Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో పాము కలకలం.. కాపాడిన స్నేక్ క్యాచర్.. అప్పుడు పాము కాటు.. ఇప్పుడిలా..

Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం ఉండే ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో సోమవారం (మే 18) ఒక పాము ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్, అధికారులు రంగంలోకి దిగి ఆ పామును సురక్షితంగా పట్టుకున్నారు.

Published on: May 18, 2026, 22:08:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Salman Khan: ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసిస్తున్నారు. సోమవారం (మే 18) ఈ అపార్ట్‌మెంట్ ఆవరణలో ఒక పాము ప్రత్యక్షం కావడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అపార్ట్‌మెంట్ సిబ్బంది పాములు పట్టే వ్యక్తికి (స్నేక్ క్యాచర్), స్థానిక అధికారులకు సమాచారం అందించారు. వారు సకాలంలో స్పందించి పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో పాము కలకలం.. కాపాడిన స్నేక్ క్యాచర్
Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో పాము కలకలం.. కాపాడిన స్నేక్ క్యాచర్

గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో ఏం జరిగింది?

సల్మాన్ ఖాన్ ఉంటున్న అపార్ట్‌మెంట్ కింది భాగంలో పాము తిరుగుతుండటాన్ని గమనించిన స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా దాన్ని చేతులతోనే పట్టుకున్నాడు. చాలా ప్రశాంతంగా ఆ పాము వెనుక వైపు నుంచి వెళ్లి, దాని తోకను పట్టుకుని, చేతికి చుట్టుకుంటూ రెస్క్యూ చేశాడు. ఆ తర్వాత దాన్ని భద్రంగా ఒక బ్యాగులో బంధించి అధికారులకు అప్పగించాడు. ఆ సమయంలో వన్యప్రాణి అధికారులు కూడా అతనికి సహాయం అందించారు.

స్నేక్ క్యాచర్ ఆ పామును హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి అది విషపూరితమైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆ పాము బిల్డింగ్ లోపలికి ప్రవేశించిందా లేదా కేవలం కింది భాగంలోనే తిరుగుతుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌస్‌లో పాము కాటుకు గురైన సంఘటనను ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

మరాఠీ ఇండస్ట్రీలో సల్మాన్ సరికొత్త రికార్డు

సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే 2023లో వచ్చిన 'టైగర్ 3' తర్వాత ఆయన 2025లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'సికందర్' సినిమాలో నటించారు. అయితే ఈ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కానీ ఈ ఏడాది రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో వచ్చిన మరాఠీ-హిందీ చిత్రం 'రాజా శివాజీ'లో సల్మాన్ పోషించిన జీవా మహాలా కామియో రోల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. మరాఠీ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్-టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో సంచలనం సృష్టించిన 'సైరాట్' కలెక్షన్ల రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది.

తెలంగాణ వీరుడి పాత్రలో సల్మాన్ ఖాన్

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దర్శకుడు అపూర్వ లఖియాతో కలిసి 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' అనే దేశభక్తి చిత్రంలో నటిస్తున్నారు. గతంలో ఈ సినిమాకు 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' అనే టైటిల్ అనుకున్నారు. అయితే చైనాతో ఉన్న దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా సినిమా టైటిల్‌ను 'మాతృభూమి'గా మార్చారు. కథను కూడా మరింత విస్తృతంగా మార్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గల్వాన్ లోయ ఘర్షణల్లో అమరుడైన మన తెలుగు నేల (తెలంగాణ) సూర్యాపేటకు చెందిన వీరుడు కల్నల్ బి. సంతోష్ బాబు పాత్రను పోషిస్తుండటం విశేషం.

ఈ సైనికుడి పాత్ర కోసం సల్మాన్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. చిత్రంలో చిత్రాంగద సింగ్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆగస్టు 14న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటు సంజయ్ దత్‌తో కలిసి '7 డాగ్స్' అనే అరబిక్ చిత్రంలో కూడా సల్మాన్ ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు.

దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో భారీ యాక్షన్ మూవీ

తెలుగు ప్రేక్షకులకు మరింత ఊపునిచ్చే విషయం ఏంటంటే.. సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. 'మహర్షి', 'వారసుడు' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వంశీ పైడిపల్లి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ముంబైలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ముంబైలో వేసిన ఒక భారీ సెట్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. "వంశీ పైడిపల్లి ఈ ఇద్దరు స్టార్ల కోసం పవర్‌ఫుల్ పాత్రలను డిజైన్ చేశారు," అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More