కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్నకు బుజ్జమ్మగా పేరు పెట్టిన దీప- ఫుట్‌బాల్ ఆడుకున్న దీప, కార్తీక్-సుమిత్ర ఒడికి దీప
Karthika Deepam 2 Serial May 23rd Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 23వ ఎపిసోడ్‌లో కార్తీక్ దగ్గర శౌర్యను పడుకోనివ్వదు జ్యోత్స్న. కానీ, శౌర్య, దీపను తన గదిలో పడుకోమ్మని సుమిత్ర షాక్ ఇస్తుంది. జ్యోత్స్నకు బుజ్జమ్మ అనే కొత్త పేరు పెడుతుంది దీప. జ్యోత్స్న బుగ్గలను కార్తీక్, దీప గిల్లుతారు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అందరిని భోజనానికి శివ నారాయణ పిలుస్తాడు. కార్తీక్, దీప తర్వాత తింటారని, మనం ముందు తిందామని జ్యోత్స్న అంటుంది. ఇంకా వీళ్లను పనివాళ్లుగా చూస్తున్నావా. నీతో తింటే హోదా పడిపోతుందా అని కాంచన తిడుతుంది. మేము తర్వాత తినం మీతోనే తింటామని కార్తీక్ అంటాడు.

శివ నారాయణ సీరియస్
నువ్వు పనివాడివి కదా అని పారు అంటే.. ఎవరికీ నీకా అని శివ నారాయణ కోప్పడుతాడు. అగ్రిమెంట్ అని పారిజాతం అంటే.. అదేది లేదని, వాడు కూతురు కొడుకు. ఇంట్లో ఉన్నన్ని రోజులు కలిసే తింటాం అని శివ నారాయణ తెగేసి చెప్పి పోతాడు. ఇది ఇంత శాడిస్ట్‌లా తయారైందేంట్రా అని కాంచన అంటే.. కొత్తగా అవడం ఏంటీ, బై బర్త్ అదేగా అని కార్తీక్ అంటాడు.
భోజనం చేసేటప్పుడు కూడా ఇంట్లో కేవలం రసంతోనే తింటారేమో అని జ్యో అవమానిస్తుంది. రసం తింటే వచ్చే హెల్త్ బెన్‌ఫిట్స్ గురించి కార్తీక్ చెబుతాడు. ఇంట్లో శౌర్యను ఎవరితో పడుకుంటావని అడిగితే.. అమ్మనాన్నతో అని చెబుతుంది. ఇక్కడ ఎక్కడ పడుకుందామని శౌర్య అడిగితే.. నాతోనే పడుకోమ్మని కార్తీక్ అంటాడు.
నీతో ఎవరు పడుకోకూడదు. ఇప్పటికే నేను చాలా అడ్జస్ట్ అయ్యాను. ఇంకా నిబంధనలు దాటితే పోటీ నుంచి తప్పుకోమ్మని జ్యోత్స్న అంటుంది. సుమిత్ర శౌర్యను నీ గదిలో పడుకోబెట్టుకో అని దశరథ్ అంటే.. దీపను కూడా పడుకోమనండి, ఏ ఇబ్బంది లేదని సుమిత్ర అంటుంది. శివ నారాయణ గదిలో కార్తీక్, దశరథ్ పడుకుంటామని చెబితే.. జ్యోత్స్న గదిలో కాంచన పడుకుంటానని ట్విస్ట్ ఇస్తుంది.
జ్యోత్స్న గొయ్యి జ్యోత్స్నే తీసుకుంటున్నట్టుంది
జ్యోత్స్నతో కాంచన పడుకుంటే నన్ను లోనికి రానివ్వదు. దాన్ని బయటకు పోనివ్వదని, జ్యోత్స్న గొయ్యి జ్యోత్స్నే తీసుకుంటున్నట్టుంది అని పారిజాతం అనుకుంటుంది. జ్యో వెళ్లిపోగానే తన వెంట పారిజాతం వెళ్తుంది. అది కార్తీక్ చూస్తాడు. మరోవైపు కాశీని వెనుక నుంచి హగ్ చేసుకున్న స్వప్న హనీమూన్‌కు వెళ్దామని అంటుంది. ఇప్పుడు మావయ్యకు ఆరోగ్యం బాలేదు కదా, వెళ్తే బాగుండదని కాశీ అంటాడు. హనీమూన్‌కు వెళ్లమని వాళ్లే చెప్పారని స్వప్న అంటుంది.
వాళ్లు అలాగే అంటారు. బావ ఉన్నా కూడా తన పనులు తనకు ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్లిన మన మనసు ఇక్కడే ఉంటుంది. వాళ్లకు నేను చెబుతానని కాశీ అంటుంది. నా చేతిలో ఇంత త్వరగా ఎందుకు ఓడిపోతున్నావ్, వాదించొచ్చు కదా అని స్వప్న అంటుంది. భార్యతో వాదించడానికి ఓపిక, ప్రేమ కావాలి, భార్య ముందు ఓడిపోవడం రాజు యుద్ధం గెలిచినట్లే అని కాశీ అంటాడు. ఇలా మాట్లాడితే నీతో ప్రేమలో పడిపోతాను అని స్వప్న అంటుంది.
ఆల్రెడీ పడిపోయావుగా అని కాశీ అంటే.. భర్తను ప్రేమగా హగ్ చేసుకుంటుంది స్వప్న. మరోవైపు జ్యోత్స్న వెళ్తుంటే ఏంటా స్పీడు అని దీప అడుగుతుంది. అడుగులు లెక్కపెట్టుకుంటూ వెళ్లాల అని కోపంగా జ్యో అంటుంది. ఇలా మాట్లాడుతుంటే బుగ్గ గిల్లాలనిపిస్తుందని జ్యోత్స్న బుగ్గ గిల్లుతుంది దీప. ఇంత గట్టిగా గిల్లావేంటని జ్యో అరుస్తుంది.
బుజ్జమ్మగా పేరు
ఇంతలో కార్తీక్ వచ్చి ఎందుకు అలా గిల్లావని అడుగుతాడు. ఈ బుజ్జమ్మకు థ్యాంక్స్ చెప్పాలని దీప అంటుంది. బుజ్జమ్మ ఏంటని జ్యో అడిగితే.. అవునే, నువ్వు నాకు బుజ్జమ్మవే. అలాగే పిలుస్తాను, నచ్చితే పలుకు లేకుంటే ఉలుకు అని జ్యోత్స్నకు కొత్త పేరు పెడుతుంది దీప. బుజ్జమ్మకు ఎందుకు థ్యాంక్స్ అని కార్తీక్ అడుగుతాడు.
ఇది నాతో ఆఫీస్‌లో ఛాలెంజ్ చేసింది. నా తల్లికి దూరం చేస్తానని. కానీ, కర్మ సిద్ధాంతం చూశావా. మాట అన్ని పది గంటలు కాకముందే మా అమ్మతో కలిసి ఉండే అవకాశం దక్కిందని, థ్యాంక్స్ బుజ్జమ్మ అని దీప అంటుంది. మీకు ముందుంది ముసళ్ల పండుగ అని జ్యో అంటే నువ్వు ఏదోటి చేస్తూనే ఉండు. నువ్వు ఏం చేసిన మనకే మంచి జరుగుతుందని కార్తీక్ అంటాడు. ఎలాగని దీప అడుగుతుంది.
అగ్రిమెంట్ నుంచి కార్తీక్ మొదలుపెడతాడు. అగ్రిమెంట్ వల్లే మనం ఈ ఇంటికి వచ్చాం. లేకుంటే జ్యోత్స్న ఏంటో తెలిసేది కాదని, ఇంట్లోవాళ్లకు చెప్పకుండా ఉండేవాళ్లమని కార్తీక్ అంటాడు. సీఈఓ విషయంలో పంతానికి పోకుంటే నేను పోటీకి దిగే అవకాశం వచ్చేదా, నన్ను నిన్ను విడగొట్టాలని చూసింది కానీ తీరా కుటుంబం అంతా ఇక్కడికే వచ్చామని దీప అంటుంది. జ్యోత్స్న చేసిన పనులు తనకే ఎలా బెడిసికొట్టాయో చెబుతారు కార్తీక్, దీప.
జ్యోని గిల్లిన కార్తీక్, దీప
అందుకే థ్యాంక్స్ చెప్పాలని జ్యోత్స్న రెండు చెంపలను కార్తీక్, దీప గిల్లుతారు. తర్వాత దీపను మెల్లిగా ప్రేమగా గిల్లుతాడు కార్తీక్. జ్యోత్స్న అరుస్తుంది. అరుస్తాన్నావేంటీ, ఇదేమైనా ఆఫీస్ అనుకున్నావా. ఇది మా ఇల్లు. అంటే నా ఇల్లు. వేషాలు వేయకుండా వెళ్లి తలుపేసుకుని పడుకో అని దీప వార్నింగ్ ఇస్తుంది. తన మెడలో మూడు ముళ్లు పడనివ్వను అని జ్యో అంటే.. పడేలా చేస్తానని కార్తీక్ అంటాడు.
నీది భస్మాసుర హస్తం. నిన్ను ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. నీ అంతట నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకుంటావని కార్తీక్ అంటాడు. అలాంటి పరిస్థితే వస్తే నాతోపాటు మిమ్మల్ని తీసుకెళఅలిపోతానని జ్యో అంటుంది. పాము, రంపం కథ చెప్పిన కార్తీక్ మూర్ఖుల కోపం తమనే నాశనం చేస్తుందని చెబుతాడు. తర్వాత థ్యాంక్స్ చెప్పి కార్తీక్, దీప వెళ్లిపోతారు.
జ్యోత్స్న కోపంగా వెళ్తుంది. వాళ్లు ఏంటే నీతో ఫుట్‌బాల్ ఆడుకున్నారని పారిజాతం అడుగుతుంది. ఆఫీస్‌లో నేను ఆడుకున్నా, ఇంట్లో వాళ్లు ఆడుకున్నారని, లెక్క సరిచేస్తానని జ్యోత్స్న వెళ్లిపోతుంది. తర్వాత సుమిత్ర గదిలో కింద పడుకునేందుకు దీప చాప వేస్తుంది. పైన పడుకోమ్మని సుమిత్ర చెబుతుంది. కిందనే పడుకుంటానని దీప అంటుంది. అమ్మమ్మ పైన పడుకోమంటుందిగా. నీ కడుపులో బేబీ ఉంది కదమ్మా. కింద పడుకుంటే ఇబ్బంది పడదు అని శౌర్య అంటుంది.
మా అమ్మ కథలు చెప్పేది
నీ కూతురు పెద్దది అయింది, నేను అనాల్సిన మాటలు అదే అంటుంది, పైన కూర్చో అని సుమిత్ర అంటుంది. దాంతో దీప కూర్చొంటుంది. సుమిత్ర ఒడిలో శౌర్య పడుకుని ఉండటం చూసి మురిసిపోతుంది దీప. ఏమైందని సుమిత్ర అడుగుతుంది. ఏది ఉన్న నీ తల్లికి చెప్పుకో అని సుమిత్ర అంటుంది. తర్వాత తను కడుపుతో ఎలా ఉండేదో చెబుతుంది సుమిత్ర.
నేను కడుపుతో ఉన్నప్పుడు మా అమ్మ కథలు చెప్పేదని సుమిత్ర అంటే.. నేను అమ్మమ్మ చెప్పిన కథలు వినేదాన్ని అని దీప అనుకుంటుంది. నీకు అమ్మ లేదుగా దీప ఏది ఉన్న నాకు చెప్పు అని సుమిత్ర అంటుంది. నువ్వు నాకు అమ్మమ్మవి అయితే అమ్మకు ఏమతావ్ అని శౌర్య అడుగుతుంది. అమ్మనవుతానని సుమిత్ర అంటుంది. దీప ఆనందంతో, కన్నీళ్లతో చూస్తుంది.
అలా అయితే మా అమ్మకు అమ్మ ఉన్నట్లేగా అని శౌర్య అంటుంది. అవును, ఉన్నట్లే అని సుమిత్ర అంటుంది. ఈ సీన్ ఎమోషనల్‌గా ఉంటుంది. దీప, సుమిత్ర ఆప్యాయంగా చూసుకుంటారు. చెప్పు దీప నీ మనసులో ఏముందని సుమిత్ర అంటే.. అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని ఉందని దీప అంటుంది.
సుమిత్ర ఒడిలో దీప
దానికి చలించిపోయిన సుమిత్ర రా దీప, నేనే నీ తల్లి అనుకో అని సుమిత్ర అంటుంది. దీప కన్నీళ్లతో చూస్తుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


