Sreemukhi: గ్లామ‌ర్‌లో టాప్‌..మాట‌ల్లో తోప్‌.. శ్రీముఖి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే.. మా ఇంటి బంగారంలో సమంతతో!

Sreemukhi: బుల్లితెర సూపర్ స్టార్ యాంకర్ శ్రీముఖికి అందంలో, మాటల్లో తిరుగులేదు. ఈ బ్యూటీ క్వీన్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ మూవీలో సమంతతో కలిసి నటించింది. మరి శ్రీముఖి ఎంత సంపాదిస్తోంది? ఆమె రెమ్యునరేషన్ వివరాలపై ఓ లుక్కేయండి.

Published on: Jun 13, 2026, 20:42:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sreemukhi: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఎనర్జిటిక్ స్టైల్, భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె, ప్రస్తుతం బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటున్న యాంకర్ల జాబితాలో ముందు వరుసలో ఉంది. యాంకరింగ్‌తో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నఈ రాములమ్మ, వెండితెరపై కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శ్రీముఖి రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

గ్లామ‌ర్‌లో టాప్‌..మాట‌ల్లో తోప్‌.. శ్రీముఖి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే.. మా ఇంటి బంగారంలో సమంతతో! (instagram-Sreemukhi)
గ్లామ‌ర్‌లో టాప్‌..మాట‌ల్లో తోప్‌.. శ్రీముఖి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే.. మా ఇంటి బంగారంలో సమంతతో! (instagram-Sreemukhi)

మా ఇంటి బంగారంలో

తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'మా ఇంటి బంగారం' చిత్రంలో శ్రీముఖి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో జూన్ 19న విడుదల కాబోతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రీముఖి పాత్ర హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. సమంతకు ఆమె తోడి కోడలుగా నటించింది.

శ్రీముఖి రెమ్యునరేషన్

​సమంత స్వయంగా తన సొంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్'పై నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' చిత్రంలో శ్రీముఖి పోషిస్తున్న క్యారెక్టర్‌కు కథలో చాలా ప్రాధాన్యత ఉందని అంటున్నారు. సమంత నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక ఎత్తు అయితే, ఆమెకు తోడుగా శ్రీముఖి చేసే హంగామా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

సమంత లీడ్ రోల్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న క్రేజ్‌ను బట్టి, శ్రీముఖి తన పాత్ర కోసం గట్టిగానే డిమాండ్ చేసినట్లు సమాచారం. కేవలం కొన్ని రోజుల కాల్షీట్ల కోసమే మేకర్స్ ఆమెకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని టాక్. సినిమా ప్రొడక్షన్ బడ్జెట్, శ్రీముఖికున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు కూడా ఆమె అడిగిన భారీ పారితోషికానికి ఓకే చెప్పారని సమాచారం.

​టీవీ, రియాలిటీ షోలు

  • ​రెగ్యులర్ టీవీ షోలు: డ్యాన్స్ లేదా సింగింగ్ రియాలిటీ షోలు, కామెడీ షోలకు శ్రీముఖి ఒక్కో ఎపిసోడ్‌కు సుమారుగా రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. షో పాపులారిటీ, సదరు ఛానెల్ బడ్జెట్ ఆధారంగా ఈ పారితోషికంలో మార్పులు ఉంటాయి.
  • ​పండుగ స్పెషల్ ఈవెంట్లు: దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగల సమయంలో వచ్చే స్పెషల్ ఈవెంట్లకు బుల్లితెరపై శ్రీముఖి డిమాండ్ చాలా ఎక్కువ. ఇలాంటి ఒక్కో ప్రత్యేక ఈవెంట్ హోస్ట్ చేయడానికి ఆమె రూ.2.5 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్.
  • ​ప్రీ-రిలీజ్ ఈవెంట్లు / ఆడియో ఫంక్షన్లు: టాలీవుడ్ పెద్ద సినిమాల వేడుకలను, ఆడియో ఫంక్షన్లను హోస్ట్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ రేంజ్, సదరు హీరో క్రేజ్‌ను బట్టి ఒక ఈవెంట్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పారితోషికం అందుకుంటుందని తెలిసింది.

​బిగ్ బాస్ (Bigg Boss) ఆదాయం

​శ్రీముఖి 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 3' లో కంటెస్టెంట్‌గా వెళ్లినప్పుడు ఆ హౌస్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న సెలబ్రిటీగా రికార్డు సృష్టించింది. ఆ షో కోసం ఆమెకు రోజుకు దాదాపు రూ.1 లక్ష చొప్పున చెల్లించారని అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది. ఆమె రన్నరప్‌గా నిలిచి 105 రోజుల పాటు హౌస్‌లో విజయవంతంగా కొనసాగడం ద్వారా, ఆ ఒక్క రియాలిటీ షో నుంచే సుమారు రూ.1 కోటి వరకు ఆర్జించారని ఇండస్ట్రీ వర్గాలు చెప్తుంటాయి.

ఇక స్టార్ మా ఆస్థాన యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి.. బిగ్ బాస్ అగ్నిపరీక్షకు హోస్ట్ గా వ్యవహరించింది. గతేడాది సీజన్ 1కు ఆమెకు భారీగానే చెల్లించారని టాక్. ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 కూడా రాబోతుంది.

​ఇతర ఆదాయ మార్గాలు

​కార్పొరేట్ ఈవెంట్లు & ప్రారంభోత్సవాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రముఖ షాపింగ్ మాల్స్ లేదా జువెలరీ బ్రాండ్స్ ప్రారంభోత్సవాలకు (రిబ్బన్ కటింగ్) చీఫ్ గెస్ట్‌గా వెళ్లడానికి శ్రీముఖి సుమారు రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు తీసుకుంటుందని టాక్.

​సోషల్ మీడియా ప్రమోషన్స్: ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నందున, ప్రముఖ బ్రాండ్ల ప్రమోషనల్ పోస్టులు, కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా ఆమె ప్రతి నెలా భారీగానే ఆదాయం ఖాతాలో వేసుకుంటుంది.

వ్యాపారాలు: శ్రీముఖి వ్యాపారాల్లోనూ ఒక అడుగు వేసింది. పుర్సత్ పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసింది.

​People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

​ప్రశ్న: సమంత 'మా ఇంటి బంగారం' సినిమాలో శ్రీముఖి నటిస్తున్నారా?

జవాబు: అవును, జూన్ 19న విడుదల కాబోతున్న సమంత 'మా ఇంటి బంగారం' సినిమాలో యాంకర్ శ్రీముఖి ఒక ముఖ్యమైన, క్రేజీ పాత్రలో నటించింది.

​ప్రశ్న: శ్రీముఖి ఒక టీవీ ఎపిసోడ్‌కు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది?

జవాబు: శ్రీముఖి రెగ్యులర్ టీవీ షోలలో ఒక్కో ఎపిసోడ్‌ను హోస్ట్ చేయడానికి సుమారు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్.

​ప్రశ్న: బిగ్ బాస్ తెలుగు షో ద్వారా శ్రీముఖి ఎంత సంపాదించింది?

జవాబు: బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి, 105 రోజులు హౌస్‌లో ఉన్నందుకు గాను దాదాపు రూ.1 కోటి వరకు పారితోషికం అందుకున్నట్లు ఇండస్ట్రీ టాక్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More