భక్తిని నాటకమన్నారు-భజనలో విచిత్ర ప్రవర్తన-ఆపిన వాళ్లను కొరకడంపై ట్రోల్స్-సుధా చంద్రన్ రియాక్షన్ ఇదే

రీసెంట్ గా సీనియర్ నటి సుధా చంద్రన్ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఓ భక్తి కార్యక్రమంలో భజన సందర్భంగా పూనకంతో ఊగిపోయిన ఆమె గెంతులు వేశారు. ఆపిన వాళ్లను కొరికారు. ఈ వీడియోలపై ట్రోల్స్ కూడా వచ్చాయి. వీటిపై సుధా చంద్రన్ తాజాగా రియాక్టయ్యారు. తన భక్తిని నాటకమన్నారని పేర్కొన్నారు. 

Published on: Jan 6, 2026, 11:25:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మతపరమైన భక్తి కార్యక్రమం (జాగ్రాన్)లో నటి సుధా చంద్రన్ తీవ్రమైన భావోద్వేగాలకు లోనైన వీడియోలు వైరల్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆత్మజ్ఞాన స్థితిలో ఆమె ఉద్వేగానికి లోనైనట్లు వీడియోలలో కనిపించింది. అయితే, ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాక తనను కొందరు విమర్శించారని, ఈ సంఘటనను కేవలం నాటకమని కొట్టిపారేశారని సుధా చంద్రన్ వెల్లడించారు. దీనిపై ఆమె రియాక్టయ్యారు. తన భక్తిని నాటకమన్నారని తెలిపారు.

సుధా చంద్రన్ రియాక్షన్
సుధా చంద్రన్ రియాక్షన్

సుధా చంద్రన్ రియాక్షన్

జూమ్ ఇంటర్వ్యూలో సుధా చంద్రన్ తన అనుభవాన్ని, వీడియోలు సోషల్ మీడియాలో దృష్టిని ఆకర్షించిన తర్వాత తనకు ఎదురైన ట్రోలింగ్‌ను గురించి మాట్లాడారు. కొందరు సోషల్ మీడియా వినియోగదారులు తన ఆత్మజ్ఞాన స్థితిని ‘నకిలీ’, 'నాటకం' అని కొట్టిపారేశారని ఆమె చెప్పారు.

దీని గురించి మాట్లాడుతూ.. ‘‘నేను వివరణ ఇవ్వడానికి ఇక్కడ లేను. జీవితం పట్ల నాకంటూ ఒక అభిప్రాయం ఉంది. నాకు కొన్ని సంబంధాలున్నాయి. వాటిని నేను గౌరవిస్తాను. నాకు జనంతో పనేం లేదు. ఎవరైనా ట్రోల్ చేస్తే మంచిదే. వారు తమ జీవితాల్లో సంతోషంగా ఉండండి’’ అని సుధా చంద్రన్ అన్నారు.

స్వయంకృషితో

సుధా చంద్రన్ ఎవరి ప్రశ్నలకు లేదా ట్రోల్స్‌కు తాను జవాబుదారీ కాదని, తాను స్వయంకృషితో ఎదిగిన మహిళనని, గౌరవంతో, మర్యాదతో, దైవ దీవెనలతో తన జీవితాన్ని కొనసాగిస్తానని ఆమె పేర్కొన్నారు. ‘‘నా జీవితంలో ప్రజలు ఏమి చెబుతారో అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రమాదం తర్వాత కూడా, ప్రజలు 'నువ్వు తెలివితక్కువ పని చేస్తున్నావు' అని అన్నారు. కానీ అదే ఒక విజయగాథగా మారినప్పుడు ప్రజలు దాని గురించే చర్చించారు’’ అని నాగినిలో నటించిన సుధా చంద్రన్ తెలిపారు.

సుధా చంద్రన్ వైరల్ వీడియో

ఇటీవల సుధా చంద్రన్ కు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జాగ్రాన్‌లో పాల్గొన్నప్పుడు ఆమె ఒక విధమైన మైకంలో ఉన్నట్లు కనిపించింది. అక్కడ ఉన్న కొందరు ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు, కానీ ఆమె వారిని కొరికింది. క్లిప్‌లలో భక్తియుక్త క్షణంలో ఆమె ఆత్మజ్ఞాన స్థితిలో ఉన్నట్లు కనిపించింది. ఆమె హాల్‌లో అటూఇటూ గెంతుతూ, తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది.

ఆమె ఎరుపు, తెలుపు చీర కట్టుకుని, నుదిటిపై 'జై మాతా ది' అని రాసి ఉన్న హెడ్‌బ్యాండ్ ధరించి కనిపించింది. భజన కొనసాగుతున్నప్పుడు, ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనై, తన కదలికలను అదుపు చేసుకోలేకపోయింది. ఇటీవలి కాలంలో 'నాగిని' మొదటి రెండు సీజన్లలో కుట్రలు పన్నే తల్లి యమినీ రహేజాగా ఆమె నటనతో సుధా చంద్రన్ ప్రజాదరణ పొందింది. ఆమె 'యే హై మొహబ్బతైన్', 'క్యుంకి సాస్ భీ కభీ బహు థీ', 'మాతా కి చౌకీ', 'కలయుగ్ మే భక్తి కి శక్తి' వంటి షోలలో కూడా కనిపించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More