Telugu OTT: ఇవాళ ఓటీటీలోకి రెండు తెలుగు సినిమాలు.. రొమాంటిక్ లవ్ డ్రామా.. ఎమోషనల్ థ్రిల్లర్.. ఓ లుక్కేయండి

Telugu OTT: తెలుగు ఓటీటీ ఆడియన్స్ కు అదిరే న్యూస్. ఇవాళ రెండు తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఇందులో ఒకటి రొమాంటిక్ యూత్ డ్రామా కాగా.. మరొకటి ఎమోషనల్ థ్రిల్లర్. ఇవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ లుక్కేయండి. 

Published on: Apr 9, 2026, 09:56:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు ఓటీటీ లవర్స్ అలర్ట్. ఈ క్రేజీ న్యూస్ మీ కోసమే. ఇవాళ ఓటీటీలోకి రెండు తెలుసు సినిమాలు వచ్చేశాయి. ఇందులో ఒకటేమో రొమాంటిక్ యూత్ డ్రామా ‘నిలవే’ కాగా.. మరొకటి ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’. ఈ రెండు సినిమాలు గురువారం (ఏప్రిల్ 9) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలోకి తెలుగు సినిమాలు (x)
ఓటీటీలోకి తెలుగు సినిమాలు (x)

నిలవే ఓటీటీ

ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రొమాంటిక్ యూత్ డ్రామా ‘నిలవే’ వచ్చేసింది. పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. జెన్ జీ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సౌమిత్ రావు, శ్రేయసి సేన్, హర్ష, సుప్రియ తదితరులు నటించారు.

మూవీ స్టోరీ

వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలో నిలవే రిలీజ్ అయింది. అర్జున్ (సౌమిత్) ఓ యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుంటాడు. అతనో అనాథ. తోడుగా ఓ అమ్మాయి ఉండాలని కోరుకుంటాడు. కానీ ఏ అమ్మాయి కూడా అతణ్ని ఇష్టపడదు. దీంతో ఫ్లాట్ లోనే ఉరి వేసుకుందామని అనుకుంటాడు.

అదే సమయంలో ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో అతిథి (శ్రేయసి) కనిపిస్తుంది. ఆమెను చూసి ఇష్టపడతాడు. అయితే అర్జున్ తో ఫిజికల్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ అతణ్ని అతిథి ప్రేమించదు. దానికి కారణం ఏంటీ? అతిథి కథ ఏంటీ? అన్నది నిలవే మూవీలో చూడాల్సిందే.

డార్క్ నైట్ ఓటీటీ

ఈ రోజు ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు సినిమా ‘డార్క్ నైట్’. ఇది ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చింది. ఇందులో పూర్ణ, విధార్థ్, త్రిగుణ్, సుభాశ్రీ రాయగురు తదితరులు నటించారు. ఈ సినిమా మార్చి 13న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఆహా వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజైంది.

కథ ఏంటీ అంటే?

అలెక్స్ (విధార్థ్), హేమ (పూర్ణ) భార్యాభర్తలు. పెద్దలు నిశ్చయించిన పెళ్లి చేసుకుంటారు. అయితే లాయర్ అయిన అలెక్స్ కు అతని ఆఫీస్ లో పని చేసే సోఫియా (సుభాశ్రీ)తో అక్రమ సంబంధం ఉంటుంది. ఇది తెలిసి అలెక్స్ ను హేమ వదిలేసి వెళ్లిపోతుంది. మరోవైపు జిమ్ ట్రైనర్ తో సోఫియాకు సంబంధం ఉంటుంది.

తప్పు తెలుసుకున్న అలెక్స్ తిరిగి హేమ దగ్గరకు వస్తాడు. కానీ అప్పటికే రోషన్ (త్రిగుణ్)తో హేమకు ఫ్రెండ్ షిప్ కుదురుతుంది. అలెక్స్, హేమ కలవడం రోషన్ కు నచ్చదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో డార్క్ నైట్ మూవీలో చూస్తే తెలుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More