కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: బిడ్డ ప్రాణాలు తీయనున్న దీప.. కాంచనకు తెలిసిన నిజం.. దీపను నానామాటలు.. దశరథను ఆపిన కార్తీక్

Kathika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 5 ఎపిసోడ్ లో దీప బిడ్డను వద్దనుకుంటున్న విషయంపై కాంచన పెద్ద గొడవ చేస్తుంది. శివనారాయణ, శ్రీధర్, అనసూయ కూడా దీపను నానా మాటలు అంటారు. దశరథ నిజం చెప్పాలని చూస్తే కార్తీక్ అడ్డుకుంటాడు.

Published on: Mar 5, 2026, 06:50:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 5 ఎపిసోడ్ లో.. దీప కడుపుతో ఉంది కదా అని కొన్ని రోజులు సరదాగా అలా బయటకు వెళ్లి తిరిగొద్దామని అనుకున్నామని కాంచనతో కార్తీక్ చెప్తాడు. అబద్దం, నువ్వు నాతో అబద్దం చెప్తున్నావ్ రా అని కాంచన అంటుంది. లేదమ్మా ఇది నిజమే అని కార్తీక్ అంటాడు. అప్పుడే వచ్చిన శివనారాయణ మరి నువ్వు మాతో చెప్పిందేంటీ అని అడుగుతాడు.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

శివనారాయణ నిజం

నా భార్యను డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు. కొన్ని రోజులు ఇంట్లో నుంచి కదలకూడదు. నా భార్యకు సేవలు చేయడానికి నేను కూడా ఉండాలి కాబట్టి పనికి రావట్లేదని చెప్పాడని శివనారాయణ నిజం బయటపెడతాడు. దీంట్లో చెప్పడానికి ఏముంది? ఇంటి దగ్గరే ఉందామని లీవ్ తీసుకున్నాం. కానీ కడుపుతో ఉన్న మనిషిని తను ఆనందపడే ప్లేస్ లకు తీసుకెళ్తే మంచిదని ఫ్రెండ్ చెప్తే తీసుకెళ్తున్నా అని కార్తీక్ మరో అబద్దం చెప్తాడు.

కాంచన బాంబ్

నువ్వు దీపను హాస్పిటల్ కు తీసుకెళ్తున్నావని కాంచన బాంబ్ పేలుస్తుంది. నిజమా? కాదా? అని అడుగుతుంది. అవును నిజమే అని కార్తీక్ ఒప్పుకొంటాడు. నిజానికి ఇది వాడి భార్య తప్పు. అంతా నీకు నచ్చినట్లే చేయాలని అనుకుంటున్నావా? నీ కడుపులో నా కొడుకు బిడ్డను మోయడానికి నీకు ఇష్టం లేదు. మరో బిడ్డ పుడితే ఎక్కడ శౌర్యను సరిగ్గా చూడమని భయంతో ఈ బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటున్నావు. అందుకు నా కొడుకును ఒప్పించావని దీపపై కాంచన ఫైర్ అవుతుంది.

స్వార్థపరురాలివి

బిడ్డను మోయడం ఇష్టం లేకపోతే వద్దని చెప్పొచ్చు కదా. మేం ఏ ఆశలు పెట్టుకునేవాళ్లం కాదు. మేము పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. బిడ్డ క్షేమంగా ఉంటుందని మీ అత్తయ్యకు చెప్పమని దీపను అనసూయ అడుగుతుంది. నువ్వు స్వార్థపరురాలివి, అందరిని ఏడిపించే రకానివే. అనాథలా బతకాల్సిన నిన్ను చేరదీసిన కుటుంబం కోసం ప్రాణాలు ఇచ్చినా తక్కువే. అలాంటిది బిడ్డను ఇవ్వలేవా? అని దీపను అనసూయ నానామాటలు అంటుంది.

దీప ఎంతైనా పరాయి మనిషి కదా. పరాయి దానిలాగే ఆలోచిస్తుందని కాంచన అంటుంది. కాంచన.. దీపను ఇంకొక్క మాట కూడా అనడానికి వీల్లేదు. నిజం నేను చెప్తానని దశరథ అంటాడు.

మళ్లీ ప్రేమలో కాశీ

మరోవైపు మామయ్య ఎక్కడికి వెళ్లారు, కారు కూడా లేదని కావేరిని కాశీ అడుగుతాడు. ఏంటయ్యా డ్రైవర్ కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఈ కాఫీ తాగు. నిన్నటివరకు కాశీ నాకు భర్త. ఎక్కడ కలిసిపోతామోనని భయపడేదాన్ని. కానీ ఇప్పుడు విడిపోయాం కదా. డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టాం కదా అని స్వప్న అంటుంది.

పొందినప్పుడు కాదు పోగొట్టుకున్నప్పుడే దేని విలువైనా తెలుస్తుంది. చచ్చేవరకు ఎదురు చూస్తా. ఒక మనిషికి ఒకే అమ్మ, ఒకే నాన్న ఉన్నట్లు ఒక మనసుకు ఒకే ప్రేమ ఉంటుంది. ఒకే ప్రేయసి ఉంటుంది. నేను మళ్లీ ప్రేమలో పడ్డానని చెప్పి కాశీ బయటకు వెళ్లిపోతాడు.

జ్యోత్స్నకు చెప్పిన పారు

నాన్న, తాత కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్లారని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. ఈ ఇంట్లో నీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఆ సీక్రెట్ కాంచనకు చెప్పా. దీప, కార్తీక్, మీ నాన్న మాట్లాడుకుంటుంటే విన్నా. దీప కడుపులోని బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటుంది. దీని వెనుక ఏదో పెద్ద సీక్రెట్ ఉండాలి. దీనికి దశరథకు సంబంధం ఏంటీ? కార్తీక్ ఎందుకు ఊరుకుంటున్నాడు? అని పారిజాతం చెప్తుంది. ఏదైనా వెంటనే తెలుసుకోవాలని జ్యోత్స్న బయటకు వెళ్తుంది.

దీప గొప్పతనం గురించి ఈ రోజు మీ అందరికీ తెలియాలి. నిజం తెలిస్తే తప్పుపట్టిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు. దీప తన బిడ్డను తల్లి ప్రాణం కోసం అని దశరథ చెప్తుంటే కార్తీక్ అడ్డుపడతాడు. ఏ అర్హత ఉందని నా భార్య గురించి మాట్లాడుతున్నావ్? నా భార్య గురించి మాట్లాడే అర్హత నాకే ఉంటుందని కార్తీక్ అంటాడు. నువ్వు అర్హతల గురించి మాట్లాడితే నేను అధికారాల గురించి మాట్లాడతా. నీ తల్లిని కన్న తండ్రిగా నాకు ఆ అర్హత ఉంది. బిడ్డను ఎందుకు వదలుకుంటున్నారో చెప్పండని శివనారాయణ అడుగుతాడు.

దీప నచ్చదు

మేం బాధపడే పనులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికే మీ చెల్లి జీవితం గురించి బాధపడుతున్నాం. మరో భారం మా నెత్తిమీద వేయకండి. అమ్మ దీప నువ్వు నా కొడుకు జీవితంలోకి రావడం నాకు నచ్చేది కాదు. నువ్వు గర్భవతి అని తెలిశాక కాంచన ముఖంలో ఆనందం చూసి నిన్ను నా కోడలు అనుకున్నా. మీ అత్త నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావని శ్రీధర్ కూడా ఫీల్ అవుతాడు.

చెప్పు దీప, బిడ్డ క్షేమం కోసం నువ్వు, నీ భర్త నాకు మాట ఇచ్చారు. నీ భర్తను ఎలాగో నువ్వు మార్చేశావు కాబట్టి నువ్వే మాట్లాడాలని కాంచన అడుగుతుంది. దీప మాట్లాడదు అమ్మా. తల్లి ప్రాణాలు, బిడ్డ ప్రాణాలు ఎవరో ఒకరి ప్రాణాలు వదులుకోవాల్సి వస్తే నువ్వేం చేస్తావమ్మా? అని కాంచనను కార్తీక్ అడుగుతాడు. ఇక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More