OTT: ఓటీటీలోకి 150 కోట్ల తమన్నా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్- రియల్ గ్యాంగ్‌స్టర్ జీవితంపై మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

O Romeo OTT Streaming Details: తమన్నా, షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి, దిశా పటానీ, విక్రాంత్ మాసే, నానా పటేకర్ వంటి స్టార్స్ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓ రోమియో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మిక్స్‌డ్ టాక్ నేపథ్యంలో ఓ రోమియో ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి నెలకొంది.

Published on: Feb 22, 2026, 09:52:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’ (O’Romeo). వాలంటైన్స్ డే కానుకగా ఓ రోమియో సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఓటీటీలోకి 150 కోట్ల తమన్నా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్- రియల్ గ్యాంగ్‌స్టర్ జీవితంపై మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి 150 కోట్ల తమన్నా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్- రియల్ గ్యాంగ్‌స్టర్ జీవితంపై మూవీ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఓ రోమియో సినిమాలో తమన్నా భాటియా, అవినాష్ తివారీ, నానా పటేకర్, దిశా పటానీ, విక్రాంత్ మాసే వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతోంది.

బాక్సాఫీస్ లెక్కలు: ఐదు రోజుల్లో ఎంతంటే?

ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగా రూపొందిన ఓ రోమియో చిత్రం విడుదలైన తొలి ఐదు రోజుల్లో భారతదేశం మొత్తంగా కేవలం రూ. 45.51 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా ఓ రోమియో సినిమాను తెరకెక్కించారు. ఓ రోమియో సినిమాకు సుమారుగా రూ. 125 నుంచి 150 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం.

అయితే, షాహిద్ కపూర్ తన నటనతో ఆకట్టుకున్నాడని, సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అయితే, బలహీనమైన స్క్రీన్‌ప్లే, ఊహకు అందే కథనం వల్ల ఓ రోమియో సినిమాకు ప్రతికూల స్పందన వస్తోంది. ముఖ్యంగా తమన్నా, దిశా పటానీ వంటి నటీమణుల పాత్రలకు సరైన ప్రాధాన్యత లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు?

ఇలా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటున్న ఓ రోమియో సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 6.5 రేటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ రోమియో ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఆసక్తిగా మారాయి. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓ రోమియో ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది.

అయితే, సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ రోమియో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంతకంటే కొన్ని రోజుల ముందు నుంచే రెంటల్ (Rent) పద్ధతిలో అందుబాటులో ఉండనుందని సమాచారం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ సభ్యులందరికీ ఉచితంగా ఓ రోమియో ఓటీటీ రిలీజ్ కానుంది. దర్శకుడు విశాల్ భరద్వాజ్, షాహిద్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా ఓ రోమియో.

గతంలో వీరిద్దరూ కలిసి కమీనే (2009), హైదర్ (2014), రంగూన్ (2017) వంటి విభిన్నమైన చిత్రాలను అందించారు. సాజిద్ నడియాద్వాలా నిర్మించిన ఈ ‘ఓ రోమియో’ చిత్రంలో షాహిద్ కపూర్ ‘ఉస్తారా’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More