Ravi Mohan: ఇదేం ట్విస్ట్- విడాకులు వచ్చేదాకా సినిమాలు చేయనన్న హీరో జయం రవి- ప్రేయసి బ్రేకప్-వైఫ్ వైరల్ వార్నింగ్
Ravi Mohan: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) విడాకుల వ్యవహారం మరింత ముదిరింది. గాయని కెనీషా బ్రేకప్ పోస్ట్, రవి ప్రెస్ మీట్ కన్నీళ్లపై స్పందిస్తూ 'నిద్రపోతున్న సింహాన్ని కెలికారు, నా పిల్లల కోసం నిజాలు బయటపెడతా' అంటూ ఆర్తి రవి సంచలన పోస్ట్ పెట్టింది.
Ravi Mohan: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్), ఆయన భార్య ఆర్తి రవిల వ్యక్తిగత వివాదం రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆర్తి రవి తాజాగా సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ఒక హెచ్చరిక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

ఆర్తి రవి పోస్టు
తన భర్త రవి మోహన్ (జయం రవి) ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ, తనను అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడానికి కొన్ని గంటల ముందే ఆర్తి రవి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పవర్‌ఫుల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ కేవలం రవి మోహన్‌ను ఉద్దేశించి చేసినది మాత్రమే కాదని, ఈ మొత్తం వివాదంలో ఉన్న ఆధ్యాత్మిక హీలర్, గాయని కెనీషాను కూడా ఉద్దేశించి చేసినదేనని నెటిజన్లు భావిస్తున్నారు.
ఎందుకంటే అంతకుముందే కెనీషా సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన నోట్ రాస్తూ రవి మోహన్‌కు బ్రేకప్ చెప్తున్నట్లు ప్రకటించి ఈ వివాదంలో సరికొత్త మంటలు రాజేశారు.
నిద్రపోతున్న సింహాన్ని
ఈ పరిణామాలపై ఆర్తి రవి స్పందిస్తూ.. "నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడూ నిద్ర లేపకూడదు. ఒకవేళ అది తల్లి సింహం అయితే ఇక దేవుడే కాపాడాలి" అని ఆర్తి రాసుకొచ్చింది. "నేను పాటిస్తున్న హుందాతనంతో కూడిన మౌనాన్ని నా బలహీనతగా భావించవద్దు. దాన్ని తప్పుగా వాడుకోవద్దు. నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే నా కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తాను. ఈ ప్రపంచం ముందు నిజాలను నిలబెడతాను. ఎందుకంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది" అని ఆర్తి స్పష్టం చేసింది.
క్షణాల్లో వైరల్
ఆర్తి రవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. రవి మోహన్, కెనీషా ఇద్దరూ బహిరంగంగా చేస్తున్న ఆరోపణలకు ఆర్తి ఇచ్చిన బలమైన సమాధానం ఇదేనని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఈ పోస్ట్ చేసిన సమయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందే కెనీషా తన సోషల్ మీడియా ఖాతాలో రవి మోహన్‌తో బ్రేకప్ ప్రకటిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అది ఆర్తి రవిని నేరుగా టార్గెట్ చేస్తూ పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఆయన మీకే సొంతం
"నేను ఈ కథలోకి ప్రేమతో అడుగుపెట్టా. కానీ ఇప్పుడు మౌనంతో వెనుదిరుగుతున్నా. ఈ సమాజానికి, సినిమా ఇండస్ట్రీకి, విశ్లేషకులకు, ఆయన్ని ప్రేమించేవారికి, ద్వేషించేవారికి, సమర్థించేవారికి, ఎగతాళి చేసేవారికి లేదా ఆయన జీవితంపై హక్కులు కోరుకునేవారికి నేను చెప్పేది ఒక్కటే.. ఇకపై ఆయన పూర్తిగా మీకే సొంతం" అని కెనీషా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా ఆర్తి రవిని ఉద్దేశించి చేసినవేనని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
షాకింగ్ నిర్ణయం
ఈ క్రమంలోనే కెనీషా ఒక షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. తాను చెన్నై నగరాన్ని వదిలి వెళ్లిపోతున్నానని, సంగీతానికి, హీలింగ్ థెరపీకి దూరంగా ఉంటున్నానని చెప్పింది. అంతేకాకుండా సోషల్ మీడియా నుంచి కూడా శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఆన్‌లైన్ బుల్లీయింగ్, మానిప్యులేషన్ వంటి కారణాల వల్లే తాను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెనీషా ఆరోపించింది.
విడాకులు ఇచ్చేంతవరకూ
తాజాగా రవి మోహన్ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన భార్య విడాకులు ఇచ్చేంతవరకూ సినిమాలు చేయనని ప్రకటించాడు. ఇప్పుడు రవి మోహన్ ప్రెస్ మీట్‌లో తీవ్రంగా ఎమోషనల్ కావడం, కెనీషా హఠాత్తుగా ఈ వివాదం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం, వీటన్నింటికీ భార్య ఆర్తి రవి 'మదర్ లయన్' తరహాలో గర్జించడంతో ఈ సెలబ్రిటీల కుటుంబ వివాదం ఒక బహిరంగ యుద్ధక్షేత్రంగా మారింది. ఈ వివాదం ప్రస్తుతానికైతే ముగిసేలా కనిపించడం లేదు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న 1: జయం రవి, ఆర్తి రవిల వివాదంలోకి కెనీషా ఎలా వచ్చారు?
జవాబు: జయం రవి, ఆర్తి రవిల మధ్య విడాకుల ప్రక్రియ నడుస్తున్న సమయంలో మే 2025లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో రవి, కెనీషా కలిసి కనిపించారు. తాను రవికి స్పిరిచువల్ థెరపిస్ట్‌గా, స్నేహితురాలిగా మద్దతుగా నిలిచానని కెనీషా చెప్పారు.
ప్రశ్న 2: కెనీషా చెన్నై వదిలి వెళ్లిపోవడానికి కారణం ఏమిటి?
జవాబు: తనపై జరుగుతున్న నిరంతర ఆన్‌లైన్ బుల్లీయింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్, మానిప్యులేషన్ భరించలేక తాను చెన్నై నగరాన్ని, సంగీతాన్ని, థెరపీని వదిలిపెట్టి వెళ్తున్నట్లు కెనీషా ప్రకటించింది.
ప్రశ్న 3: కెనీషా బ్రేకప్ పోస్ట్‌పై ఆర్తి రవి ఎలా స్పందించారు?
జవాబు: కెనీషా బ్రేకప్ నోట్ షేర్ చేసిన తర్వాత ఆర్తి రవి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దని, తన పిల్లల కోసం, గౌరవం కోసం అవసరమైతే నిజాలను బయటపెడతానని 'మదర్ లయన్' (తల్లి సింహం) ఉదాహరణతో హెచ్చరించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


