కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:డ్రైవర్‌గా కాశీ-ఇంట్లో నుంచి వెళ్లిపోయిన స్వప్న-వారసురాలు జ్యోత్స్ననే అంటూ పారిజాతం టెన్షన్
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 11 ఎపిసోడ్ లో ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయి. కారు డ్రైవర్ గా కాశీని శ్రీధర్ పెట్టుకుంటాడు. దీంతో స్పప్న ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అసలైన వారసురాలు జ్యోత్స్ననే అని పారిజాతం కంగారు పడుతుంది. జ్యోకు కూడా ఇదే డౌట్ వస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 11 ఎపిసోడ్ లో.. శ్రీధర్, కావేరి, స్వప్న గుడికి వెళ్లేందుకు రెడీ అవుతారు. కారుకు డ్రైవర్ ను పెట్టుకున్నా. ఇంటి పనుల్లోనూ సాయం చేస్తాడని కూడా శ్రీధర్ చెప్తాడు. డ్రైవర్ గా కాశీ ఎంట్రీ ఇస్తాడు. అల్లుడు డ్రైవర్ ఏంటి అని కావేరి అడుగుతుంది. డ్రైవర్ గా పెట్టుకున్న వ్యక్తే అల్లుడు అయ్యాడని శ్రీధర్ చెప్తాడు.

డ్రైవర్ గా కాశీ
నాకు అంతా అర్థమవుతుంది నాన్న అని స్వప్న కారు దిగుతుంది. ఇంట్లో ఇంత గొడవ జరిగినా మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని అనుకున్నా. కానీ దీని వెనుక ఇంత డ్రామా ఉందని అనుకోలేదు. మీరు కాశీని తీసుకొచ్చింది డ్రైవర్ గా కాదు. కూతురితో కలపడానికి అని శ్రీధర్ ను స్వప్న అడుగుతుంది. ఈ రోజు నుంచి కాశీ మన డ్రైవర్. మనతోనే ఉంటాడు, మనతోనే తింటాడు. మన పనులన్నీ చేస్తాడు. నెలకు రూ.25 వేల జీతం అని శ్రీధర్ చెప్తాడు.
మీరు చెప్పిన మాటలన్నీ నిజమైతే నేను ఈ ఇంట్లో ఉండే ఆఖరి రోజు ఇదే అవుతుంది. నేను ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్లిపోతా. గుడ్ బై అని స్వప్న వెళ్లిపోతుంది.
బిడ్డను వదులుకుంటారా?
మరోవైపు నిజం చెప్పనందుకు డాక్టర్ కు కార్తీక్ థ్యాంక్స్ చెప్తాడు. నేను నిజం చెప్పలేను. ఎందుకంటే మీ అత్త బతకదు. ఆవేశంలో బిడ్డను వదులుకుంటానని అన్నారు. ఇప్పుడు అదే మాట చెప్పగలరా అని డాక్టర్ మళ్లీ అడుగుతుంది. ఏం వదులుకుంటున్నామో మాకు అర్థమవుతుంది డాక్టర్ అని దీప అంటుంది. ఈ పరిస్థితుల్లో మీ అమ్మ ఉంటే చావుకు వదిలేస్తారా అని డాక్టర్ ను దీప అడుగుతుంది.
ఇలాంటి కథ ఎక్కడా వినలేదు
నా తల్లిని కాపాడుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దీని కోసం నా ప్రాణాన్నైనా వదులుకుంటానని దీప చెప్తుంది. మీ అమ్మ ఎంత లక్కీ దీప. తాను కూతుర్ని కాదు అమ్మను కన్నది. నువ్వు నీ బిడ్డ ప్రాణం పోసి తనకు జన్మనిస్తున్నావు. ఇది తల్లి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తల్లి స్థానాన్ని వదులుకుంటున్న కథ. నీలాంటి కథ నేనెక్కడా వినలేదు దీప. అమ్మానాన్న నీకోసం ఏం చేశారు దీప అని డాక్టర్ అడుగుతుంది.
ప్రేమను పంచడం
జన్మనిచ్చారు డాక్టర్. అమ్మ ఇచ్చిన జన్మ కంటే విలువైంది ఇంకా ఏదైనా ఉంటుందా? అనారోగ్యం లేని శరీరానికి మించిన ఆస్తి ఉంటుందా? నేను వాళ్ల దగ్గర పెరగకపోవడం విధి రాత. నా ప్రేమను వాళ్లకు పంచొచ్చు కదా. ఈ జన్మకు ఈ ఆనందం చాలు అని డాక్టర్ తో దీప అంటుంది. నా వంతు సాయం చేస్తానని డాక్టర్ వెళ్లిపోతుంది.
నువ్వే వారసురాలివి
సైదులు ఎంత మోసం చేశాడు? బిడ్డలను మార్చమంటే నా మనవరాలిని నా చేతుల్లోని పెట్టి దూరం చేసుకునేలా చేశాడు. డాక్టర్ తేల్చి చెప్పేశారు కదా శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని, అంటే నువ్వు సుమిత్ర కూతురివే కదా. నాకు క్లారిటీ వచ్చింది. నువ్వు సుమిత్ర, దశరథల అసలైన కూతురివి. నేను దూరం చేసింది నా కొడుకు దాసు కూతురిని అని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది.
ఈ నిజం
గ్రానీ,ఇదంతా నువ్వు నమ్ముతున్నావా? అని జ్యో అడుగుతుంది. వద్దమ్మా నన్ను ఇంకా అలా పిలవకు. ముందు ఈ నిజాన్ని నేను జీర్ణించుకోని. నువ్వు నా మనవరాలు అనుకుని నిన్ను కాపాడేందుకు గన్ వేసుకుని బయల్దేరా. అసలు ట్విస్ట్ రివీల్ అయితే కానీ నాకు అర్థం కాలేదు. నువ్వు శివనారాయణ ఏకైక వారసురాలివి. నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు అని పారిజాతం అంటుంది.
జ్యోకు డౌట్
నేను నిజంగానే సుమిత్ర కూతురినా? బావకు నిజం తెలిసి వెనకాల ఉండి నాటకం ఆడించడం లేదు కదా? నేను ఎవరి కూతురిని? అని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు కిచెన్ లో కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. నా బుర్రలో చాలా తిరుగుతున్నాయి. బిడ్డలను మార్చింది పారిజాతం. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పగానే జ్యోత్స్న తన అసలు మనవరాలు కాదని పారు అనుకుంటుంది. ఇక పెద్ద మేడం జ్యోత్స్న ఏమో డాక్టర్ తో మనమే అబద్దమని చెప్పించమని అనుకోవచ్చని కార్తీక్ చెప్తాడు.
నా కూతురు ఉంది
దశరథ మామయ్యకు మొదటి నుంచి జ్యోత్స్నపై అనుమానం ఉంది. నా అంచనా కరెక్ట్ అయితే మామయ్య నమ్మడు అని కార్తీక్ అంటాడు. కడుపులో బిడ్డకు, మనకు రుణం లేదు బావ అని కార్తీక్ తో దీప చెప్తుంది. అప్పుడే దీప స్వీట్స్ తీసుకురా అని సుమిత్ర పిలుస్తుంది. దీపకు స్వీట్ తినిపిస్తుంది సుమిత్ర. నా సంతోషాన్ని ఇంతకంటే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నన్ను కాపాడటానికి నా కూతురు ఉందని సుమిత్ర అంటుంది.
నా కోడలికి ఏం కాదనే వార్త వినగానే 9 శుక్రవారాల పూజ చేస్తానని మొక్కుకున్నా. ఇప్పుడు ఏమో ఎప్పటి నుంచి మొదలుపెడదామా? అని ఆలోచిస్తున్నా అని పారిజాతం అంటుంది. శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని నీకెలా తెలుసు? అని పారును కార్తీక్ అడగడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


