కార్తీక దీపం 2: కార్తీక దీపం 2 విలన్ జ్యోత్స్న గ్లామర్ షో.. సీరియల్ కాదు సినిమా హీరోయిన్ అంటూ కామెంట్లు.. వీడియో వైరల్
కార్తీక దీపం 2: కార్తీక దీపం 2 సీరియల్ లో కన్నింగ్ విలన్ జ్యోత్స్నగా తన యాక్టింగ్ తో అదరగొడుతోంది గాయత్రి సింహాద్రి. టాప్ సీరియల్ లో విలనిజం పండిస్తున్న ఈ భామ.. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం హాట్ షోతో రెచ్చిపోతోంది. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ వీడియో ఒకటి వైరల్ గా మారింది.
కార్తీక దీపం 2: తెలుగు రాష్ట్రాల్లోని సీరియల్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది కార్తీక దీపం 2. ఈ సీరియల్ రేటింగ్స్ లో టాప్ లేపుతూ, క్రేజ్ పరంగానూ దూసుకెళ్తోంది. ఇందులో లేడీ విలన్ జ్యోత్స్నగా గాయత్రి సింహాద్రి తన యాక్టింగ్ తో సత్తాచాటుతోంది. కన్నింగ్ నటనతో అదరగొడుతోంది. బయట ఇన్ స్టాగ్రామ్ లోనేమో గ్లామర్ షోతో రెచ్చగొడుతోంది ఈ భామ.

గాయత్రి సింహాద్రి వీడియో
కార్తీక దీపం 2 సీరియల్ లో విలన్ జ్యోత్స్న గురించి సీరియల్ లవర్స్ అందరికీ పరిచయమే. ఆమె అసలు పేరు గాయత్రి సింహాద్రి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తరచూ పోస్టులు పెడుతుంటుంది. గ్లామర్ షో వీడియోలతో అలరిస్తుంటుంది. తాజాగా గాయత్రి పోస్టు చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.
బ్లూ డ్రెస్ లో
గాయత్రి సింహాద్రి బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. డిఫరెంట్ పోజులతో కూడిన ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఈ భామ పోస్టు చేసింది. ఈ వీడియో కు ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు.
సినిమా హీరోయిన్
గాయత్రి సింహాద్రి సినిమా హీరోయిన్ కు ఏ మాత్రం తక్కు కాదని, ఆమెను సినిమాలలో చూడాలని ఉందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సీరియల్ లో విలన్ కాదు, సినిమా హీరోయిన్ అని పొగిడేస్తున్నారు. క్వీన్, స్టన్నింగ్ బ్యూటీ అంటూ ప్రేమ కురిపించేస్తున్నారు.
కార్తీక దీపం 2 సీరియల్
స్టార్ మాలో ప్రసారమవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తెలుగు రాష్ట్రాల్లో ఇది టాప్ సీరియల్ గా కొనసాగుతోంది. ఇందులో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. గాయత్రి సింహాద్రి ఏమో విలన్ గా నటిస్తోంది. ఇంకా సీత, స్వర్ణ, నటకుమారి తదితరులు ఈ సీరియల్ చేస్తున్నారు.
సీఈఓ పోస్టు కోసం
ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ లో సీఈఓ పోస్టు కోసం జ్యోత్స్న, దీప మధ్య వార్ జరుగుతోంది. వీళ్లకు పెట్టిన టెస్టులో నెగ్గడం కోసం జ్యోత్స్న కన్నింగ్ ప్లాన్ లు వేస్తుంది. అలాగే బావ కార్తీక్ కు దీపను దూరం చేయాలని జ్యోత్స్న ట్రై చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్ లు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి.
కార్తీక దీపం 2 సీరియల్ లో ఒరిజినల్ డాటర్ అయిన దీప స్థానంలో జ్యోత్స్న పెరుగుతుంది. ఈ నిజం అందరికీ తెలిసేలా చేసేందుకు దీప, కార్తీక్ ప్రయత్నిస్తుంటారు. వీళ్లను ఆపాలని జ్యోత్స్న కుట్రలు వేస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


