Bigg Boss Telugu 10 Promo: బిగ్ బాస్ 10 ప్రోమో వచ్చేసింది.. కింగ్ నాగార్జున 'దశావతారం' గేమ్ ప్లాన్ వెనుక అసలు రహస్యం ఇదే

Bigg Boss Telugu 10 Promo: తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ వ్యూవర్‌షిప్ కలిగిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' కొత్త సీజన్ వచ్చేస్తోంది. బిగ్ బాస్ 10 సీజన్ ప్రొమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ప్రోమోతోనే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

Published on: Jun 7, 2026, 11:36:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Telugu 10 Promo: విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు.. ఇప్పుడు పదో సీజన్‌లోకి (Bigg Boss Telugu Season 10) గ్రాండ్‌గా అడుగుపెట్టబోతోంది. తాజాగా స్టార్ మా (Star Maa) విడుదల చేసిన అఫీషియల్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

బిగ్ బాస్ 10 ప్రోమో వచ్చేసింది.. కింగ్ నాగార్జున 'దశావతారం' గేమ్ ప్లాన్
బిగ్ బాస్ 10 ప్రోమో వచ్చేసింది.. కింగ్ నాగార్జున 'దశావతారం' గేమ్ ప్లాన్

హోస్ట్ గా నాగార్జునే

హౌస్ లోని కంటెస్టెంట్లతో ఆటలాడిస్తూ, మాటలతో వాతలు పెడుతూ, తనదైన హోస్టింగ్ తో దూసుకుపోతున్న కింగ్ నాగార్జునే ఈ బిగ్ బాస్ తెలుగు పదో సీజన్ ను నడిపించనున్నాడు. ఎప్పటిలాగే హోస్ట్‌గా కింగ్ అక్కినేని నాగార్జున తన మార్క్ స్టైలిష్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చి అంచనాలను స్కై హైకి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రోమో కేవలం హంగామా కోసమే కాదు... ఈసారి ఆటలో రాబోయే ఒక మునుపెన్నడూ చూడని భారీ మార్పునకు గట్టి హింట్ కూడా ఇచ్చింది.

దశావతారం అంటే ఏంటి?

ప్రోమో ముగింపులో నాగార్జున చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. "ఈ సారి మీరు చూడబోయేది బిగ్ బాస్ 'దశావతారం'. ఈ సారి ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!" అని నాగ్ చెప్పాడు. ఈ పదో సీజన్‌ను 'దశావతారం'గా అభివర్ణించడం వెనుక మేకర్స్ ఒక పక్కా మైండ్ గేమ్‌ను ప్లాన్ చేసినట్లు ఇన్‌సైడ్ టాక్ వినిపిస్తోంది.

3 కోణాలు

మన HT తెలుగు ఎక్స్‌క్లూజివ్ అనాలిసిస్ ప్రకారం ఈ 'దశావతారం' థీమ్ వెనుక 3 ముఖ్యమైన కోణాలు ఉండే అవకాశం ఉంది.

10 వారాల స్పెషల్ ట్విస్ట్ లు: సాధారణంగా బిగ్ బాస్ 15 వారాల పాటు సాగుతుంది. కానీ ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ కోసం ప్రతి వారం ఒక 'అవతారం' చొప్పున 10 వారాల పాటు గేమ్ రూల్స్ పూర్తిగా మారిపోయేలా డిజైన్ చేశారని తెలుస్తోంది.

కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యం: సెలూన్ షాపుల నుంచి హైటెక్ ఐటీ ఆఫీసుల వరకు ప్రోమోలో చూపించినట్లే... సమాజంలోని 10 విభిన్న రంగాలకు చెందిన భిన్నమైన మనస్తత్వాలు ఉన్న కంటెస్టెంట్లను ఈసారి హౌస్‌లోకి పంపించబోతున్నారని టాక్.

మాజీ విజేతలు/కంటెస్టెంట్ల ఎంట్రీ: సీజన్ 10 కాబట్టి.. గత 9 సీజన్లలోని టాప్ కంటెస్టెంట్లు లేదా విన్నర్స్ ప్రతి వారం ఒక 'అవతారం' లాగా హౌస్‌లోకి వచ్చి కంటెస్టెంట్లకు సవాళ్లు విసిరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కామన్ మెన్ జోష్

గత సీజన్ (Bigg Boss 9) లో కామన్ మెన్ కేటగిరీ కింద అడుగుపెట్టిన పడాల కళ్యాణ్ టైటిల్ విన్నర్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. సెలబ్రిటీలను కాదని ఒక సామాన్యుడికి ప్రేక్షకులు పట్టం కట్టడంతో, సీజన్ 10 కోసం కామన్ మెన్ కోటా పెంచే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కింగ్ నాగ్ చెప్పినట్లు "యుద్ధాలు గెలిచిన మహా సామ్రాజ్యం" లో నిలబడాలంటే ఈసారి టాస్కులు, ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత కఠినంగా ఉండబోతున్నాయి.

స్టార్ మా స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా?

బిగ్ బాస్ గత కొన్ని సీజన్లుగా రొటీన్ ఫార్మాట్‌తో సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. అయితే పదో సీజన్ కోసం 'దశావతారం' అనే కొత్త థీమ్‌ను తీసుకురావడం ఖచ్చితంగా మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. నాగార్జున ఎనర్జీ, 'నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్స్' అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ప్రోమోకు మెయిన్ హైలైట్.

కేవలం గొడవలకు మాత్రమే పరిమితం కాకుండా, కంటెస్టెంట్ల మధ్య రియల్ ఎమోషన్స్, బుర్రకు పదును పెట్టే టాస్కులు ఉంటేనే ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ నంబర్ వన్ రేటింగ్‌ను దక్కించుకుంటుంది. రొటీన్ సీరియల్స్ బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఈ 'దశావతారం' సరికొత్త కిక్ ఇవ్వడం ఖాయమనే అంచనాలున్నాయి.

FAQ: People Also Ask

1. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

జవాబు: స్టార్ మా ప్రస్తుతానికి 'కమింగ్ సూన్' (Coming Soon) ప్రోమోను మాత్రమే విడుదల చేసింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, కంటెస్టెంట్ల క్వారంటైన్, హౌస్ సెట్ పనులు పూర్తయిన తర్వాత ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో గ్రాండ్‌గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

2. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయిందా?

జవాబు: అఫీషియల్ లిస్ట్ ఇంకా అనౌన్స్ కాలేదు. అయితే సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం కొంతమంది ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ నటీనటులతో పాటు ఈసారి కామన్ మెన్ కేటగిరీ నుండి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ రాబోతున్నట్లు సమాచారం.

3. బిగ్ బాస్ తెలుగు 10 ఏ ఓటీటీలో లైవ్ వస్తుంది?

జవాబు: బిగ్ బాస్ తెలుగు 10 స్టార్ మా (Star Maa) ఛానల్‌తో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More