కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: స్వప్న కాశీకి విడాకులు ఇవ్వమన్న కాంచన- దాసు షాక్-దీపకు ఇక పిల్లలు పుట్టరని తెలుసుకున్న దశరథ
Karthika Deepam 2 Serial February 28th Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఫిబ్రవరి 28వ ఎపిసోడ్‌లో దశరథతో మాట్లాడుతుంటే కార్తీక్‌కు డాక్టర్ హారిక కాల్ చేసి దీపతో రమ్మంటుంది. కార్తీక్, దీప వెళ్తారు. దీపకు మళ్లీ పిల్లలు పుట్టరని, ఇప్పుడు నిర్ణయం చెప్పమని హారిక అంటుంది. అది విన్న దశరథ్ నిజం తెలుసుకుంటాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చెడ్డ వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని దశరథ్‌కు చెబుతాడు కార్తీక్. ఏం చెప్పినా సరే నా వల్ల కావట్లేదురా. కడుపులో ఉన్న బిడ్డను చంపాలనుకుంటున్నార్రా వాళ్లు. వాళ్ల మొహం చూస్తుంటే కోపం ఆగట్లేదు అని దశరథ్ అంటాడు.

కార్తీక్‌కు డాక్టర్ కాల్
ఇప్పుడు ఎంత ఓపికగా ఉంటే భవిష్యత్ అంత బాగుంటుందని కార్తీక్ అంటాడు. ఇంతలో డాక్టర్ హారిక కాల్ చేసి దీపను తీసుకుని హాస్పిటల్‌కు రమ్మని చెబుతుంది. అదే విషయం చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. మరోవైపు స్వప్న, కాశీల సమస్యకు ముగింపు ఇస్తానని, అది నువ్వే చెప్పాలని, ఇద్దరిని కలపడం నా వల్ల కావడం లేదని కాంచనతో అంటాడు శ్రీధర్.
స్వప్న విడాకులు కావాలంటుంది కదా. అయితే మంచి లాయర్‌ను చూసి విడాకులు ఇప్పించండి, కాశీకి కూడా ఇప్పించండి. ఇద్దరికి వేరే వాళ్లతో మళ్లీ పెళ్లి చేయించండి అని కాంచన అంటుంది. శ్రీధర్ కోప్పడుతాడు. నేను అంత ఆలోచించే చెప్పాను. ఈ సమస్యకు ఇది తప్ప పరిష్కారం లేదు అని కాంచన అంటుంది. దాంతో దాసును పిలిపించిన శ్రీధర్.. స్వప్న, కాశీ విడిపోవాలనుకుంటున్నారు, విడాకులు అడుగుతున్నారని చెబుతాడు.
అందుకే మంచి లాయర్‌ను చూశాను అని శ్రీధర్ చెబుతాడు. దాసు కోప్పడతాడు. శ్రీధర్ వెటకారంగా మాట్లాడుతాడు. రోజు మా ఇంట్లో జరిగే తంతు ఇదేనంటాడు. ఇక్కడ విడాకులు అనే పంచాయితీ జరిగిపోయింది. సంతకం పెట్టేముందు నీకు చెప్పాలని పిలిపించా అని శ్రీధర్ అంటాడు. నా కొడుక్కి నేని చెప్పుకుంటా మీ కూతురుకు నచ్చ జెప్పలేవ అని దాసు అంటాడు.
నువ్వే ట్రై చేయు
సరే నేను ఇక్కడే ఉంటాము. నువ్వే ట్రై చేయు. ఏం చెప్పి ఒప్పిస్తావో ఒప్పించు అని శ్రీధర్ అంటాడు. మరోవైపు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌కి కావాల్సిన ప్రొసీజర్ గురించి పిలిపించాను. దాని వల్ల పుట్టబోయే బిడ్డకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఏమైనా జరగొచ్చు. మీరు రెడీగా ఉన్నారా అని డాక్టర్ అడుగుతుంది. ఉన్నామని దీప, కార్తీక్ చెబుతారు.
అయితే, మీకు మరో విషయం చెబుతాను. ఈ బిడ్డను మీరు వద్దనుకుంటే మళ్లీ దీపకు లైఫ్‌లో పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇక పిల్లలు వద్దనుకుంటే ఆలోచించి చెప్పండి. ఐదు నిమిషాల్లో వస్తాను అని డాక్టర్ వెళ్లిపోతుంది. పిల్లల గురించి అనుకుంటే శౌర్య ఉందని నేను అనుకోవచ్చు. కానీ, మా అమ్మ ఏమనుకోవాలి అని కార్తీక్ అంటాడు.
ఏం జరిగినా సరే బావ. నిర్ణయం నాదే కాబట్టి నింద మొత్తం నాదే. ఇవన్నీ మా అమ్మ కంటే ఎక్కువ కాదు అని దీప అంటుంది. డాక్టర్ వచ్చి ఏం నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది. మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. మీరు ముందుకు వెళ్లండి అని కార్తీక్ అంటుంది. సుమిత్రను దీప కాపాడే సమయంలో పుట్టబోయే బిడ్డనే కాదు. జీవితాంతం తల్లి అయే అవకాశాన్ని కోల్పోతుంది అని డాక్టర్ హారిక అంటుంది.
నా కూతురు బిడ్డను కోల్పోతుందా
ఇంతలో దశరథ్ వచ్చి ఏంటీ డాక్టర్ మీరు అనేది అని అడుగుతాడు. నా భార్యను కాపాడటానికి నా కూతురు బిడ్డను కోల్పోతుందా అని అడుగుతాడు. అవును, మీరు విన్నది నిజమేనని హారిక అంటుంది. మరోవైపు స్వప్న, కాశీ విడాకుల పంచాయితీ నడుస్తుంది. కాశీని దాసు అడిగితే.. స్వప్న ఆగిపోతే నేను ఆగిపోతాను అని అంటాడు.
నేను మాత్రం ఆగను అని స్వప్న అంటుంది. భర్త కాబట్టి మార్చుకోవాలనుకుంటున్నావ్. తండ్రిని, పిల్లలను అలాగే వదిలేస్తావా అని దాసు అంటాడు. పిల్లలో లోపం ఉంటే అది మనం చేసిన తప్పు అనుకోవచ్చు. ఇలాంటి వాడితో బతకలేం అంటూ కాశీ చేసినవన్నీ చెబుతుంది స్వప్న. కాశీ, స్వప్న వాదించుకుంటారు. నీకు, నీజాయితీకి ఓ దండం అని స్వప్న అంటుంది.
నాకు నెలకు లక్ష సంపాదించేవాడు చాలు ఐదు లక్షలు ఇచ్చేవాడు అవసరం లేదు అని కాశీ అన్న మాటలను గుర్తు చేస్తుంది స్వప్న. దాసు చేతులెత్తి స్వప్నకు మొక్కుతాడు. అంతా ఆపుతారు. నేను కాశీని వద్దనుకుంటున్నా బంధాలను కాదు. కాశీ లేకున్నా మీరు నాకు మావయ్యే అని స్వప్న అంటుంది. ఈ బంధాలను ఇలాగే ఉండాలని స్వప్న చేయి కాశీతో కలపాలని దాసు చూస్తాడు.
విడాకులు ఎక్కడ
స్వప్న చేయి తీసేసుకుని సారీ మావయ్య. నేను విడాకులు తీసుకోవాలనుకున్నాను. తీసుకుంటాను. విడాకులు ఎక్కడో చెప్పండి సంతకం చేస్తానని స్వప్న అంటుంది. మరోవైపు నిజం చెబితే కానీ నాకు ఏది తెలియట్లేదు. అబద్ధాలతో బతుకున్నా. నీ తండ్రిది అబద్ధాల జీవితం అయిపోయిందని దశరథ్ ఆవేదనగా అంటాడు.
డాక్టర్ గారు నిజం చెప్పండి. ఒక్క అక్షరం అబద్థం చెప్పిన మీ డాక్టర్ వృత్తి మీద ఒట్టే అని దశరథ్ అంటాడు. దాంతో దీప బిడ్డను వదులుకోవడం గురించి చెబుతుంది డాక్టర్. బిడ్డను కాపాడాలంటే దీప డోనర్‌గా ఉండకూడదు. అలా చేస్తే సుమిత్ర బతకదు అని డాక్టర్ అంటుంది. నీ బిడ్డను వదులుకోడానికి నేను ఒప్పుకోవట్లేదు అని దశరథ్ అంటాడు.
ఏదో ఒక ప్రాణం వదులుకోక తప్పదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తుంటాను అని డాక్టర్ వెళ్లిపోతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


