Salman Khan: అరే యార్.. నేను ఒంటరిని కాదు.. వైరల్ పోస్ట్‌పై సల్మాన్ ఖాన్ అసలు నిజం ఇదీ.. స్టార్ హీరో ఏం చెప్పాడంటే?
Salman Khan: తాను ఒంటరిగా ఉన్నానంటూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌పై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించాడు. ఆ పోస్ట్‌ను అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. తాను ఒంటరిని కాదంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ నెట్టింట సంచలనమే సృష్టిస్తుంది. ఇటీవల ఆయన పెట్టిన ఒక పోస్ట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాను ఒంటరిగా మారిపోయానంటూ ఆయన చేసిన ఆ పోస్ట్ కాసేపట్లోనే వైరల్‌గా మారింది. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎందుకు ఆయన అలా బాధపడుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

సల్మాన్ ఖాన్ పోస్ట్
ఈ వ్యవహారంపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందిస్తూ అభిమానులకు అసలు విషయం చెప్పాడు. తన పోస్ట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ ఒంటరిని కానని స్పష్టం చేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సల్మాన్ ఖాన్ ఈ వైరల్ పోస్ట్‌పై అధికారికంగా వివరణ ఇచ్చాడు. ఫ్యాన్స్ అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతూ ఒక ఆసక్తికరమైన నోట్ రాసుకొచ్చాడు.
అరే యార్
"అరే యార్.. నేను నా గురించి ఆ మాటలు అనలేదు. ఇంత పెద్ద అద్భుతమైన కుటుంబం, ఎంతో మంది స్నేహితులు ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఎలా ఉంటాను? మీలాంటి అభిమానులు, మీ దీవెనలు, ప్రార్థనలు నాకు ఉన్నప్పుడు నేను ఒంటరితనాన్ని ఎలా ఫీల్ అవుతాను? ఒకవేళ అలా అనుకుంటే నేనే అందరికంటే పెద్ద కృతజ్ఞత లేనివాడిని అవుతా" అని సల్మాన్ ఖాన్ భావోద్వేగంగా పేర్కొన్నాడు.
సల్మాన్ తల్లి కూడా
సల్మాన్ ఖాన్ ఒంటరి అనే పోస్ట్ ఎంతలా పాకిందంటే, చివరకు సల్మాన్ ఖాన్ తల్లి సల్మా ఖాన్ కూడా ఆందోళనకు గురయ్యారట. ఈ విషయాన్ని కూడా సల్మాన్ సరదాగా పంచుకున్నాడు."కొన్నిసార్లు ఎప్పుడూ జనం మధ్యే ఉంటూ విసుగు వస్తుంది. అందుకే కాస్త ప్రశాంతంగా ఒంటరిగా గడపాలని అనుకున్నానంతే.
ఈసారి కనీసం ఫోటో కూడా పెట్టలేదు, అయినా దీనిని బ్రేకింగ్ న్యూస్ చేసేశారు. నా తల్లి కూడా నా దగ్గరకు వచ్చి 'ఏమైంది రా?' అని కంగారుగా అడిగింది. కాబట్టి దయచేసి అందరూ కాస్త కూల్ అవ్వండి భయ్యా" అని సల్మాన్ ఖాన్ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
పాత పోస్ట్ లో
కొన్ని రోజుల క్రితం సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షర్ట్‌లెస్ ఫోటోను షేర్ చేస్తూ తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించాడు. ఆ ఫోటో కింద రాసిన క్యాప్షన్ అందరినీ ఆలోచనలో పడేసింది."నాకు నేనే.. ఒంటరిగా ఉండటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి 'అలోన్' (Alone), రెండోది 'లోన్లీ' (Lonely). అలోన్ అనేది మనం సొంతంగా ఎంచుకునేది, కానీ లోన్లీ అనేది ఎవరూ మనతో ఉండటానికి ఇష్టపడనప్పుడు వచ్చేది. దీనిని బట్టి మీరే అర్థం చేసుకోండి ఇక ముందు ఏం చేయాలో’’ అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నాడు.
ఫ్యాన్స్ కంగారు
పాత పోస్ట్ లో ఈ క్యాప్షన్ చూసిన అభిమానులు సల్మాన్ ఖాన్ ఫిట్‌నెస్‌ను మెచ్చుకుంటూనే, మరోవైపు ఆయన మానసికంగా ఏమైనా కుంగిపోతున్నారా అని ఆందోళన చెందారు. కానీ సల్మాన్ ఇచ్చిన తాజా వివరణతో ఆ రూమర్లన్నింటికీ ఒక్కసారిగా తెరపడింది.
రాబోయే మూవీస్
సల్మాన్ ఖాన్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రాబోతున్న 'మాతృభూమి' (Maatrubhumi) చిత్రంలో ఆయన నటిస్తున్నాడు. గతంలో ఈ సినిమాకు 'బాటిల్ ఆఫ్ గల్వాన్' (Battle of Galwan) అనే టైటిల్ పరిశీలించారు. భారత్-చైనా దళాల మధ్య గల్వాన్ లోయలో జరిగిన వాస్తవ ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, సినిమా టైటిల్‌తో పాటు కథనంలో కూడా చిత్ర బృందం కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ 2027 ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాత్కాలికంగా 'SVC63' అని పిలుస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబైలో ఘనంగా ప్రారంభమైంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


