O’Romeo OTT: ఇవాళ ఓటీటీలోకి రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్..ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్..ముంబై గ్యాంగ్‌స్టర్ కథలో తమన్నా
O’Romeo OTT: లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రొమియో’ మూవీ ఈ రోజు ఓటీటీలో రిలీజైంది. షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, తమన్నా, దిశా పటానీ తదితరులు నటించిన ఈ సినిమా ఏకంగా 240 దేశాల్లో డిజిటల్ డెబ్యూ చేసింది.
O’Romeo OTT: ఇండియన్ సినీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న రోజు రానే వచ్చింది. బాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ రోమియో' (O’Romeo) మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ రోజు (ఏప్రిల్ 10) నుంచే గ్లోబల్ ప్రీమియర్ అవుతోంది. ఇది ముంబై గ్యాంగ్ స్టర్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన మూవీ.

ఓ రోమియో ఓటీటీ
రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. జాతీయ అవార్డు గ్రహీత విశాల్ భరద్వాజ్ ఈ మూవీకి డైరెక్టర్. ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తక ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
240 దేశాల్లో
ఓ రోమియో మూవీ పెద్ద ఎత్తున ఓటీటీలో రిలీజైంది. ఏకంగా 240 దేశాల్లో స్ట్రీమింగ్ కు వచ్చింది. సాజిద్ నడియాడ్‌వాలా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వినిపించింది. ఇందులో షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, అవినాష్ తివారీ, నానా పాటేకర్, తమన్నా భాటియా, దిశా పటాని, ఫరీదా జలాల్ తదితర స్టార్లు నటించారు. ముంబై మాఫియా సామ్రాజ్యంలో ఒకప్పటి చీకటి రోజులను కళ్లకు కట్టిన ఈ మూవీ చూపిస్తుంది.
ఓ రోమియో స్టోరీ
ఓ రోమియో సినిమాలోని కథ 1994 నాటి బొంబాయి నేపథ్యంలో సాగుతుంది. నగరంలో అత్యంత శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్ ఉస్తారా (షాహిద్ కపూర్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతను కేవలం గ్యాంగ్‌స్టర్ మాత్రమే కాదు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇస్మాయిల్ ఖాన్ కోసం రహస్య ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో స్పెయిన్ మాఫియాతో సంబంధాలున్న దహేష్ దుగ్గల్‌ను పట్టుకోవడమే ఉస్తారా ప్రధాన లక్ష్యం.
తన ప్రియుడు బిల్లు హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్న అఫ్షాన్ (త్రిప్తి దిమ్రి) ఉస్తారా జీవితంలోకి ప్రవేశించడంతో కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. హింస, విధేయత మధ్య మొదలైన ఈ ప్రయాణం.. చివరికి ప్రేమ, ద్రోహం, సర్వైవల్ కోసం పోరాటంగా ఎలా మారిందనేది దర్శకుడు అత్యంత ఉత్కంఠభరితంగా ఆవిష్కరించాడు.
విశాల్ భరద్వాజ్ - గుల్జార్ మ్యాజిక్
విశాల్ భరద్వాజ్ సినిమాల్లో సహజంగానే కనిపించే 'నోయిర్' ఎలిమెంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ కథకు, అద్భుతమైన విజువల్స్, ఉత్కంఠ కలిగించే యాక్షన్ సన్నివేశాలు తోడయ్యాయి. ఇక ఈ చిత్రానికి దిగ్గజం గుల్జార్ సంగీతం, సాహిత్యం ప్రాణం పోశాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, అధికార దాహం, ప్రేమ కోసం మనుషులు చేసే త్యాగాలు, వారి నిర్ణయాల వల్ల కలిగే పర్యవసానాలను ఈ సినిమా లోతుగా విశ్లేషిస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


