారిని కోరాడు.
ఆ సమయంలో అక్కడున్న కెమెరాల ఫ్లాష్‌లను చూసి సల్మాన్ తీవ్రంగా కలత చెందాడు. "మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లోపల ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే, బయట ఇలాగే కెమెరాలతో ఫ్లాష్‌లు కొడితే మీకెలా అనిపిస్తుంది?" అని ఆయన నేరుగా అక్కడి వారిని ప్రశ్నించాడు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: ముంబైలోని ఏ ఆసుపత్రి బయట సల్మాన్ ఖాన్ పాపరాజీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు?
ముంబైలోని హిందుజా ఆసుపత్రి వెలుపల సల్మాన్ ఖాన్ ఫొటోగ్రాఫర్ల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రశ్న 2: సోషల్ మీడియా పోస్ట్‌లో సల్మాన్ ఖాన్ తన వయసు గురించి ఏం చెప్పారు?
తనకు అరవై ఏళ్లు (60) వచ్చాయని, అంతమాత్రాన తాను పోరాడటం మర్చిపోలేదని సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రశ్న 3: సల్మాన్ ఖాన్ నటిస్తున్న రాబోయే చిత్రాలు ఏవి?
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం అపూర్వ లఖియా దర్శకత్వంలో 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' చిత్రంతో పాటు, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'SVC63' (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


