కార్తీక దీపం 2: వామ్మో.. కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే.. వంటలక్క ప్రేమి సంపాదన ఇదే!

Karthika Deepam 2: తెలుగులో టాప్ సీరియల్ గా దూసుకుపోతోంది కార్తీక దీపం 2. ఇక ఈ సీరియల్ తో అదిరే పాపులారిటీ సంపాదించుకుంది దీప క్యారెక్టర్ చేస్తున్న ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ కోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. 

Published on: Jun 1, 2026, 13:52:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2: ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, రివేంజ్, సస్పెన్స్ తో సాగుతోంది కార్తీక దీపం 2 సీరియల్. ఈ తెలుగు టాప్ సీరియల్ లో దీపగా ప్రేమి విశ్వనాథ్ మరోసారి మ్యాజిక్ కొనసాగిస్తోంది. మరి రేటింగ్ లో దూసుకుపోతున్న ఈ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక్కడ చూసేయండి.

కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే (instagram-Premi Vineeth Bhatt)
కార్తీక దీపం దీప రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవాల్సిందే (instagram-Premi Vineeth Bhatt)

కార్తీక దీపం 2

బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపంతో తెలుగు ఆడియన్స్ మనసులు గెలుచుకుంది ప్రేమి విశ్వనాథ్. కేరళ అమ్మాయి అయినప్పటికీ తన నటనతో తెలుగువాళ్లను మెప్పించింది. ఆ సీరియల్ లో వంటలక్కగా క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు సీక్వెల్ కార్తీక దీపం 2లోనూ అదరగొడుతోంది.

రెమ్యునరేషన్

కార్తీక దీపం 2 సీరియల్ లో దీప అనే క్యారెక్టర్ ప్లే చేస్తోంది ప్రేమి విశ్వనాథ్. ఈ సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ టాప్ సీరియల్ కోసం ప్రేమి విశ్వనాథ్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసింది. ఇప్పుడు ఆమెకు రోజుకు రూ.లక్ష రూపాయలు ఇస్తున్నారని టాక్. అంటే నెల రోజులు షూటింగ్ చేస్తే ఏకంగా రూ.30 లక్షలు అకౌంట్లో చేరతాయన్నమాట.

అప్పుడు 25 వేలే

కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమి విశ్వనాథ్ రెమ్యునరేషన్ కు, ఇప్పటి రెమ్యునరేషన్ కు ఎంతో తేడా ఉంది. అప్పట్లో ఆమె రోజుకు రూ.25 వేలు మాత్రమే తీసుకునేదంటా. కానీ కార్తీక దీపం సీరియల్ తో ఆమె పాపులారిటీ పెరిగిపోయింది. దీంతో పాటు ఈ మలయాళీ నటి రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని అంటున్నారు.

భారీ ఆస్తులు

సీరియల్ లో పేదింటి అమ్మాయిగా నటించే ప్రేమి విశ్వనాథ్ కు రియల్ లైఫ్ లో మాత్రం భారీ ఆస్తులున్నాయని సమాచారం. ఆమె ఆస్తుల విలువ ఏకంగా రూ.50 కోట్లు అని సీరియల్ సర్కిల్ లో మాటలు వినిపిస్తున్నాయి. ప్రేమికి ఓ పెద్ద రాజభవనం లాంటి ఇల్లు, రెండు లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం.

అంతే కాకుండా కేరళలో ప్రేమి విశ్వనాథ్ కు చెందిన రెండు ఫిల్మ్ స్టూడియోలు కూడా ఉన్నట్లు టాక్. ఇక్కడ రెగ్యులర్ గా షూటింగ్ లు జరుగుతాయని అంటున్నారు.

పర్సనల్ లైఫ్

ప్రేమి విశ్వనాథ్ భర్త పేరు వినీత్ భట్. ప్రేమికి ఆరడగుల కొడుకు మనుజిత్ కూడా ఉన్నాడు. కండలు పెంచిన ఈ కుర్రాడు హీరోలా ఉంటాడు. తన ఫిట్ నెస్ వీడియోలు, వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుంటాడు. కార్తీక దీపం దీపకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? అనే డౌట్ వచ్చేలా మనుజిత్ కటౌట్ ఉంటుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More