రాశిగారి ఫలాలు అని ఒక మహిళగా ఎలా అంటుంది? అనసూయపై ఫైర్ అయిన రాశి.. వీడియో వైరల్
సీనియర్ నటి రాశి ఫైర్ అయ్యారు. పరోక్షంగా అనసూయపై విరుచుకుపడ్డారు. రాశి గారి ఫలాలు అని ఓ మహిళ అయి ఉండి ఎలా అంటుందని ఫైర్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
సీనియర్ నటి రాశికి కోపమొచ్చింది. తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియో పోస్టు చేసిన ఆమె మండిపడ్డారు. అనసూయ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. శివాజీ, అనసూయ వివాదం అందరికీ తెలిసిందే. దీనిపై తన యూట్యూబ్ ఛానెల్ లో రియాక్టవుతూ రాశి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో అనసూయ చేసిన కామెంట్లకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు రాశి.

రాశి గారి ఫలాలు
గతంలో జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్లో అనసూయ వ్యాఖ్యలపై ఇప్పుడు రాశి ఫైర్ అయ్యారు. ఆ ఎపిసోడ్ లో అనసూయ ‘రాశి గారి ఫలాలు’ అనడంతో పాటు నవ్వేస్తుంది. అప్పుడు జడ్జీగా ఉన్న రోజా కూడా నవ్వుతుంది. ఈ కామెంట్ పై రాశి లేటెస్ట్ గా సీరియస్ అయ్యారు. శివాజీ ఇష్యూపై మాట్లాడుతూ రాశి గారి ఫలాలు అని ఓ మహిళ ఎలా అంటుందని విరుచుకుపడ్డారు.
ఏమన్నారంటే?
‘‘శివాజీ మాట్లాడింది 100 శాతం తప్పు అని అనను. కానీ కొన్ని మాటలు సరికాదు. ఆయనే రెండు, మూడు పదాలు తప్పుగా మాట్లాడానని సారీ కూడా చెప్పారు. ఇప్పుడు దీని గురించి కాదు కానీ అనవసరంగా నా గురించి మాట్లాడిన దాని గురించి చెప్తా. 4 ఏళ్ల క్రితం మా హస్బెండ్ ఓ క్లిప్పింగ్ చూపించారు. మీకు తెలిసే ఉంటుంది’’ అని రాశి చెప్పారు.
ఎలా అడుగుతారు?
‘‘అక్కడి నుంచి నాకు ఓ కాల్ వచ్చింది. ప్రేయసి రావే మూవీ సీక్వెల్ స్కిట్ చేస్తామనుకుంటున్నాం, వస్తారా? అని అడిగారు. నాకు ప్రేయసి రావే ఎంతో స్పెషల్. అందుకే కామిక్ గా తీస్తారేమో నేను చేయనని చెప్పా. అక్కడితో ఎండ్ అయిపోయింది.
తర్వాత అదే ఛానెల్ లో ఓ స్కిట్ చేశారు. అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. రాశి ఫలాలు అనే పదం వాడారు. దానికి ఆ షో యాంకర్ (అనసూయ) అదే రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా? అని అడిగింది. ఓ మహిళా అయి ఉండి అలా ఎలా అడుగుతుంది? నేను అది సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఆవిడ బాగా మాట్లాడుతున్నారు’’ అని రాశి సీరియస్ అయ్యారు.
హక్కు లేదు
‘‘రాశి ఫలాలు అంటే ఫైన్. కానీ రాశి గారి ఫలాలు అంటే అందులో నేను ఉన్నా. జడ్జెస్ లో ఓ ఆవిడ ఉన్నారు లేడీ. హహహ అని నవ్వారు. ఆ ప్లేస్ లో నేను ఉంటే ఆపేసేదాన్ని. బాడీ షేమింగ్ చేయడానికి తల్లిదండ్రులకే హక్కు లేదు. అనవసరమైన టాపిక్ లు ఎందుకు? ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడి సోషల్ మీడియాను బ్యాడ్ చేస్తున్నారు.
చేతిలో ఫోన్ ఉందని ట్రోల్ ఎందుకు చేస్తున్నారు? ఇది లీగల్ ఇష్యూ చేద్దామనుకున్నా. కానీ అమ్మ వద్దని ఆగిపోయా’’ అని రాశి పేర్కొన్నారు.
శివాజీ కామెంట్లు
రీసెంట్ గా దండోరా మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్ ల గురించి సీనియర్ నటుడు శివాజీ అసభ్యకరంగా మాట్లాడాడు. ‘సామాన్లు,’, ‘దొంగ ము**డా’ అనే పదాలు వాడాడు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విషయంలోనే శివాజీపై అనసూయ ఫైర్ అయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య కౌంటర్లు, మాటల దాడి కొనసాగింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


