కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్:అంతులేని బాధలో కార్తీక్, దీప-జ్యోత్స్న‌కు డౌట్‌-రెండోసారి శాంపిల్స్-విడాకులు కావాలన్న స్వప్న

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 3 ఎపిసోడ్ లో శాంపిల్స్ ఇవ్వడానికి జ్యోత్స్నను తీసుకుని దశరథ, శివనారాయణ హాస్పిటల్ కు వస్తారు. అక్కడ కార్తీక్, దీపను చూస్తారు. వీళ్లపై జ్యోకు అనుమానం వస్తుంది. మరోవైపు కాశీతో విడాకులు కావాల్సిందేనని స్వప్న స్పష్టంగా చెప్పేస్తుంది. 

Published on: Feb 03, 2026 7:13 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఫిబ్రవరి 3 ఎపిసోడ్ లో హాస్పిటల్ కు వచ్చిన దశరథ, శివ నారాయణ, జ్యోత్స్న అక్కడ కార్తీక్, దీపను చూస్తారు. వీళ్లు టెస్టులకు వచ్చారని నాకు తెలియదు జ్యోత్స్న. నీతో రెండోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించాలని తీసుకొచ్చింది నేను. దీనికి కార్తీక్ కు ఏ సంబంధం లేదని దశరథ చెప్తాడు.

కార్తీక దీపం 2 టుడే సీరియల్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే సీరియల్ (jiohotstar)

కార్తీక్ అబద్దం

దీపను డాక్టర్ కు చూపిద్దామని తీసుకొచ్చానని కార్తీక్ అబద్దం చెప్తాడు. అప్పుడు మీరు గైనకాలిజిస్ట్ దగ్గర ఉండాలి కానీ డాక్టర్ హారిక రూమ్ నుంచి ఎందుకు వస్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. సుమిత్రమ్మ గురించి అడుగుదామని వచ్చామని దీప చెప్తుంది. సాయం చేయగలిగే స్థితిలో ఉండి, సాయం చేయలేని పరిస్థితిలో ఉంటే అంతకుమించిన బాధ ఉండదని కార్తీక్ ఫీల్ అవుతాడు.

టేబుల్ మీద రిపోర్ట్స్

ఈ సారి అలా జరగదు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు పక్కనే ఉంటానని శివనారాయణ అంటాడు. ఎలా తప్పించుకోవాలోనని జ్యోత్స్న ఆలోచిస్తుంది. దశరథ, శివనారాయణ, జ్యోత్స్న డాక్టర్ రూమ్ లోకి వెళ్తారు. రిపోర్ట్స్ టేబుల్ మీదే ఉన్నాయని కార్తీక్ తో దీప చెప్తుంది. జ్యోత్స్న చూస్తుంటే డాక్టర్ ఆ రిపోర్ట్స్ తీసి దాస్తుంది. మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని డాక్టర్ అడుగుతుంది. జ్యోత్స్న శాంపిల్స్ తీసుకుని టెస్టు చేయమని దశరథ అడుగుతాడు.

వాస్తవాలను మార్చలేం

మీ తరపు నుంచి పెద్ద తప్పు జరిగింది. జ్యోత్స్న మీ మనవరాలు కాదని డాక్టర్ అనుకుంటుంది. ఈ సారి కూడా శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోతే ఎలా అని డాక్టర్ అడుగుతుంది. కొన్ని నమ్మకాల మీద కాదు దశరథ గారు వాస్తవాల మీద ఆధారపడి ఉంటాయి. వాస్తవాన్ని మనం మార్చలేం కదా అని డాక్టర్ అంటుంది. ఈవిడ ఏంటీ నేను వారసురాలు కాదన్నట్లు మాట్లాడుతుందని జ్యో అనుకుంటుంది. రెస్టారెంట్ నుంచి కాల్ రావడంతో కోపరేట్ చేయమని జ్యోత్స్నకు చెప్పి దశరథ వెళ్లిపోతాడు.

చూశావా జ్యోత్స్న మీ నాన్నకు నీపై ఎంత ప్రేమ ఉందోనని డాక్టర్ అంటుంది. శివనారాయణ పక్కనే ఉండి శాంపిల్స్ కలెక్ట్ చేయిస్తాడు. దీప, బావ హాస్పిటల్ కు ఎందుకు వచ్చారో ఎలా తెలుసుకోవాలి అని జ్యోత్స్న ఆలోచిస్తుంది.

స్వప్న ఫైర్

శ్రీధర్ ఇంటికి కాంచన వస్తుంది. అన్నయ్య, వదిన వచ్చారా అని స్వప్న అడిగితే, అంతకంటే ముఖ్యమైన వాళ్లే వచ్చారని కాశీని లోపలికి పిలుస్తుంది కాంచన. కాశీ కాలు లోపలికి పెట్టబోతే అక్కడే ఆగు, నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు. ఈ మనిషి వల్ల మనం ఎంత బాధపడ్డామో నేను ఇంకా మర్చిపోలేను. ఇలాంటి పొగరుబోతులకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒక మనిషి తాగుబోతు అయినా భరించొచ్చు కానీ మోసగాడు అయితే భరించలేనని స్వప్న ఫైర్ అవుతుంది.

మామయ్య నన్ను క్షమించారు కదా అని కాశీ అడుగుతాడు. మా డాడీ మోసం చేసింది మా పెద్దమ్మను. కానీ మా పెద్దమ్మ మా నాన్నను దూరం పెట్టలేదు. ఇంటికి రావొద్దు అనలేదు. మా నాన్నకు మొదట్లో అమ్మ మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఏం మారలేదని స్వప్న అంటుంది. దానికి బదులుగా కాశీ కూడా అరుస్తాడు. ఆపండ్రా ఇద్దరు కొట్టుకునేలా ఉన్నారని కాంచన అరుస్తుంది.

విడాకులు ఇస్తా

గతాన్ని మనం మార్చలేకపోవచ్చు కానీ వర్తమానంలో మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో మన జీవితాన్ని మారుస్తాయి. తీసుకునే నిర్ణయాలు సరైనవి కానప్పుడు మనవాళ్లే వాటిని సరిచేయాలని కాంచన అంటుంది. నేను సరైన నిర్ణయమే తీసుకున్నా పెద్దమ్మ అని స్వప్న అంటే, ఆపేందుకు శ్రీధర్, కావేరి ప్రయత్నిస్తారు. నన్ను మాట్లాడనివ్వండి నాన్న. నా మాట వినరా? నేను కాశీతో కాపురం చేయలేను. నేను కాశీతో కలిసి ఉండలేను. నేను కాశీకి విడాకులు ఇస్తాను. ఇదే నా ఆఖరి మాట. మీ పెద్దలందరికీ దండం పెట్టి మరీ చెప్తున్నా నాకు, కాశీకి విడాకులు ఇప్పించండని స్వప్న వెళ్లిపోతుంది.

కార్తీక్, దీప బాధ

బోన్ మ్యారో డొనేట్ చేస్తే కడుపులో బిడ్డ బతకదని డాక్టర్ చెప్పిన మాటలను తలుచుకుని కార్తీక్, దీప బాధపడతారు. వాళ్ల దగ్గరకు దశరథ వస్తాడు. ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఎందుకు ఉన్నారని అడుగుతాడు. ప్లేస్ బాగుందని ఆగామని కార్తీక్ చెప్తాడు. దీపకు ఏమైంది? హాస్పిటల్లో ఏదో జరిగిందని మీ ముఖాలు చూసినప్పుడే అర్థమైంది. డాక్టర్ మీతో ఏమైనా చెప్పారా? అని దశరథ అడుగుతాడు.

జాగ్రత్తగా చూసుకోమని చెప్పారని కార్తీక్ చెప్తాడు. దీపకు అమ్మానాన్న ఉంటే పుట్టింటికి తీసుకెళ్లి దేవతలా చూసుకునేవాళ్లు. దీపకు ఆ అవకాశం లేదు. పోనీ మన ఇంటి దగ్గర అలా చూసుకుందామంటే అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకోవాలా? లేదా కూతురు లాంటి దీపను చూసుకోవాలా? మీ వల్ల నాలో ధైర్యం ఉంది? కానీ మీ ముఖాల్లో భయం కనిపిస్తోంది. అది నేనే తెలుసుకుంటానని దశరథ అంటాడు.

బిడ్డకు ప్రాబ్లం ఏం లేదు కదా అని దీపను అడుగుతాడు దశరథ. ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ కడుపులో బిడ్డకు మాత్రం ఏం కాకూడదు. నువ్వు నా చెల్లి సంతోషాన్ని కడుపులో మోస్తున్నావు. దీప నా కూతురు లాంటిది కాబట్టి పుట్టబోయే బిడ్డకు తాతగా నాకు హక్కు ఉంటుంది. మేమంతా బిడ్డతో ఆడుకుంటామని దశరథ చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.