OTT Crime Drama: ఓటీటీలోకి తమన్నా రొమాంటిక్ డార్క్ క్రైమ్ డ్రామా- అధికారం కోసం పోరాటం- ఇక్కడ చూడండి- కానీ ఓ ట్విస్ట్!
Tamanna OTT Romantic Crime Drama: తమన్నా, షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి, దిశా పటానీ, నానా పటేకర్, విక్రాంత్ మాస్సే నటించిన రొమాంటిక్ క్రైమ్ డ్రామా చిత్రం ఓ రోమియో ఓటీటీలోకి వచ్చేయనుంది. మరికొన్ని రోజుల్లో ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓటీటీ రిలీజ్ కానుంది. కానీ, ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. అదేంటో లుక్కేద్దాం.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి జంటగా నటించిన గ్యాంగ్‌స్టర్ లవ్ స్టోరీ చిత్రం'ఓ రోమియో'. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, హాట్ భామ దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు.

మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా
ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఓ రోమియో సినిమాను రూపొందించారు. అండర్‌వరల్డ్ మాఫియా, అధికారం కోసం జరిగే పోరాటం, వాటి మధ్య చిగురించిన ఒక సంక్లిష్టమైన ప్రేమకథే ఈ చిత్రం.
వాలంటైన్స్ డే కానుకగా
సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించిన ఈ సినిమాలో షాహిద్, తృప్తి, తమన్నా, దిశాతోపాటు సీనియర్ విలక్షణ నటుడు నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మాస్సే వంటి భారీ తారాగాణం నటించింది. ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది.
థియేటర్లలో స్పందన ఎలా ఉంది?
ఈ ఏడాదే థియేటర్లలోకు వచ్చిన ఓ రోమియో సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. విశాల్ భరద్వాజ్ మార్క్ మేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ, కథనం మరికాస్త వేగంగా ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, డార్క్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా బాగానే ఆకట్టుకుందని రివ్యూలు ఇచ్చారు.
స్పెయిన్‌లో అందమైన లొకేషన్లలో
ముంబైతో పాటు స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా దృశ్యకావ్యంలా ఉంటుందని పేరు తెచ్చుకుంది. అయితే, షాహిద్, తమన్నా, తృప్తి, దిశా నటించిన ఈ రొమాంటిక్ డార్క్ క్రైమ్ డ్రామా సినిమా ఓ రోమియో ఓటీటీలోకి వచ్చేయనుంది.
ఓ రోమియో ఓటీటీ స్ట్రీమింగ్
ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఓ రోమియో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 27న అంటే మరో ఆరు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ రోమియో ఓటీటీ రిలీజ్ కానుంది. కానీ, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.
రెంటల్ విధానంలో
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఓ రోమియో మార్చి 27 నుంచి ప్రైమ్ వీడియోలో 'రెంటల్' (అద్దె) ప్రాతిపదికన విడుదలవుతుంది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ, ఓ రోమియో సినిమా చూడాలంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అయితే, అదనపు ఖర్చు లేకుండా చూడాలనుకునే వారు మాత్రం ఏప్రిల్ మిడ్ వీక్ వరకు వేచి చూడాల్సిందే. ఏప్రిల్ రెండో వారంలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఓ రోమియో సినిమా ఫ్రీగా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ క్రైమ్ డ్రామాను ఆస్వాదించాలనుకునే వారు మరికొన్ని రోజుల్లో తమ ఇంట్లోనే కూర్చుని ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


