Jayam Ravi: పురుషులే అతిపెద్ద బాధితులన్న జయం రవి.. మా సిస్టర్ మిమ్మల్ని ఆనందంగా ఉంచేదని తనుజ కౌంటర్
Jayam Ravi: తమిళ హీరో రవి మోహన్ (జయం రవి) పర్సనల్ లైఫ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ‘పురుషులే అతిపెద్ద బాధితులు’ అని రవి పోస్టు పెట్టాడు. దీనికి కౌంటర్ గా రవి మాజీ భార్య ఆర్తి సిస్టర్ తనుజ పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది.
ఓ వైపు దళపతి విజయ్ పర్సనల్ లైఫ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో మరో తమిళ హీరో రవి మోహన్ (జయం రవి) వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పురుషులే అతి పెద్ద బాధితులంటూ అతను పెట్టిన పోస్టుకు రవి మాజీ భార్య ఆర్తి సిస్టర్ తనుజ సింగం కౌంటర్ వైరల్ గా మారింది.

రవి మోహన్-ఆర్తి
తన భార్య ఆర్తి రవి నుంచి విడిపోతున్నట్లు తమిళ హీరో రవి మోహన్ 2024 సెప్టెంబర్ లో ప్రకటించాడు. ఆ తర్వాత అతను సింగర్ కనిషా ఫ్రాన్సిస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’ సినిమా పూజ కార్యక్రమాల ఫొటోలను రవి మోహన్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో యోగి బాబు హీరో. ఈ మూవీకి రవి మోహన్ డైరెక్టర్. ఈ పూజ కార్యక్రమంలో కనిషా కూడా పాల్గొంది.
ఫొటోలపై విమర్శలు
రవి మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఫస్ట్ మూవీ ‘యాన్ ఆర్డినరీ మ్యాన్’. ఈ సినిమా పూజ కార్యక్రమంలో రవి, కనిషా కలిసి కనిపించడంతో ఈ జంటపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కనిషాను కొంతమంది టార్గెట్ చేశారు. ఒక జంటను విడగొట్టావని ఆమెపై మాటలతో రెచ్చిపోతున్నారు.
పురుషులే బాధితులు
ట్రోల్స్ నేపథ్యంలో రవి మోహన్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది. ‘‘నేను నిశ్శబ్దంగా నా జీవితాన్ని నిర్మించుకుంటున్నా. మీరంతా ఏం చెప్పాలనుకుంటున్నారో మళ్లీ చెప్పండి. ఎందుకంటే మహిళలే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. కానీ పురుషులే అతిపెద్ద బాధితులు. మన న్యాయ వ్యవస్థ కూడా దాన్ని అర్థం చేసుకుంటుంది’’ అని రవి మోహన్ రాసుకొచ్చాడు.
‘‘ఒక రోజు మీరు నా హృదయాన్ని, నేను ప్రేమించే వ్యక్తుల కోసం ఏమి చేశానో మీరు తెలుసుకుంటారు. దయచేసి ఒక అబ్బాయిని జీవించనివ్వండి. మీ అసహ్యకరమైన ఆలోచనలను మీతోనే ఉంచుకోండి. నేను నా మార్గంలో తిరిగి వెళ్తున్నాను’’ అని రవి మోహన్ పేర్కొన్నాడు.
తనుజ కౌంటర్
రవి మోహన్ పోస్టుకు కౌంటర్ గా ఆర్తి సిస్టర్ తనుజ కామెంట్ పెట్టింది. ‘‘ఏదీ మిమ్మల్ని సంతోషంగా లేదా సంతృప్తిగా ఉంచుతున్నట్లు లేదు. ఆ పని నా సోదరి చేసేది’’ అని తనుజ కామెంట్ చేసింది. అయితే తనుజ కామెంట్ పై విమర్శలు వస్తున్నాయి. ఏం తెలియకుండా ఆర్తి, సంగీత (దళపతి విజయ్ భార్య)కు సపోర్ట్ ఇవ్వకండి అని తనుజపై ట్రోల్స్ వస్తున్నాయి.

రవి మోహన్, ఆర్తి సంబంధం
రవి, ఆర్తి 2009లో వివాహం చేసుకున్నారు. వారికి ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి 2024 సెప్టెంబర్‌లో తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు ప్రకటించి, విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












