ఆర్మీ జవాన్ నుంచి బిగ్ బాస్ ట్రోఫీ వరకు-రికార్డులు బ్రేక్ చేసిన పడాల కల్యాణ్-రియల్ విన్నర్ అంటూ ప్రశంసలు

ఆర్మీ జవాన్ నుంచి బిగ్ బాస్ విన్నర్ వరకూ.. పడాల కల్యాణ్ అద్భుతమైన ప్రయాణం కొనసాగించాడు. అసాధ్యమంటూ లేదని ట్రోఫీ గెలిచి చూపించాడు. ఈ క్రమంలో అతను బ్రేక్ చేసిన రికార్డులపై ఓ లుక్కేయండి.

Dec 22, 2025, 09:59:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అద్భుతాలు జరిగే వరకూ ఎవరు గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం ఉండదనేది ఓ సినిమా డైలాగ్. అలాంటి అద్భుతమే పడాల కల్యాణ్. అవును.. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో, బయట ఎక్కడ విన్నా ఇదే మాట. బిగ్ బాస్ 9 తెలుగు లో కామనర్ గా అడుగుపెట్టి విన్నర్ గా నిలిచిన పడాల కల్యాణ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.

బిగ్ బాస్ ట్రోఫీతో పడాల కల్యాణ్ (instagram-JioHotstar Telugu)
బిగ్ బాస్ ట్రోఫీతో పడాల కల్యాణ్ (instagram-JioHotstar Telugu)

బిగ్ బాస్ 9 విన్నర్

ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ బిగ్ బాస్ 9 విన్నర్ గా నిలిచాడు. సగర్వంగా ట్రోఫీ అందుకున్నాడు. తనూజ పుట్టస్వామిని దాటి విజేతగా తల ఎత్తుకున్నాడు. ఈ గెలుసు సాధారణమైంది కాదు. ఈ విజయం ఊరికే రాలేదు. అందుకే కల్యాణ్ గెలిస్తే తాము గెలిచినట్లు చాలా మంది జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కల్యాణ్ విజయాన్ని తమ గెలుపుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

కల్యాణ్ రికార్డులు

బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ గా నిలిచిన పడాల కల్యాణ్ కొన్ని రికార్డులు బ్రేక్ చేశాడు. కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సు అంటే యంగెస్ట్ విన్నర్ గా నిలిచాడు పడాల కల్యాణ్. అతని ఏజ్ 23 అని అంటున్నారు. మరోవైపు బిగ్ బాస్ టైటిల్ దక్కించుకున్న ఆర్మీకి చెందిన తొలి వ్యక్తి అతనే కావడం విశేషం.

ఆట ప్లస్ మాట

కామనర్ గా అగ్ని పరీక్షలో అడుగుపెట్టాడు పడాల కల్యాణ్. టాస్క్ ల్లో అదరగొట్టి బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్టార్టింగ్ లో కాస్త సైలెంట్ గా ఉన్నాడు. కానీ హోస్ట్ నాగార్జున వార్నింగ్ తో ఒక్కసారిగా జూలు విదిల్చాడు కల్యాణ్. ఆట ప్లస్ మాటతో అదరగొట్టాడు. అందరితో కలిసిపోయాడు. టాస్క్ ల్లో నంబర్ వన్ అనిపించుకున్నాడు. మన కుర్రాడిగా తెలుగు జనాలకు చేరువయ్యాడు.

రూ.50 లక్షలు

బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ గా నిలిచిన పడాల కల్యాణ్ మొత్తం రూ.50 లక్షల 50 వేల డబ్బును సొంతం చేసుకున్నాడు. డీమాన్ పవన్ సూట్ కేస్ లో తీసుకెళ్లిన రూ.15 లక్షలు పోను కల్యాణ్ కు ప్రైజ్ మనీగా రూ.35 లక్షలు దక్కాయి. అవి కాకుండా రాఫ్ టైల్స్ వాళ్లు రూ.5 లక్షలిచ్చారు. మరోవైపు రెమ్యునరేషన్ రూ.10 లక్షల 50 వేలు.

దీంతో మొత్తం రూ.50 లక్షల 50 వేలు కల్యాణ్ కు దక్కాయి. డబ్బుతో పాటు లగ్జరీ కారు మారుతి సుజుకి విక్టోరిస్ కూడా కల్యాణ్ కు లభించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More