కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: తప్పు సరిదిద్దుకోవాలన్న దశరథ- బిడ్డ ప్రాణంతో తల్లికి ఊపిరి- జ్యోత్స్నకు షాకిచ్చిన శివనారాయణ

Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 3 ఎపిసోడ్ లో అత్తను హాస్పిటల్ లో అడ్మిట్ చేసేందుకు ఒప్పుకోమని దశరథను దీప, కార్తీక్ అడుగుతారు. దీపకు రెస్ట్ కావాలని కార్తీక్ నెల రోజులు లీవ్ ఇవ్వమంటాడు. కానీ జ్యోత్స్న అందుకు ఒప్పుకోదు. జ్యోత్స్నకు తాత శివనారాయణ షాక్ ఇస్తాడు.

Published on: Mar 3, 2026, 06:57:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 3 ఎపిసోడ్ లో.. కూతురితో పాటు కూతురి బిడ్డ కూడా రాబోతుందని ఎంతో సంతోషపడ్డా. కూతురి విషయంలో చేసిన తప్పు మనవరాలి విషయంలో సరిదిద్దుకోవాలని అనుకున్నా. అది పుట్టినప్పటి నుంచి నా ఒడిలోనే పెరగాలని అనుకున్నా. నా కూతురు తొలి అడుగులు చూడలేదు. తొలి పిలుపును వినలేదు. ఈ ఆశలన్నీ పుట్టబోయే బిడ్డతో తీర్చుకోవాలని అనుకున్నానని దశరథ ఎమోషనల్ అవుతాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

దశరథ కన్నీళ్లు

దీప కడుపున అమ్మ పుట్టబోతుందని నా చెల్లి ఆనందపడుతుంది. ఎంతమంది ఆశలను, కలలను చంపేయాలి. ఎవరిని వదులుకోవాలి? మీ అత్త ప్రాణం నిలబెట్టే దేవత ఈ దేవతే అని నాకు అప్పుడు తెలియదు. కడుపున పుట్టిన దేవత. నేను తండ్రిగా ఏం ఇచ్చానని నీ నుంచి తీసుకోవడానికి అని కార్తీక్, దీపతో మాట్లాడుతూ దశరథ ఏడుస్తాడు. జన్మనిచ్చావు కదా నాన్న. తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ అవకాశం నా బిడ్డకు వచ్చిందని దీప చెప్తుంది.

నా బిడ్డ ప్రాణం

నా బిడ్డ నా కన్నతల్లిని కాపాడుతుందంటే అంతకుమించి ఆనందం ఏముంది? నా బిడ్డ నా తల్లి ప్రాణంలోకి వెళ్తుంది. సరే అనండి నాన్న, అమ్మను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేద్దామని దశరథను దీప అడుగుతుంది. అటు భార్యకు, ఇటు కూతురికి ధైర్యంగా మాట ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానని దశరథ అంటాడు.

జ్యోత్స్న ప్రశ్నలు

జీవితం అంటే ఇంతే మామయ్య. అత్త కావాలని కోరుకున్నాం. వేరే దారిలేక బిడ్డను వదులుకుంటాం. ప్రాణాలతో ఉన్న అత్తను చూసి బాధ నుంచి తేరుకుంటాం. ఈ సమస్యకు ఇంతకుమించిన పరిష్కారం లేదని కార్తీక్ అంటాడు. అప్పుడే ఏంటా సమస్య, ఏంటా పరిష్కారం అని అడుగుతూ జ్యోత్స్న వస్తుంది. శివనారాయణ, పారిజాతం కూడా వస్తారు.

కవర్ చేసిన కార్తీక్

శివనారాయణ కూడా ఏంటా సమస్య అని కార్తీక్ ను అడుగుతాడు. పారు కూడా పుల్ల వేస్తుంది. సమస్య పెద్ద మేడమే. అత్తకు ఆపరేషన్ అన్న ప్రతిసారి తమరు లగేజీ సర్దుకుని రెడీగా ఉంటున్నారు కదా. చిన్నసారు ఏమో అత్తను హాస్పిటల్లో జాయిన్ చేద్దామంటున్నారు. నువ్వు ఇల్లు వదిలి వెళ్లిపోతే సమస్య అవుతుంది. అందుకే ఇంటికి కాపాలగా ఉంటాననే పరిష్కారం చెప్పానని జ్యోత్స్నకు కార్తీక్ కౌంటర్ వేస్తాడు.

మా మమ్మీని సేవ్ చేయడం నా బాధ్యత. నాకు ఎవరూ కాపలాగా ఉండాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది. మరోవైపు కాశీపై దాసు ఫైర్ అవుతాడు. నువ్వు మనిషివే కదా, అన్నమే తింటున్నావు కదా అని కోప్పడతాడు. స్వప్న విడాకులు తప్పా మరో మాట మాట్లాడటం లేదు. అందుకే విడాకుల కాగితం మీద సంతకం పెట్టానని కాశీ చెప్తాడు.

విడాకులు ఇవ్వు

పెళ్లిలో చదివిన వేదమంత్రాలు కూడా పెట్టిన సంతకాల ముందు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. దీవెనలు కూడా విడాకుల కాగితాల మధ్య నలిగి చచ్చిపోతున్నాయి. ఇలా విడిపోవడానికేనా అందరిని ఎదురించి పెళ్లి చేసుకుంది. నాక్కూడా విడాకులు ఇవ్వు. మనం కూడా విడిపోదాం. విడాకులు అంటే ఒక పవిత్ర బంధాన్ని తెంచే కాగితాలు అని అర్థమని దాసు వివరిస్తాడు.

విడాకుల కాగితంపై సంతకం పెట్టాను కానీ స్వప్నను వదులుకోను. ఇదో ట్రిక్. ఇప్పుడు స్వప్న కాస్త రిలీఫ్ అవుతుంది. మళ్లీ ప్రేమించడం మొదలెడతా. మళ్లీ ప్రేమతో తనను గెలుస్తా. స్వప్నను మళ్లీ పెళ్లి చేసుకుంటాను నాన్న అని కాశీ చెప్పడంతో దాసు చాల హ్యాపీగా ఫీల్ అవుతాడు.

జ్యోత్స్న ప్లాన్

రేపటి నుంచి మేం పనికి రావడం లేదు సార్ అని శివనారాయణకు కార్తీక్ చెప్తాడు. హాస్పిటల్ వెళ్తే నెల రోజుల పాటు దీపను రెస్ట్ తీసుకోమన్నారని కార్తీక్ చెప్తాడు. మరి నువ్వెందుకు రావు బావ అని జ్యోత్స్న అడిగితే, భార్యకు సేవలు చేయడానికి ఉంటానని కార్తీక్ ఆన్సర్ ఇస్తాడు. ఇంటి దగ్గర కాంచన, అనసూయ ఉంటారు కదా. అగ్రిమెంట్ ప్రకారం నాకు ఇన్ఫామ్ చేయాలి. దీప ఎక్కడికి వెళ్లదు. దీపకు కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడే చేస్తా. సేవలు చేయడానికి పని మానాల్సిన అవసరం లేదని జ్యోత్స్న అంటుంది.

తాత కౌంటర్

శివనారాయణ ఓకే చెప్తాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఒప్పుకోదు. దీప, బావ ఇక్కడే ఉంటారు. పనివాళ్ల ఆరోగ్యం యజమానుల బాధ్యత. ఈ రోజు నుంచి నెల రోజుల వరకు దీప, బావ ఏ పని చేయకుండా ఈ ఇంట్లో ఉండొచ్చని జ్యోత్స్న అంటుంది. మేం ఇక్కడ ఉండలేం. మాకు నెల రోజులు లీవ్ కావాలని కార్తీక్ అడుగుతాడు. నీకు అగ్రిమెంట్ ప్రామాణికం అయితే ఫైన్ గా కట్టాల్సిన రూ.10 కోట్లు నేను కడతా. కార్తీక్ మీరు వెళ్లొచ్చు. ఎప్పుడంటే అప్పుడు రావొచ్చని శివనారాయణ చెప్తాడు.

పారుకు నిజం తెలుస్తుందా?

బయటకు వెళ్తున్న కార్తీక్, దీపను దశరథ ఆపి, లీవ్ ఎందుకు అడిగారని అడుగుతాడు. దీపను హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని కార్తీక్ చెప్తాడు. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే పెరిగా. అత్త లేకపోతే సందడే లేదు. నీ పుట్టింటిని గిఫ్ట్ గా ఇస్తానని భార్యకు మాటిచ్చా. కానీ తను మాత్రం తల్లిప్రాణాలు కోరుకుంది. ఈ నేచర్ మా బిడ్డను తీసుకుని, మా అత్తను ఇస్తుందని కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.

దీప కడుపులో బిడ్డను వదులుకోవడం అంటే మనసు ఒప్పుకోవడం లేదని దశరథ అంటాడు. ఈ మాటలను పారిజాతం వింటుంది. దీపకు బిడ్డను వదులుకోవడం తప్ప వేరే దారి లేదు మామయ్య అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More