Vijay Varma: తమన్నాతో బ్రేకప్.. జవాన్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్? ముంబైలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో వైరల్

Vijay Varma: బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ వర్మ ముంబైలో జవాన్ బ్యూటీ ఆలియా ఖురేషీతో కలిసి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తమన్నాతో బ్రేకప్ తర్వాత విజయ్ కొత్త రిలేషన్‌ స్టార్ట్ చేశాడా? అనే చర్చ మొదలైంది

Published on: Apr 23, 2026, 09:47:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vijay Varma: బాలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ వర్మ తన పర్సనల్ లైఫ్ పరంగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల 'మట్కా కింగ్' వెబ్ సిరీస్‌తో విశేష గుర్తింపు తెచ్చుకున్న అతను, తాజాగా ముంబై వీధుల్లో ఒక యువ నటితో కలిసి కనిపించడం ఇప్పుడు బిటౌన్‌లో కొత్త ఊహాగానాలకు తెరలేపింది.

తమన్నా, విజయ్, ఆలియా (instagram)
తమన్నా, విజయ్, ఆలియా (instagram)

ఆలియాతో విజయ్

ముంబైలోని ఒక ప్రముఖ జపనీస్ రెస్టారెంట్ నుంచి విజయ్ వర్మ, 'జవాన్' ఫేమ్ ఆలియా ఖురేషీ కలిసి బయటకు వస్తుండగా పాపరాజీల కంట పడ్డారు. వీరిద్దరూ చాలా క్యాజువల్ దుస్తుల్లో, ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. భోజనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా కారులో కూర్చుని కాసేపు ఏకాంతంగా చర్చించుకోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

తమన్నాతో బ్రేకప్?

విజయ్ వర్మ రెండేళ్ల పాటు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన వీరి బంధం ముగియడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు. ఇప్పుడు ఆలియాతో విజయ్ సన్నిహితంగా ఉండటాన్ని చూస్తుంటే, ఆయన తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే దీనిపై విజయ్ కానీ, ఆలియా కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం ఒక ఫ్రెండ్లీ మీట్ మాత్రమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఎవరీ ఆలియా ఖురేషీ?

షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రంతో ఆలియా ఖురేషీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం వెండితెరపైనే కాకుండా 'బందిష్ బండిట్స్', 'ఎటర్నల్లీ కన్ఫ్యూజ్డ్ అండ్ ఈగర్ ఫర్ లవ్' వంటి వెబ్ సిరీస్‌లలోనూ ఆమె మెరిసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

వరుస ప్రాజెక్టులతో విజయ్ బిజీ

ఒకవైపు వ్యక్తిగత జీవితంపై చర్చ జరుగుతున్నా, వృత్తిపరంగా విజయ్ వర్మ కెరీర్ గ్రాఫ్ దూసుకుపోతోంది. 'మట్కా కింగ్' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నఅతని చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అనిల్ కపూర్‌తో కలిసి 'ఫ్యామిలీ బిజినెస్', అలాగే సోనాక్షి సిన్హాతో కలిసి 'దహాద్' సీజన్ 2 షూటింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: విజయ్ వర్మతో కనిపించిన నటి ఎవరు?

జవాబు: షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమాతో గుర్తింపు పొందిన యువ నటి ఆలియా ఖురేషీ.

ప్రశ్న: విజయ్ వర్మ, తమన్నా విడిపోయారా?

జవాబు: అవును, సుమారు రెండేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న ఈ జంట గత ఏడాది విడిపోయినట్లు సమాచారం.

ప్రశ్న: విజయ్ వర్మ కొత్త వెబ్ సిరీస్ ఏమిటి?

జవాబు: విజయ్ వర్మ ప్రస్తుతం 'మట్కా కింగ్' అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More