తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ కూతురు నుంచి బెదిరింపులు- 2 కోట్లు ఇచ్చి రిలీజ్ చేయాలని నోటీసులు- షేక్ సంచలన డిమాండ్స్!

తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా ఓ రోమియో. షాహిద్ కపూర్ హీరోగా చేసిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదంలో ఇరుక్కుంది. ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుటుంబం నుంచి ఓ రోమియో మూవీని నిలిపివేయాలంటూ వార్నింగ్ వచ్చింది. హుస్సేన్ ఉస్తారా కుమార్తె లీగల్ నోటీసులు పంపండం సంచలనంగా మారింది.

Published on: Jan 13, 2026, 21:10:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తమన్నా భాటియా బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ఓ రోమియో. ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ చేశాడు.

తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ కూతురు నుంచి బెదిరింపులు- 2 కోట్లు ఇచ్చి రిలీజ్ చేయాలని నోటీసులు- షేక్ సంచలన డిమాండ్స్!
తమన్నా సినిమాకు గ్యాంగ్‌స్టర్ కూతురు నుంచి బెదిరింపులు- 2 కోట్లు ఇచ్చి రిలీజ్ చేయాలని నోటీసులు- షేక్ సంచలన డిమాండ్స్!

రూ. 2 కోట్లు ఇస్తేనే విడుదల!

అయితే, వెర్సటైల్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ రోమియో’ (O Romeo). ఇటీవల విడుదలైన ఓ రోమియో టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు అనూహ్యంగా అండర్‌ వరల్డ్ వివాదంలో చిక్కుకుంది.

గ్యాంగ్‌స్టర్ ఫ్యామిలీ నుంచి బెదిరింపులు

ముంబైకి చెందిన దివంగత గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా ఫ్యామిలీ నుంచి ఓ రోమియో చిత్రబృందానికి బెదిరింపులు వచ్చాయి. ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్ ఓ రోమియో చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్‌లకు నోటీసులు పంపడం ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

సంచలన డిమాండ్స్

ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ షేక్ (హుస్సేన్ ఉస్తారా) కుమార్తె సనోబర్ షేక్ తన లీగల్ నోటీసులో సంచలన డిమాండ్లు చేశారు. ఈ సినిమాలో తన తండ్రి హుస్సేన్ ఉస్తారా పాత్రను తప్పుగా చూపిస్తూ, తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆమె ఆరోపించారు.

రూ. 2 కోట్లు ఇస్తేనే విడుదల!

ఇందుకు పరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలని, తన అభ్యంతరాలన్నీ తీరే వరకు ఓ రోమియో సినిమా విడుదలను నిలిపివేయాలని సనోబర్ షేక్ డిమాండ్ చేశారు. అయితే, ఈ నోటీసులపై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

హుస్సేన్ ఉస్తారా - దావూద్ ఇబ్రహీం వైరం నేపథ్యమా?

ముంబై అండర్‌ వరల్డ్ చరిత్రలో హుస్సేన్ ఉస్తారా పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అప్పట్లో అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఆయనకు తీవ్రమైన వైరం ఉండేది. ఈ సినిమా టీజర్‌లో షాహిద్ కపూర్ గన్‌మెన్‌గా కనిపిస్తుండటం, భారీ యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో.. ఇది హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగానే తెరకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, చిత్ర యూనిట్ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ధృవీకరించలేదు.

విశాల్ - షాహిద్ హ్యాట్రిక్ మూవీ

‘కమీనే’, ‘హైదర్’ వంటి క్లాసిక్ హిట్ సినిమాల తర్వాత విశాల్ భరద్వాజ్ - షాహిద్ కపూర్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్రాంత్ మాస్సే, నానా పటేకర్, అవినాష్ తివారీ, తమన్నా భాటియా, దిశా పటానీ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫిబ్రవరి 13న రిలీజ్

ఈ వివాదాల మధ్య ‘ఓ రోమియో’ అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, ఓ రోమియో సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More