Karthika Deepam 2 Today Episode: కేక్‌లో విషం కలిపిన జ్యోత్స్న- కాశీ మాటలకు స్వప్న ఫిదా- దాసు మీద ఉమ్మేసిన జ్యోత్స్న!

Karthika Deepam 2 Serial April 4th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 4వ ఎపిసోడ్‌లో సుమిత్ర కేక్ కట్ చేస్తుంది. కేక్‌లో విషం కలిపినట్లుగా జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. కేక్ కట్ చేసిన సుమిత్ర జ్యోత్స్నకు తినిపించబోతుంటే దశరథ్ వద్దని దీపకు తినిపించమంటాడు. అది చూసి కార్తీక్ టెన్షన్ పడిపోతాడు.

Published on: Apr 4, 2026, 07:40:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో మమ్మీ కేక్ కట్ చేస్తుందని, దాన్ని నా చేతులతో స్పెషల్‌గా రెడీ చేసినట్లు జ్యోత్స్న చెబుతుంది. దాంట్లో విషం కలిపినట్లుగా జ్యోత్స్న గుర్తు చేసుకుంటుంది. నా కూతురు మాటలు తేడాగా ఉన్నాయని కార్తీక్‌తో దాసు అంటాడు. కార్తీక్ టెన్షన్ పడుతుంటాడు. నువ్ టెన్షన్ పడటం చూస్తుంటే చాలా బాగుందని జ్యోత్స్న అనుకుంటుంది.

కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 4 ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ ఏప్రిల్ 4 ఎపిసోడ్

దీపకు ముందు పెట్టు

సుమిత్ర కేక్ కట్ చేస్తుంది. అంతా చప్పట్లు కొడతారు. కేక్ మొదటి పీస్‌ను జ్యోత్స్నకు సుమిత్ర పెట్టబోతుంటే.. చాలా టెన్షన్ పడుతుంది. సుమిత్ర ముందు దీపకు పెట్టు అని దశరథ్ అంటాడు. దాంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. ఎక్సలెంట్ డాడీ నా మనసులో మాట చెప్పావని జ్యోత్స్న అంటుంది. వారిద్దరు నా కూతురు లాంటివారే. దీప నా పెద్ద కూతురు. ముందు దీపకే పెట్టని అని దశరథ్ అంటాడు.

ఈ కేక్‌లో నేను కలిపింది మాములు విషం కాదు బావ. తిన్న పది సెకన్లలోనే దీప చనిపోతుంది, నువ్వు నిజం చెప్పలేక టెన్షన్ పడుతుంటే చూసేందుకు భలే సరదాగా ఉందని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. అంతా దీపకే తినిపించని అనడంతో కార్తీక్ ఏం చేయలేకపోతాడు. దీపకు సుమిత్ర కేక్ తినిపిస్తుంది. నేను అనుకుంది అయిపోయింది బావ అని జ్యోత్స్న అంటుంది.

అల్లుడు ఆపుతాడనుకుంటే ఆగిపోయాడేంటీ అని దాసు కంగారుపడుతాడు. జ్యోత్స్న నెంబర్స్ కౌంట్ చేస్తుంది. అయినా దీపకు ఏం కాదు. దాంతో జ్యోత్స్న ఏమైందని కంగారుపడుతుంది. కార్తీక్ నవ్వుతూ జ్యోత్స్నను పక్కలు లాగి నాకు కూడా తినిపించు అంటాడు. తర్వాత జ్యోత్స్నకు కార్తీక్ కెక్ తినిపిస్తాడు. నువ్వు కేక్‌లో విషం కలపడం నేను చూశాను. అప్పుడే ఆపితే ఇంకోటి ప్లాన్ చేసేదానివి. అందుకే ఇక్కడ ఆపాను అని కార్తీక్ చెబుతాడు.

కేక్ మార్చేశానని చెప్పిన కార్తీక్

కేక్ మార్చేశాను. నువ్వు తెచ్చిన కేక్ చెత్త డబ్బాలో ఉంది. సేమ్ కేక్ తెప్పించి నీ ప్లాన్ తిప్పి కొట్టానని కార్తీక్ అంటాడు. మీరే మాట్లాడుకుంటారా మాకు చెప్పరా అని శివ నారాయణ అంటాడు. ఈ కేక్‌లో జ్యోత్స్న ఒకటి కలిపింది.. ఏం జ్యోత్స్న చెప్పనా అని కార్తీక్ ఆడుకుంటాడు. జ్యోత్స్న ఈ కేక్‌లో ఏం కలిపిందంటే మనమీద తనకున్న ప్రేమను కలిపింది అని కవర్ చేస్తాడు కార్తీక్. దాంతో అంతా నవ్వుతారు.

సుమిత్రకు దీప కేక్ తినిపిస్తుంది. తాను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని జ్యోత్స్న కోపంగా ఉంటుంది. నా ఫ్యామిలీ సేఫ్ చిన్న మరదలా అని కార్తీక్ అంటాడు. తర్వాత అంతా సెల్ఫీ తీసుకుంటారు. శ్రీధర్ వెళ్తామని చెబుతాడు. వాళ్లతో దీప, శౌర్యను పంపిస్తాడు కార్తీక్. మరోవైపు స్వప్నను, తనకు కాబోయే భర్త వసంత్‌ను కారులో తీసుకెళ్తాడు కాశీ. స్వప్న కట్టిన చీర చాలా బాగుందని అంటాడు వసంత్.

అది తన బర్త్ డేకి తాను ఇచ్చిన గిఫ్ట్ అని కాశీ చెబుతాడు. స్వప్నతో కలిసి ఉండటం ఎలా ఉంటుందని వసంత్ అడుగుతాడు. దాంతో తనలోని ప్రేమికుడు బయటకు వచ్చి చాలా కవిత్వంగా, ఎంతో అందంగా ఉంటుందని స్వప్న గురించి చాలా గొప్పగా చెబుతాడు కాశీ. దాంతో స్వప్న ఫిదా అవుతుంది. మరోవైపు జ్యోత్స్న, కార్తీక్ మాట్లాడుకుంటారు. కార్తీక్ డీఎన్‌ఏ రిపోర్ట్స్ గురించి కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

నన్ను చంపేశావ్ నాన్న

చాలా బాగా డ్రామా ఆడారు అని జ్యోత్స్న అంటే ఎవరిది డ్రామా అని జ్యోత్స్నపై కోప్పడుతాడు దాసు. అందరికి నిజం చెప్పేశావు కదా అంటుంది. మీ నాన్నకు నీ గురించి తెలియదని కార్తీక్ అంటాడు. మరి ఆస్తి అలా ఎందుకు రాస్తారు అని జ్యోత్స్న ప్నశ్నిస్తుంది. నీకు గడువు ఇచ్చాడుగా అని కార్తీక్ అంటాడు. కార్తీక్ చెప్పేది నిజమే అని దాసు అంటాడు.

నిన్ను తండ్రి అని చెప్పుకోవడం అసహ్యంగా ఉంది. నువ్వు నీచుడివి నాన్న. నాకు నిజం చెప్పను అని ఒట్టేసి చెప్పావ్. ఒట్టు దాటితే చంపినట్లే. అంటే నన్ను చంపేశావ్. కూతురుని చంపినవాడు నీచుడే కదా అని జ్యోత్స్న అంటుంది. మరి ప్రేమగా చూసుకున్న అత్తయ్యను చంపాలనుకోవడం నీచం కాదా అని కార్తీక్ అంటే.. నేనేం చంపాలనుకోలేదని జ్యోత్స్న అంటుంది. మరి నాకు చేసింది ఏంటమ్మా అని దాసు ప్రశ్నిస్తాడు.

ఆరోజు నాకున్న టెన్షన్‌లో అలా కర్రతో కొట్టాను. కానీ తర్వాత గిల్ట్‌గా ఫీల్ అయ్యాను అని జ్యోత్స్న అంటే.. అందుకేనా కేక్‌లో విషం కలిపావ్ అని కార్తీక్ అంటాడు. నేను దీపను చంపేందుకు కలిపాను అని జ్యో అంటే.. దీపను ఎందుకు చంపాలనుకుంటున్నావ్ అని కార్తీక్ అడిగితే.. దీపను పైనుంచి దిగి వచ్చినదానిలా చేయకు అని జ్యోత్స్న అంటుంది. దాసు కూడా అంటే.. నువ్వు ఒక చేతగాని తండ్రివి అని తిడుతుంది జ్యోత్స్న.

ఇంటికి మహరాణిలా ఉండేదాన్ని

ఈరోజు నేను పెళ్లి చేసుకోకుండా ఉంది దీప వల్ల కాదా. లేకుంటే బావను చేసుకుని ఇంటికి మహారాణిలా ఉండేదాన్ని అని జ్యోత్స్న అంటుంది. నా మాట వింటే ఇంటే ఇప్పుడు కూడా రాణిలా బతకొచ్చు అని దాసు అంటాడు. చాల్లే ఆపు పేదరికం నాన్నా. నేను నీ కూతురు అని తెలిసి ఓ జత బట్టలు అయినా కొన్నావా. నా స్థాయిలో బట్టలు కొనలేనివాడివి నా బతుకు బాగు చేస్తావా తూ.. అని దాసు మీదే ఉమ్మేస్తుంది జ్యోత్స్న.

దాసు అరిస్తే.. అరవకు నాన్న నేను ఊసింది నీ మీద కాదు. మన బతుకుల మీద. ఈ ఇంటి వారసురాలిగా ఉండాలన్నదే నా కోరిక. కాదు మా నానమ్మ కోరిక అని జ్యోత్స్న కోపంగా అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More