Karthika Deepam 2 Today Episode: దీప తన సొంత మనవరాలు కాదని తెలుసుకున్న పారిజాతం- దాసుతోనే నిజం బయటపెట్టించిన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial May 12th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మే 12వ ఎపిసోడ్‌లో దాసును ఇంటికి రమ్మని పిలిచిన జ్యోత్స్న మారిపోయినట్లు నటిస్తుంది. అది నమ్మిన దాసు జ్యోత్స్న తన కూతురు అని, బాగా చూసుకుంటానని మాట్లాడతాడు. ఆ మాటలు విన్న పారిజాతంకు దీప తన సొంత మనవరాలు కాదన్న నిజం తెలుస్తుంది.

Published on: May 12, 2026, 07:35:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర తండ్రి దక్షిణామూర్తిని ఇంటికి తీసుకొచ్చినందుకు కార్తీక్‌ను తిడతాడు శివ నారాయణ. ఇంకెప్పుడు అతని గురించి తెలుసుకోవద్దని, ఇక్కడితో జరిగింది మర్చిపోమ్మని వార్నింగ్ ఇస్తాడు. తాత ముందు నన్ను ఎందుకు ఇరికించావని పారును అడుగుతుంది జ్యోత్స్న.

కార్తీక దీపం 2 సీరియల్ మే 12 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ మే 12 ఎపిసోడ్

నా మనవరాలిని ఇరికిస్తానా

లేకుంటే నా మనవడి పేరు చెప్పనా అని పారిజాతం అంటుంది. దీప పేరు చెప్పనుంటివి అని జ్యో అంటే.. నా మనవరాలిని ఎందుకు ఇరికిస్తానని నోరు జారుతుంది పారిజాతం. నీ మనవరాలా.. నాకు ఓ క్లారిటీ వచ్చిందని జ్యోత్స్న అంటుంది. ఏంటే బోడీ క్లారిటీ. నా వెనుక పవర్ ఉంది. ఆ పవర్ పేరు కార్తీక దీపం. నా మనవడు నా మనవరాలు నా బలం, నా బలగం అని పారిజాతం అంటుంది.

నీ కళ్లు తెరిపించేందుకు నాకు ఓ అవకాశం ఇవ్వు అని పారును తీసుకెళ్తుంది జ్యోత్స్న. మరోవైపు సుమిత్రకు ఆపరేషన్ జరిగిందిగా, పూర్తిగా కోలుకోవాలంటే 3 నెలలు పడుతుంది. ఏదైనా టెన్షన్ పడినప్పుడు ఇలా కళ్లు తిరుగుతాయి. జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. ఇవాళ జరిగింది ఇక్కడితో మర్చిపోండి. సుమిత్ర నీకు బాధ కలిగించే మరే విషయం జరగనివ్వను. నీకు ఈ కుటుంబం మాత్రమే ఉందని నొక్కి మరి సుమిత్రతో అంటాడు శివ నారాయణ.

ఇన్నేళ్లు పుట్టిల్లు లేదనేగా బతుకుతున్నావ్. ఇప్పుడు కొత్త బంధాలను ఆహ్వానించాల్సిన అవసరం లేదని సుమిత్రతో దశరథ్ అంటాడు. దాసును జ్యోత్స్న రమ్మనడంతో దాసు వస్తాడు. భయంగా ఉందని, కాస్తా పక్కకు వెళ్లి మాట్లాడుకుందామని దాసును తీసుకెళ్తుంది జ్యోత్స్న. అక్కడ పారిజాతం చాటుగా ఉండి వింటుంది.

దాసు మాటలు విన్న పారిజాతం

నా గురించి నిజాలు తెలిస్తే నా పరిస్థితి ఏంటా అని భయపడుతున్నాను అని జ్యోత్స్న అంటుంది. ఈ తండ్రి బతికున్నంత వరకు నీకు ఏం కాదమ్మా అని దాసు అంటాడు. ఆ మాట విన్న పారిజాతం షాక్ అవుతుంది. నీకు నా మీద కోపం ఉంది కదా నాన్న అని జ్యో అంటే.. ఏది ఉన్న నువ్వు నా కూతురివే అమ్మా అని దాసు అంటాడు. ఆ మాట కూడా పారు వింటుంది. పారిజాతంను చూస్తుంది జ్యోత్స్న.

జ్యోత్స్న చెప్పిన ఛాన్స్ ఇదా అని అర్థం చేసుకుంటుంది పారు. జ్యోత్స్న దాసు కూతురా అని పారిజాతం అనుకుంటుంది. మా అమ్మ నీకు విషం కలిపి పెంచింది. ఇప్పుడు నువ్వు పాము లాంటిది. నిన్ను కన్నబిడ్డ అనిపించుకున్న కుటుంబాన్నే కాటు వేస్తున్నావ్ అని దాసు అంటాడు. నాకు ఇదంతా వద్దు నాన్నా. నేను ప్రశాంతంగా బతకాలని ఉందని జ్యోత్స్న అంటుంది.

నీ నుంచి ఈ మాటలు వస్తాయనుకోలేదు. ఈ మాట వింటే కల్యాణి ఎంత సంతోషించేదో అని దాసు అంటాడు. జ్యోత్స్నే దాసు కూతురు అని నమ్మిన పారిజాతం దీపను తన సొంత మనవరాలు అనుకుని మురిసిపోయింది తలుచుకుని చాలా ఫీల్ అవుతుంది. ఎంత పని చేశావురా దాసు అని మనసులో అనుకుంటుంది పారిజాతం.

ఎంత నమ్మక ద్రోహం చేశావురా

నిన్ను యువరాణిలా చూసుకుంటాను అని దాసు అంటాడు. నీ కూతురుని యువరాణిని చేశావ్. కానీ నీ తల్లికే నమ్మక ద్రోహం చేశావురా అని పారిజాతం అనుకుంటుంది. నువ్వు మారానన్నావే, అదే సంతోషం, నువ్వు ఈ ఇంటి కూతురు కాదని తెలిస్తే నిన్ను నేను చూసుకుంటాను అని దాసు చెప్పి వెళ్లిపోతాడు. గ్రానీ నీ కొడుకు వెళ్లిపోయాడు. ఇక నువ్వు రావచ్చు అని జ్యోత్స్న అంటుంది.

దాంతో చాలా ప్రేమగా పారిజాతం వస్తుంది. మోసపోయిన కళ్లు తెరిపిస్తానని చెప్పానుగా అని జ్యో అంటుంది. అలా దీప తన సొంత మనవరాలు కాదని పారిజాతంకు దాసుతోనే నిజం బయటపెట్టిస్తుంది జ్యోత్స్న. మనవరాలా అని పారు అంటే.. నన్ను ముట్టుకోకు. ఇన్నిరోజులు బావతో కలిసి ఆడుకున్నావుగా. అలాగే ఉండు అని కోపంతో వెళ్లిపోతుంది జ్యోత్స్న.

మరోవైపు దీప తల్లి గురించి ఆలోచిస్తుంది. దక్షిణామూర్తి గురించి కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. మనకు తెలియని కథ తెలుసుకోవాలని దీప అంటుంది. దీపకు కార్తీక్ అన్నం తినిపిస్తాడు. వాళ్లను చూసిన పారిజాతం ఇన్నిరోజులు భలే వెర్రిదాన్ని చేశార్రా అని పారిజాతం అనుకుంటుంది. జ్యో, పారులను కార్తీక్, దీప చూస్తారు.

పనోళ్లందరికి ప్రెసిడెంట్‌గా

ఏంటండి మా పనోళ్లకు స్వేచ్ఛ లేదా. నువ్వేం మాట్లాడవేంటీ పారు. అఖిల భారత పనోళ్లందరికి ప్రెసిడెంట్ అవ్వాల్సినదానివి. పనోళ్లందరికి ప్రెసిడెంట్‌లా నేను చేస్తాను, మన హక్కుల కోసం మనం పోరాటం చేద్దాం అని కార్తీక్ అంటాడు. పారిజాతం అయోమయంగా మాట్లాడుతుంది. పారుకు ఏదో పోయేకాలం వచ్చిందని కార్తీక్ అంటాడు. అది కూడా తింగరగా మాట్లాడుతుంది. నేను పోతా అంటూ వెళ్లిపోతుంది పారిజాతం.

పాపం తాత మాటలకు పారు ఇలా అయింటుందని కార్తీక్ అనుకుంటాడు. దీపకు నువ్వే తినిపించాలా అని జ్యో అంటే.. పెళ్లి పెటాకులు లేని దానివి నీకేం తెలుసు మొగుడు పెళ్లాల బంధం. తొందరగా పెళ్లి చేసుకుని పిల్లలు కంటే అన్నీ తెలుస్తాయని కార్తీక్ అంటాడు. అయితే, చేసుకో కంటాను అని జ్యో అంటుంది. ఏయ్, ఏం వాగుతున్నావ్ అని దీప అరుస్తుంది. పెళ్లి చేయి కంటాను అన్నాను అని అబద్ధం చెబుతుంది జ్యో.

నాకు మరోలా వినిపించిందని దీప అంటుంది. మీరు ఎక్కువ చేయకండి. అడ్డమైన వాళ్లను ఇంట్లోకి తీసుకురాకండి అని జ్యోత్స్న అంటుంది. ఆ మాట గొంతులోనే ఆపేయ్. కట్ చేసి కారం పెడతా. అతను నా కన్నతల్లి తండ్రి. అంటే నాకు తాత అని దీప అంటుంది. అమ్మ అంత సీరియస్ అయిందేంటేనే తెలుస్తుంది అతనెంత దుర్మార్గుడో అని జ్యోత్స్న అంటుంది. నీకంటే దుర్మార్గురాలు మన కుటుంబంలో ఎవరు ఉండరు. నీ పాపం పండక చిలకపలుకులు పలుకుతున్నావని దీప అంటుంది.

నిజాలు తెలుసుకోవచ్చు

నీ గురించి తెలిసిన రోజు శివ నారాయణ తాత నిన్ను ఎంతలా చీదరించుకుంటారో ఆలోచించుకో అని దీప అంటుంది. నువ్వు బతికి ఉండగా అది జరగదు అని జ్యోత్స్న అంటుంది. రోడ్డు ప్రమాదం అంటూ కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. మనుషులు తోలు బొమ్మలు కాదు. నువ్వు ఆడిస్తున్నట్లు ఆడేవాళ్లు ఎప్పుడైనా నిజం తెలుసుకోవచ్చు. ఈలోపు నీ ఆట నువ్వ ఆడు. నా ఆట నేను ఆడతాను. ఈ జ్యూస్ ఒకరికి అవసరం అని తీసుకెళ్లిపోతుంది జ్యోత్స్న.

తను అలాగే వాగుతుందని, దీపకు, దీప కడుపులో బిడ్డకు దిష్టి తీస్తాడు కార్తీక్. పారిజాతం తేడాగా బిహేవ్ చేసింది చూశావా అని కార్తీక్ అంటాడు. జరిగింది అంతా తలుచుకుని నెత్తిమీద చేయి పెట్టుకుని ఫీల్ అవుతుంది పారిజాతం. జ్యోత్స్న వస్తే క్షమించవే. నా కొడుకు నన్ను మోసం చేశాడని పారిజాతం అంటుంది. అందుకే నీ కొడుకుతోనే నీకు బుద్ధి వచ్చేలా చేశానని జ్యోత్స్న అంటుంది.

మనం మనం ఒక్కటేనే. నేనే అర్థం చేసుకోలేదు. తప్పుంతా నాదే చెంపలు వాయించుకున్న పారిజాతం ఈ పాపిని క్షమించు. నన్ను నీ గ్రానీలా గుర్తించు అని వేడుకుంటుంది. దాంతో జ్యూస్ ఇచ్చి తాగమంటుంది జ్యోత్స్న. పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు ఒక్కటైపోతారు.

బోన్ మ్యారో నువ్వెలా ఇచ్చావ్

జ్యోత్స్న కాళ్ల దగ్గర కూర్చుని.. మరి సుమిత్ర ఆపరేషన్ ఎలా జరిగిందే. నువ్వేలా బోన్ మ్యారో ఇచ్చావని పారిజాతం అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More