కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యో నిజం చెప్పకుండా దాసును అడ్డుకున్న కార్తీక్-కాశీకి బెయిల్-విడాకులు కావాలని స్వప్న ఫైర్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 13 ఎపిసోడ్ లో ఉత్కంఠ ఉపేసింది. జ్యోత్స్న అసలైన వారసురాలు కాదని దాసు చెప్పాలనుకుంటాడు. కానీ కార్తీక్ అడ్డుకుంటాడు. మరోవైపు కాశీకి బెయిలిచ్చి తీసుకొస్తాడు శ్రీధర్. కానీ కాశీపై ఫైర్ అయిన స్వప్న విడాకులు తీసుకుంటానంటుంది.

Published on: Jan 13, 2026, 07:02:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జనవరి 13 ఎపిసోడ్ లో నేను నీకు ఒక ద్రోహం చేశానన్నయ్య. జ్యోత్స్న గురించి చెప్పాలనుకుంటున్నానని దాసు అంటాడు. జ్యోత్స్న గురించి చెప్పకుండా కార్తీక్, దశరథ అడ్డుకుంటారు. దాసు తను అనుకున్నది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు పక్కకు తీసుకెళ్లి మాట్లాడతానని దశరథ అంటాడు.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

అడ్డుకున్న కార్తీక్

చెప్పాల్సింది చెప్తానని దాసు అంటాడు. కాశీ, జ్యోత్స్న నా.. అని దాసు అంటుండగా కార్తీక్ అడ్డుకుంటాడు. కాశీని విడిపించడానికి జ్యోత్స్న సాయం అడిగానని అంటావ్. ఈ మాత్రం దానికి ఎందుకు మామయ్య ఇబ్బంది పడటం? బెయిల్ ఇప్పించమని డైరెక్ట్ గా అడగొచ్చు కదా అని కార్తీక్ డైవర్ట్ చేస్తాడు. దీని గురించే అడగాలని అనుకున్నానని దాసు అంటాడు.

అమ్మ అడిగిందని

కాశీ బెయిల్ సంగతి చూస్తానని శివ నారాయణ చెప్తాడు. దాసు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బయట దాసును ఆపి కార్తీక్ మాట్లాడతాడు. సడెన్ గా వచ్చావు. ఒక ఫోన్ చేయాలి కదా. నిజం ఎవరికి చెప్పొద్దన్నానో అదే నిజం డైరెక్ట్ గా పెద్దాయనకు చెప్తున్నావు. అంత ఆవేశం దేనికి మామయ్య? అని కార్తీక్ అడుగుతాడు. దీప ఎవరో తెలియాలని కోరుకుంది నేను కాదు అల్లుడు, మా అమ్మ. సుమిత్ర వదినను బతికించాలంటే అసలైన వారసురాలు ఉండాలి కదా. అసలైన కూతురిని వెతికి తీసుకురమ్మని అడిగిందని దాసు చెప్తాడు.

సుమిత్ర బతకాలంటే

శివ నారాయణ మనవరాలు దీప అని నీకు తెలుసు, నాకు తెలుసు, దీపకు తెలుసు, జ్యోత్స్నకు తెలుసు. కానీ మా అమ్మకు తెలియదు కదా. జ్యోత్స్న మా అమ్మకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందని దాసు చెప్తాడు. కార్తీక్, దాసు మాట్లాడటం బాల్కనీలో నుంచి జ్యో చూస్తుంది. సుమిత్ర బతకాలంటే నిజం చెప్పడం తప్పా వేరే మార్గం లేదని దాసు అంటాడు. ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. అత్తకు బ్లడ్ క్యాన్సర్ ఉందనే విషయం కూడా తెలియదని కార్తీక్ అంటాడు.

ఎప్పుడేం చేయాలో నీకు తెలుసు. తొందరపడ్డా సారీ అల్లుడు. మా అమ్మకు ఏదో ఒక అబద్దం చెప్తానని దాసు అని వెళ్లిపోతాడు. బావ ప్రవర్తన చూస్తుంటే అనుమానంగానే ఉందని జ్యో అనుకుంటుంది.

స్వప్న ఫైర్

మరోవైపు నాన్న కోసం స్వప్న వెయిట్ చేస్తుంటుంది. కాశీని తీసుకుని శ్రీధర్ వస్తాడు. అది చూసి స్వప్న కోపంతో రగిలిపోతుంది. ఇంట్లోకి అడుగుపెట్టనివ్వకుండా అక్కడే ఆగమని అరుస్తుంది. ఈ మనిషిని అసలు బయటకు ఎందుకు తీసుకువచ్చావ్ నాన్న? నీకు మాట్లాడే రైట్ లేదు కాశీ అని కోప్పడుతుంది స్వప్న. నువ్వు మంచోడివి కాబట్టే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు నాన్న. నువ్వు తప్పు చేశావని సాక్ష్యం చెప్పాడు. కాశీ చెప్పింది నిజమే. ఇతణ్ని ఇంట్లో పెట్టుకోవడమే నువ్వు చేసిన తప్పు నాన్న అని స్వప్న అంటుంది.

విడాకులు కావాలని

నీ బాధకు అర్థం ఉందమ్మా అని దాసు అంటాడు. కాశీ చేసింది తప్పు కాదు మోసం, ద్రోహం. ఇలాంటి వాళ్లకు శిక్ష ఒకటే. విడాకులు తీసుకోవడం అని బాంబ్ పేలుస్తుంది స్వప్న. ఈ మోసగాడితో నేను కలిసి బతకలేను. జ్యోత్స్నతో చేతులు కలిపావని స్వప్న అంటుంది. జ్యోత్స్నతో చేతులు కలపడం ఏంటమ్మా అని దాసు అడుగుతాడు. స్వప్న అనవసరమైన విషయాలు మాట్లాడకు. కాశీకి కోర్టు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చా. అతను నిర్దోషిగా నిరూపించుకుంటాడా? లేదా జైలుకు పోతాడా? అన్నది తన ఇష్టమని శ్రీధర్ అంటాడు.

వెళ్లిపోయిన కాశీ

కాశీ ఈ ఇంట్లో ఉంటే నేను మా అన్నయ్య ఇంటికి వెళ్లిపోతా. మామయ్యను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. సిగ్గు లేకుండా ఇంటికి ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు. పొమ్మనండి బయటకు అని స్వప్న అంటుంది. పోతాను, నా విలువేంటో నాకు తర్వాత అర్థమవుతుందని కాశీ కోపంగా వెళ్లిపోతాడు. నాకు కాశీ మీద కోపం ఉంది. కానీ హ్యాండిల్ చేసే పద్ధతి ఇది కాదని శ్రీధర్ అంటాడు. ఆ మనిషిని మరోసారి ఇంటికి తీసుకురాకండని స్వప్న చెప్పేస్తుంది.

దీపతో కాంచన

దీప మళ్లీ నేను చెప్పేంతవరకూ నువ్వు మా పుట్టింటికి వెళ్లొద్దు. ఆ ఇంటి పరిస్థితి ఏం బాలేదు. ఈ రోజు జ్యోత్స్న ఏం చేసిందో చూశావు కదా. ఈ కోపాలన్నీ నీ మీద చూపిస్తుంది. చెడ్డవాడితో యుద్ధం చాలా ప్రమాదకరం. ఒకసారి కిందపడిబోతే సుమిత్ర వదిన కాపాడింది. ఇప్పుడు పట్టుకోవడానికి ఆవిడ ఉండదు. ఇలాంటప్పుడు నీలాంటి వాళ్లు ఆ ఇంటికి దూరంగా ఉండటం మంచిదని కాంచన అంటుంది.

నా అవసరం

సారీ అత్తయ్య, ఇప్పుడు నేను ఆ ఇంటికి అవసరమని దీప అంటుంది. నువ్వేమైనా ఆ ఇంటి వారసురాలివా? అని కాంచన అడుగుతుంది. అవునత్తయ్యా సుమిత్రమ్మ నా కన్నతల్లి. నన్ను వాళ్లు బిడ్డలా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్లకపోతే ఆ ఇంటి మనుషులను ఎవరు చూసుకుంటారు అత్తయ్య? నా జాగ్రత్త నేను చూసుకుంటా. ఆ ఇంటి క్షేమం నా బాధ్యత అని దీప చెప్తుంది.

మా అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే సాయం చేయాలి కదా దాన్ని రుణం అంటారని శౌర్యకు అర్థమయ్యేలా చెప్తాడు కార్తీక్. దీప సుమిత్ర కూతురు అయి ఉంటే నువ్వు చెప్పింది సరిపోయేదని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More